రోజూ చస్తూ బతకడం జీవితం కాదు! | Break Free From Mental Slavery Now Reality Check | Sathyagrahi
Author Name:Satyagrahi
Youtube Channel Url:https://www.youtube.com/@satyagrahistories
Youtube Video URL:https://www.youtube.com/watch?v=C1zSczUXaBQ
Transcript:
(00:01) [సంగీతం] ప్రపంచంలో అత్యంత భయంకరమైన శిక్ష ఏంటో తెలుసా 70 సంవత్సరాలు లేకపోతే 80 సంవత్సరాలు వచ్చాక మంచం మీద వండర్‌గా పడుకొని వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు నా చేతుల్లో ఒక అద్భుతమైన జీవితం ఉండేది. కానీ పక్కవాడి మెప్పు కోసం చిల్లర భయాల కోసం రోజు చేసిన చిన్న చిన్న రాజీల కోసం నా బ్రతుకును నేను వ్యర్థం చేసుకున్నాను అని ఈడ్చే ఆ నిస్సహాయత ఉంది చూశారా అది నరకం.
(00:31) మీకు తెలుసా మనం రోజు చచ్చిపోతున్నాం. శరీరం బ్రతికే ఉంటుంది కానీ లోపల ఏదో నిశశబ్దంగా నశించిపోతుంది. మనం దీన్నే లైఫ్ అంటున్నాం. కానీ జిడ్డు కృష్ణమూర్తి గారు ఎప్పుడూ ఒక మాట అడిగేవారు. మీరు నిజంగా జీవిస్తున్నారా? లేక కేవలం ఒక అలవాటులా బ్రతుకుతూ నెట్టుకొస్తున్నారా అని ఆయన అడిగిన ఈ ఒక్క ప్రశ్నలోనే మొత్తం మనుషుల బ్రతుకు గుట్టు దాగి ఉంది.
(00:54) ఆయన మాటల్లో ఎంత గాఢత ఉందో అర్థం చేసుకోండి మనం పెద్ద పెద్ద తప్పులు చేసి జీవితాన్ని నాశనం చేసుకోవడం లేదు. రోజు చేసే చిన్న చిన్న రాజీలే మనల్ని మింగేస్తున్నాయి. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మీరు తీసుకునే నిర్ణయాలు నిజంగా మీవా ఒకసారి గుండెల మీద చేయవేసుకొని ఆలోచించండి. ఆఫీస్ లో నచ్చని పని చేయడం సొసైటీ మెచ్చుకుంటుందని అనవసరమైన కార్లు ఫోన్లు కొనుక్కోవడం లోపల ఎన్ని బాధలు ఉన్నా బయటకి మాత్రం పల్లీకలిస్తూ నవ్వడం ఇదంతా ఒక చౌకబారు బ్రతుకు ఈ లో లీవింగ్ కి మనం చెల్లిస్తున్న ఖరీదు ఎంతో తెలుసా మన జీవితం మన విలువైన సమయం మన మనశశాంతి రోడ్డు మీద వెళ్లే కుక్కల గుంపును చూడండి
(01:32) ఒకటి అరిస్తే మిగతావన్నీ ఎందుకు అరుస్తున్నాయో తెలియకుండానే అరుస్తాయి. మనం కూడా సరిగ్గా అలాగే తయారయ్యాము. ఎవడో పక్కింటోడు పెద్ద కారు కొన్నాడు. వెంటనే మనం కూడా ఈఎంఐ లో ఖచ్చితంగా కొన్ని తీరాల్సిందే. ఎవడో Instagram లో ఫోటో పెట్టాడు. వెంటనే మనకు కూడా అసూయ మొదలవ్వాల్సిందే. ఈ పోలిక అనే జబ్బు మనల్ని లోపల నుంచి ఎంత తినేస్తుందో ఎవ్వరూ గుర్తించడం లేదు.
(01:55) జుడు కృష్ణమూర్తి గారు తరచు చెప్పే ఒక అద్భుతమైన సూత్రం ఉంది. కంపారిజన్ ఇస్ ద రూట్ ఆఫ్ ఆల్ వైలెన్స్ అని. సో పోలిక అన్ని హింసలకి మూల కారణం అంటారు ఆయన. పక్కవాడితో మిమ్మల్ని మీరు పోల్చుకోవడం మొదలు పెట్టిన క్షణమే. మీరు మీపై మీరు దాడి చేసుకుంటున్నారు. మీ అసలైన గుర్తింపును మీరే గొంతు నొలిమి చంపేస్తున్నారు. మనం రోజు ఈ పని చేస్తూనే ఉన్నాం.
