Monday, August 17, 2026

 


*(ఆధ్యాత్మిక కుటుంబ స్పెషల్ ఫీచర్)*
1930లో, చెన్నై (అప్పుడు మద్రాస్) కు చెందిన 19 ఏళ్ల ఫిజిక్స్ విద్యార్థి సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ ఇంగ్లాండ్‌ వైపు ఓ నౌక ఎక్కాడు. ప్రతిభతో, పట్టుదలతో స్కాలర్‌షిప్ సంపాదించి, తనతో తీసుకెళ్లింది పుస్తకాలు, కాగితాలు, ఇంకా ఆత్రుతతో నిండిన మనసే.

ఆ ప్రయాణం కఠినంగా సాగింది. జాతి వివక్ష కారణంగా ఇతర ప్రయాణికులు దూరంగా ఉండగా, అతను నిశ్శబ్దం, ఒంటరితనంలో మిగిలిపోయాడు. కానీ నౌక డెక్కుపై నిలబడి బోర్, హైజెన్‌బర్గ్, శ్రోడింగర్ రచనల్లో మునిగిపోయాడు. అరేబియా సముద్రం మధ్య ఒంటరితనంలోనే అతను చేసిన లెక్కలు సృష్టి రహస్యాల్ని మార్చేశాయి.

తన పరిశోధనలో, నక్షత్రాల మృతకాయాలైన వైట్ డ్వార్ఫ్‌లు ఒక పరిమితి వరకు మాత్రమే స్థిరంగా ఉంటాయని కనుగొన్నాడు. మన సూర్యుడి ద్రవ్యరాశి కంటే 1.44 రెట్లు ఎక్కువగా ఉంటే, అవి కూలిపోతాయని నిరూపించాడు. ఈ పరిమితిని ఈరోజు చంద్రశేఖర్ లిమిట్ అని పిలుస్తారు. ఆపై అవి అంతులేని గురుత్వాకర్షణకు లొంగి నలుపు రంధ్రాలుగా (బ్లాక్ హోల్స్) మారిపోతాయి.

అతను కేంబ్రిడ్జ్ చేరుకున్నప్పుడు, ఈ సత్యాన్ని శాస్త్రజగత్తు అంగీకరించలేదు. రాల్ఫ్ ఫౌలర్ సపోర్ట్ చేయలేదు, ఆర్థర్ ఎడ్డింగ్టన్ అయితే బహిరంగంగా ఎగతాళి చేశాడు. కానీ చంద్రశేఖర్ లొంగలేదు. తన సిద్ధాంతాన్ని ప్రచురించాడు, దశాబ్దాల పాటు విమర్శల్ని భరించాడు, చివరకు సృష్టి తానే అతని మాట నిజమని నిరూపించింది.

యాభై ఏళ్ల తర్వాత, 1983లో, ఫిజిక్స్‌లో నోబెల్ బహుమతి అతని చేతికి చేరింది. ఒకప్పుడు నౌక డెక్కుపై ఒంటరిగా నిలబడి, ఎవరూ పట్టించుకోని ఆ విద్యార్థి, సృష్టిలోని లోతైన రహస్యాల్లో ఒకదాన్ని ముందుగానే చూసేశాడు—ప్రకాశవంతమైన నక్షత్రాలకూ ఒక రోజు మౌనం, చీకటి తప్పదని.🍁.        *ఆధ్యాత్మిక కుటుంబం*                      

No comments:

Post a Comment