Monday, August 17, 2026

 "రామాయణం రంకు, భారతం బొంకు" అంటారు ఎందుకు? ఈ సామెత ఎలా వచ్చింది?
గాసట బీసటే చదివి గాథలు త్రవ్వు తెలుగు వాళ్లే ఇలాంటి పదాలు ప్రాస కోసం పాకులాడుతూ కల్పిస్తారు.

అబద్దానికుండే శక్తి సత్యానికి ఎక్కడ ఉంటుంది ?

నిజం తెలియడానికి చాలా ఓపిక, పట్టుదల ,జిజ్ఞాస ఉండాలి.

ఎవరి కర్మాన వాడు పోతాడు —అని అందరినీ స్వేచ్ఛగా వదలివేయడం మన జాతి లక్షణం.

"న బుద్ధి భేదం జనయేత్ అజ్ఞానాం కర్మ సంగినాం" అంటాడు భగవానుడు.

చేతులు కాలి బుద్ధి తెచ్చుకొంటాడు. సొంతంగా అనుభవానికి వస్తే గట్టిగా నిలబడతాడు.. బాగా తెలిసి రావాలి. ఈ జన్మ కు కాకపోతే పై జన్మకు అని పూర్తి స్వేచ్ఛనిస్తాం మనం..

వైరంతోనైనా స్మరించనీ. ! అని.

కామ్యాలు తీర్చేవాడుగా ముందు ఆకర్షిస్తాడు ఇష్ట దైవం .

.అనేక జన్మ సంసిద్ధః అయి, సత్యం తెలుసుకుంటాడు.

కట్టెలు మండుతూ ఉంటే పొగ గూడా వస్తుంది.

*వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే

వేదః ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మనా !*

అని ఒక వైపు చెప్తూ ఉంటే , ఇది రంకు అనే వాళ్ల వి జ్ఞానాన్ని ఏమనగలం ?

రావణాసురుడు, వాలి, శూర్పణఖ ఆదర్శమైనవాళ్ళకు రామకథ అలాగే కనిపిస్తుంది. రాముడు స్త్రీ లోలుడుగా కనిపిస్తాడు.

బొంకి , జూదానికి ముందు చేసుకొన్న ఒప్పందం ఉల్లంఘించి, కుల నాశనం చేసుకొన్నారు ధార్తరాష్ట్రులు.

యుగ ధర్మం అనుసరించి , నోరు లేని జంతువులపైన అస్త్రాలు వేయడం తప్పించి , యుద్ధం తప్పు దారిని బడకుండా సత్య శుభదాయకం అయి, సద్గతి ప్రదంగా కొనసాగడానికి

శ్రేయస్సు కోరే భగవానుని మాటను అనుసరించిన ధర్మజుడు

బొంకినవాడుగా కళ్ళున్న మనకు కనిపిస్తాడు.

. కళ్ళు లేని ధృతరాష్ట్రుడికి గూడా , ఇది తప్పుగా కనిపించలేదు. ఆక్షేపించ లేదు.

కానీ, ప్రతి పనికీ ప్రతిగా మరొక ప్రతి చర్య జరిగి తీరడం ప్రకృతి నైజ గుణం.

* న కేవలం యో మహతోపభాషతే

శ్రుణోతి యస్మాదపి యః సః పాపభాక్ *-- అని దేవీ వచనం.

కర్తా కారయితా చైవ ప్రేరకశ్చానుమోదకః

సుకృతే దుష్కృతే చైవ చత్వారః భాగినః .

అని భారత వచనం. అందుచేత ఊరికే నోరు పారేసుకోగూడదు. త్రికరణాలలో నోరూ ఒకటి.. అది చేసే పనికీ ఫలితం ఉంటుంది గా!

వాకునకుం దెచ్చుట ఉచితమె? అంటాడు నన్నయ. ఆలోచించి గానీ మాట పెగలగూడదు.

* తెలియనివన్ని తప్పులని దిట్ట తనాన వచింపబోకు, నీ పలికిన నోట దుమ్మువడ* —అని పాపం ఒక కవి ఇలాంటి మాటలు వినలేక నోరు చేసుకొన్నాడు.!

No comments:

Post a Comment