(02:16) అయినా కూడా నేను చాలా నార్మల్ గా ఉన్నాను అని చెప్పేసి భ్రమపడుతున్నాం. నిజం ఏంటంటే మనం బ్రతకడం లేదు సర్దుకు పోతున్నాం. ఉద్యోగంలో బాస్ తిడుతున్న నోరు మూసుకొని భరిస్తాం. రిలేషన్షిప్ లో ప్రేమ లేకపోయినా మూసుకు వేసుకొని నటిస్తాం. మనసులో ఉన్న నిజాన్ని చెప్పడానికి భయపడి రోజుకు అబద్ధం ఆడతాం. ఈ చిన్న చిన్న రాజీలు ఉన్నాయి చూశారు అవి నిశశబ్దంగా మీ ఆత్మగౌరవాన్ని కూరికి తింటున్నాయి.
(02:38) చివరికి మీకు మిగిలేది ఒక పెద్ద శూన్యం మాత్రమే మీకు ఎప్పుడైనా అనిపించిందా అసలు ఈ రేసులో మనం ఎందుకు పరిగెడుతున్నామ అని చిన్నప్పటి నుంచి మన మెదల్లో ఒక విషయం ఎక్కించారు అందరూ వెళ్లే దారిలోనే వెళ్ళు అప్పుడే నువ్వు సేఫ్ అని మనకి సెక్యూరిటీ కావాలి సేఫ్ గేమ్ ఆడాలి కానీ జిండు కృష్ణమూర్తి గారు ఒక మాట అంటారు ఒక జబ్బు పడిన సమాజానికి తగ్గట్టుగా మీరు సర్దుకు పోవడం మీ ఆరోగ్యానికి ఎలాంటి నిదర్శనం కాదు అని ఎంత పవర్ఫుల్ అబ్జర్వేషన్ కదా ఇది సమాజం మొత్తం ఒక మాయలో బ్రతుకుతుం అంటే మనం అదే మాయలో పడి కొట్టుకుపోతున్నాం. మనం సేఫ్ గా ఉన్నాం
(03:11) అనుకుంటాం కానీ నిజానికి మనం బానిసలయ్యాం. ఈ సమస్య ఎక్కడ మొదలవుతుందో తెలుసా భయం దగ్గర ఒంటరిగా ఉండిపోతామనే భయం సొసైటీ ఏమనుకుంటుందో అనే భయం. మీరు గమనించండి మీ కోరికలు కూడా మీ సొంతం కాదు. పంక్ంటి వాడిని చూసి ఒక కోరిక పడుతుంది. సోషల్ మీడియాలో ఏదో చూసి ఇంకొ కోరిక పడుతుంది. కృష్ణమూర్తి గారు చెప్పినట్లు మనం సెకండ్ హ్యాండ్ హ్యూమన్ బీయింగ్స్ లా తయారయ్యాము.
(03:35) అరువు తెచ్చుకున్న ఆలోచనలు అరువు తెచ్చుకున్న బ్రతుకులు ఈ సొసైటీ మిమ్మల్ని ఎప్పుడూ ఒక అదృశ్యమైన భయంలోనే ఉంచుతుంది. ఎందుకంటే భయపడుతున్న మనిషిని కంట్రోల్ చేయడం చాలా ఈజీ కనుక అందుకే మనం ఈ మైక్రో కాంప్రమైజ్ చేస్తాం. సర్లే అందరూ అలాగే పడుతున్నారు కదా అని చెప్పేసి మనతో మనం ఒక చిన్న అబద్ధం ఆడుతాం. మొదట్లో ఇది చాలా చిన్నగా ప్రమాదం లేనిదిగా అనిపిస్తుంది.
(03:57) కానీ ఆ చిన్న రాజీ పడే గుణమే మీ ఆత్మవిశ్వాసాన్ని పునాదులతో సహా కదిలిస్తుంది. సమాజం గీసిన గీత దాటడానికి ధైర్యం లేక లోపల రగిలిపోతున్నా సరే బయటకి మాత్రం ప్లాస్టిక్‌ల నవ్వులు నవ్వుతూ బతికేస్తున్నాం. మీకు అర్థమవుతుందా ఈ చిన్న చిన్న రాజీలే ఒక పెద్ద అదృశ్య జైలుగోడలా మారి మిమ్మల్ని అందులో శాశ్వత ఖైదీని చేసేయని మరొక లోతైన కారణం ఉంది అదేంటో తెలుసా నాది నేను అని చిన్న గదిలో మనల్ని మనం బంధించుకోవడం మనం నిరంతరం నా డబ్బు నా ఇల్లు నా హోదా నా సుఖం వీటి చుట్టూనే గిరికీసుకొని కొట్టుకులాడుతూ ఉంటాం. జిడ్డు కృష్ణమూర్తి గారు తరచు ఒక
(04:36) సూటి ప్రశ్న వేసేవారు ఈ నేను అనే భావనతో మీరు ఎంతకాలం యుద్ధం చేస్తారు అని మన స్వార్థం ఎప్పుడైతే హద్దులు దాటుతుందో అప్పుడు మనశశాంతి అనేది మొదటి బలి పశువు అవుతుంది. ఎందుకంటే ఎక్కువ కూడబెట్టాలనే ఆరాటం ఉన్న ప్రతి చోట పోగొట్టుకుంటామేమో అనే భయం కూడా పుడుతుంది. అంతే కాదు మనం రోజు మనసుక ఇచ్చే తప్పుడు సంకేతాలు చూడండి. ఇవాళ కాంప్రమైజ్ అయిపోతాను.
(05:00) రేపు చూసుకుందాం అనుకుంటాం. కానీ ఆ రేపు ఎప్పటికీ రాదు. మనం ఒక విషవలయంలో చిక్కుకుపోయాం. ఎలాగంటే మీరు ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంటారు. దాన్ని కప్పచ్చుకోవడానికి ఇంకో 10 సాకులు వెతుక్కుంటారు. ఆ సాకులే మీ నిజమైన వ్యక్తిత్వాన్ని మసగబారుస్తాయి. మనుషులు ఎందుకు డిప్రెషన్ లోకి వెళ్తున్నారు? ఎందుకు లోపల నిరంతరం ఒక రకమైన ఖాళీతనాన్ని మోస్తున్నారు.
(05:25) ఎందుకంటే వాళ్ళు నిజమైన తమను తాము కాదని వేరొకరి ముసుగులో బ్రతుకుతున్నారు కాబట్టి. మీరు ఆలోచించండి ఈ చిన్న చిన్న అవసరాల కోసం మనుషుల గుర్తింపు కోసం మీ అత్యున్నత చేతనని మీ విలువైన కాలాన్ని తాకట్టు పెడుతున్నారు. ఇది చౌకుబారు బరుతు కాక మరి ఏంటి చెప్పండి. ఈ తక్కువ స్థాయి జీవితానికి మీరు చెల్లిస్తున్న వెల ఏమిటో తెలుసా? మీ స్వేచ్ఛ మీ ఆలోచనల్లో స్వేచ్ఛ లేదు.
(05:49) మీ నడతలో స్వేచ్ఛ లేదు, మీ ఎంపికల్లో స్వేచ్ఛ లేదు. మరి ఇలాంటి జీవితం చివరికి దేనికి దారి తీస్తుంది? తీవ్రమైన పశ్చాత్తాపానికి మాత్రమే దారి తీస్తుంది. సరే సమస్య తెలిసింది. దానికి మూలాలు కూడా అర్థమయ్యాయి. మరి ఇప్పుడు ఏం చేయాలి ఏదో ఒక పుస్తకం చదివితే సరిపోతుందా లేక ఎవరి దగ్గరికో వెళ్లి ఆశీర్వాదం తీసుకుంటే అంతా మారిపోతుందా? జిడ్డు కృష్ణమూర్తి గారు ఇక్కడే చాలా కఠినమైన నిజం చెప్తారు.
(06:12) సత్యాన్ని చేరుకోవడానికి ఎలాంటి మార్గాలు లేవు. ఏ గురువు మిమ్మల్ని రక్షించలేడు. మీ స్వేచ్ఛకు మీరే ఏకైక బాధ్యులు అని ఆయన మాటల్లోని పదును చూడండి బాహ్య సహాయం కోసం ఎదురు చూడటం ఆపేసి ముందు మీ వైపు మీరు నిష్కల్మషంగా చూసుకోవడం మొదలు పెట్టాలి. అందులో మొదటి అడుగు ఎక్కడ పడాలంటే సెల్ఫ్ అవేర్నెస్ మీద.
(06:34) మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని మీరు వేసే ప్రతి అడుగును గమనించండి. ఎవరినో ఇంప్రెస్ చేయడానికి మీరు ఒక పని చేస్తున్నప్పుడు క్షణమాగి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఇది నిజంగా నా అవసరమా? లేక లోకం నాపై రుద్దిన భ్రమణ జుడు కృష్ణమూర్తి గారు చెప్పిన ఛాయిస్లెస్ అవేర్నెస్ అంటే ఇదే ఎలాంటి తీర్పులు లేకుండా మంచి చెడుల ముద్రలు వేయకుండా మీ మనసు లోపల జరిగే మోసాన్ని కేవలం ఒక సాక్షిలా గమనించండి.
(07:00) ఎప్పుడైతే ఆ ఎరుక మొదలవుతుందో అప్పుడే ఆటోమేటిక్ గా చిన్న చిన్న రాజులు పడటం ఆగిపోతుంది. రెండవది స్వార్ధపు పరిధిని దాటడం ఎప్పుడు నా లాభం నా నష్టం అనే సంకుచితమైన లెక్కలు వేస్తూ బ్రతికితే మీ జీవితం ఒక వ్యాపార లావేదేవి లాగా మిగిలిపోతుంది. ఇవ్వడంలో ఉన్న ఆనందాన్ని అనుభవించండి. సమాజానికి మీ చుట్టూ ఉన్న మనుషులకి ఎలాంటి స్వార్థం లేకుండా ఉపయోగపడండి.
(07:25) జిడ్డు కృష్ణమూర్తి గారు అంటారు ప్రేమ ఉన్నచోట భయం ఉండదు. స్వార్థం లేని చోట పోలికలకు తావు ఉండదు అని మీ ఆలోచనల్ని నేను అనే ఒక చిన్న పరిధి నుంచి విస్తరింప చేసినప్పుడు మీకు తెలియకుండానే ఒక అద్భుతమైన ప్రశాంతత మీ లోపలికి ప్రవహిస్తుంది. మూడోది పోలికలను పూర్తిగా విరమించుకోవడం. పక్కవాడితో మిమ్మల్ని మీరు పోల్చుకోవడం ఆపిన మరుక్షణమే సగం భారాలు మీ భుజాల మీద నుంచి దిగిపోతాయి.
(07:53) జిడ్డు కృష్ణమూర్తి గారు ఎప్పుడు ఒక లోతైన నిజాన్ని నొక్కి చెప్పేవారు. మీరు ఎవరితోనూ పోల్చుకున్నప్పుడు మాత్రమే మీరు నిజంగా ఎవరో తెలుసుకోగలరు అని ఆయన ఆలోచన ఎంత విప్లవాత్మకమైందో చూడండి. మనం రోజు ఇతరుల స్థాయిని చూసి కుమిలిపోవడానికో లేదా వాళ్ళకంటే ఒక మెట్టు పైన ఉన్నామని చెప్పేసి గర్వపడటానికో సమయాన్ని వృధా చేస్తున్నాం. ఈ రెండు మానసిక వ్యాధులే.
(08:16) ఎప్పుడైతే ఆ రేసు నుంచి మీరు బయట అడుగు పెడతారో అప్పుడు మాత్రమే మీ ఆలోచనలో నిజమైన స్పష్టత వస్తుంది. ఇంకో అత్యంత ముఖ్యమైన విషయం క్షణికమైన సాకులు చెప్పడం ఆపేయండి. మనం రోజూ చిన్న చిన్న అబద్ధాలు ఆడుతూ సర్లే ఇందులో తప్పేముందని చెప్పేసి మనసాక్షిని మత్తులో ఉంచుతాం. కానీ జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పినట్లు చిన్న అబద్ధమైన పెద్ద అబద్ధమైనా అది మీ అంతరంగ సమగ్రతను తునాతునుకలు చేస్తుంది.
(08:43) ఎప్పుడైతే మీరు చేసే ప్రతి చిన్న పనిలోనూ పూర్తి స్పష్టత నిజాయితి ఉంటాయో అప్పుడు మీలో ఒక సహజమైన ఆత్మవిశ్వాసం పుడుతుంది. దానికి సమాజం ఇచ్చే సర్టిఫికెట్లు అవసరం లేదు. ఏ ముసుగులు లేని జీవితం గడపడం కంటే గొప్ప లగ్జరీ ఈ ప్రపంచంలో మరొకటి ఉండదు. పాపం చాలా మందికి ఈ విషయం తెలియదు. ఇప్పుడు అసలైన ప్రయాణం మొదలవుతుంది. మన జీవితాన్ని నిజంగా ఒక అద్భుతంగా ఎలా మార్చుకోవాలి దానికి ఎక్కడికో పారిపోవాల్సిన అవసరం లేదు మీరు ఉన్నచోటే మీరు బ్రతుకుతున్న ఈ క్షణంలోనే ఆ మార్పు జరగాలి.
(09:18) జిడ్డు కృష్ణమూర్తి గారు ఒక అందమైన మాట అంటారు. జీవితం అనేది ఒక నిరంతర ప్రవాహం. దాన్ని గతపు జ్ఞాపకాలతోనో భవిష్యత్తు భయాలతోనో బంధించలేరు అని. ఈ వర్తమానంలో పూర్తిగా జీవించడం నేర్చుకోండి. గతంలో జరిగిన తప్పులను తలుచుకుంటూ కుమిలిపోకండి రేపు ఏమవుతుందో అని ఊహల్లో బ్రతక్కకండి. ప్రస్తుత క్షణాన్ని ఎరుకతో స్వీకరించడమే అంటే అవేర్నెస్ తో స్వీకరించడమే జీవితాన్ని మెరుగుపరుచుకునే మొదటి సూత్రం.
(09:44) ఇక రెండో సూత్రం మీరు నివసించే విధానంలో ఒక ఉన్నతమైన స్పష్టత తెచ్చుకోండి. తక్కువ ఆలోచనలు చౌకబారు కోరికలు క్షణికానందాల కోసం ప్రాకులాడటం మానేయండి. జిడ్డు కృష్ణమూర్తి గారి మాటల్లో చెప్పాలంటే స్వేచ్ఛ అంటే మీకు నచ్చినట్లు విచ్చలవిడిగా ఉండడం కాదు స్వేచ్ఛ అంటే మీలోని భయాల నుంచి బానిస ఆలోచనల నుంచి పూర్తిగా విముక్తి పొందటం.
(10:08) ఎప్పుడైతే మీరు ఇతరుల అభిప్రాయాల కోసం కాకుండా మీ అంతరంగ విలువలకి అనుగుణంగా జీవిస్తారో అప్పుడు మీ జీవితానికి నిజమైన గౌరవం నిజమైన అర్థం వస్తాయి. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ఒకటే గుర్తు చేసుకోండి నేను ఎవరికీ జవాబుదారి కాను కానీ నా మనస్సాక్షికి మాత్రమే జవాబుదారిని చివరిగా జీవిత చరమాంకంలో వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు కళ్ళల్లో కన్నీళ్లు కాకుండా ఒక ప్రశాంతమైన చిరునవ్వు కనిపించాలి.
(10:37) నేను ఏ ముసుగులు వేసుకోలేదు. నాకు నచ్చినట్లు నిజాయితీగా బతికాను. ఎవరితోనూ పోల్చుకోలేదు. చిన్న చిన్న రాజీలతో నా విలువ తగ్గించుకోలేను అని చెప్పేసి ధైర్యంగా చెప్పుకోగలగాలి. జిడ్డు కృష్ణమూర్తి గారు నొక్కి మరి చెప్పినట్లు జీవితాన్ని పరిపూర్ణంగా జీవించిన వ్యక్తికి మరణం అంటే భయం ఉండదు. పశ్చాత్తాపం అసలే ఉండదు. ఈరోజే ఈ చౌకబారు జీవితాన్ని వదిలేసి ఒక ఉన్నతమైన స్వేచ్ఛాయుతమైన జీవితాన్ని ఎంచుకోండి.
(11:04) ఆ జీవితాన్ని అనుసరించండి. ఆ జీవితాన్ని అనుభవించండి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్. [సంగీతం] [సంగీతం] హ [సంగీతం]
No comments:
Post a Comment