కుండలిని శక్తి మేల్కొన్నప్పుడు కనిపించే సంకేతాలు
Author Name:maharshi media
Youtube Channel Url:https://www.youtube.com/@maharshimediatelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=Yc0geASsoBI
Transcript:
(00:01) [సంగీతం] మా గురుదేవైనటువంటి మహంతి హిమాలయగిరిజి మహారాజు వారి పాదపద్మములను మనసులో స్మరించుకొని కుండలిని శక్తి అనేది మానవుడికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అసలు సమస్త కోటి జంతుజాలంలో కూడా ఈ కుండలిని అనే శక్తి ఉండనే ఉంటుంది. కాకపోతే జంతువుల యొక్క వెన్నముక ఆకాశానికి భూమికి సమాంతరంగా ఉండబట్టి వాటిలో కుండలిని శక్తి పైకి లేవడం అనే క్రియ ఉండదు.
(00:39) మానవుడిలో ఈ షట్ చక్రాలలో భూతత్వానికి సంబంధమైనటువంటి మూలాధార చక్రము జలతత్వానికి సంబంధించినటువంటి స్వాధిష్టాన చక్రము అగ్నితత్వానికి సంబంధించిన మణిపూరక చక్రము వాయు తత్వానికి సంబంధించిన అనాహత చక్రము ఆకాశ తత్వానికి చెందిన విశుద్ధి చక్రము ఉంటాయి. ఈ ఐదు పంచభూతాలకు రెప్రజెంటేషన్ ఈ పంచభూతాలతో జీవుడు తయారయ్యాడు కాబట్టి జీవుడు ఆజ్ఞ చక్రం దగ్గర ఉంది.
(01:17) పరమాత్మ అయిన సదాశివుడు సహస్రారం అనబడే బ్రహ్మరంద్రం దగ్గర ఉంటాడు. ఆయన శక్తి అయిన పార్వతీ అమ్మవారు తన కొడుకుైన గణపతి ఉండే మూలాధార చక్రం దగ్గర మూడున్నర చుట్లు చుట్టుకొని ఉంటాయి. మూడున్నర చుట్లు ఎందుకు ఉంటాయి అంటే మొదటి రౌండు మానవుడి జీవుడి యొక్క ఖనిజ జన్మలు రాళ్లుుగా ఖనిజాలుగా రెండవ రౌండు ఆ నుంచి కొంచెం మంచి చైతన్య స్థాయికి వచ్చి చెట్లుగా ఉద్భవిస్తాడు.
(01:54) ఆ చెట్టు బాగా చైతన్యవంతంగా ఉంది అంతకన్నా చైతన్యవంతందమైంది పశుపక్షాలు అది మూడవ రోజు ఇట్ల మానవుడు 84 లక్షల జీవరాశులలో ఈ మూడు స్థితులను దాటుకొని మానవుడుగా వచ్చాడు అర్థంగానే ఉన్నాడు ఈ మానవుడు మాధవుడుగా మారడం లేదు మానవుడు మాధవుడిగా మారేదానికి చేసే సాధనే కుండలిని యోగ సాధన శివ కుటుంబ పరంగా చెప్తే కింద ఉన్న అమ్మవారిని పైన ఉన్న అయ్యవారితో కలపడం ఎక్కడైతే శివం మన శుద్ధత్వంలోకి మనం చేరుకుంటాము
(02:39) సృష్టి రహస్యాలఅన్నీ తెలుస్తాయి. మూలాధారం దగ్గరికి మనం శక్తిని గనుక మేలుకొల్పగలిగితే ఈ మూలాధారం అనేది కడుపులోను పెద్ద పేగులను కంట్రోల్ చేస్తూ ఉంటుంది. బహిర్ అవయవంగా పనిచేస్తూ ఉంటుంది. మనము తిన్న ఆహారంఅంతా అద్భుతంగా జీర్ణమై మలిన పదార్థాలన్నీ శుభ్రంగా బయటికి వెళ్ళిపోయే క్రియ అక్కడ జరుగుతుంది మూలాధారం బాగా యక్టివేట్ అయితే అట్లాగానే స్వాధిష్టానం బాగా యక్టివేట్ అయితే మనలోని జలతత్వం బ్యాలెన్స్ గా ఉంటుంది.
(03:21) రీప్రొడక్టివిటీ ఆర్గాన్స్ బ్రహ్మాండంగా పనిచేస్తాయి. మూత్ర విసర్జన సాఫీగా జరుగుతుంది. మూత్ర పిండాలు మూత్రపు సంచి ఇవన్నీ బలపడతాయి. సైంటిఫికల్ పరంగా మీకు ఈ వివరణ ఇస్తున్నానే కానీ శాస్త్రపరంగా చెప్పుకుంటే వీటితో సంబంధం లేదు అయినా ఈ కాలం వాళ్ళకు శాస్త్ర సంబంధంగాను చెప్పాలా వైజ్ఞానిక పరంగాను చెప్పాలా శరీరంలో జరిగే మంచి లాభాలు ఏంటో చెప్పాల కాబట్టి చెప్పుకొని వస్తుంది.
(03:55) ఇంకా మణిపూరక చక్రం దగ్గరికి వచ్చేసరికి మన అన్నాశయము జీర్ణాశయము చిన్న పేగులు ఇవన్నీ శక్తివంతంగా అయతాయి. ఇంక దాన్ని దాటుకొని అనాహత చక్రం దగ్గరికి వస్తే మన ఊపిరి తిత్తులు గుండె యొక్క పనితీరు అద్భుతంగా మారుతుంది. దాని తర్వాత పైకివస్తే విశుద్ధి చక్రం ఉంటుంది. అక్కడ మన ఓకల్ కార్డ్ అని చెప్పబడే స్వర పేటిక ఉంది. మాట మంచిగా వస్తుంది మధురంగా వస్తుంది మాటలో శక్తి పెరుగుతుంది దాని మూలంగా మీకు వాక్శక్తి పెరుగుతుంది.
(04:36) ఇంకా అక్కడి నుంచి ఈ ఐదింటిని దాటుకుంటే జీవుడు శుద్ధుడు అయిపోతాడు. ఇప్పుడు పంచభూతాత్మకమైన దేహం కాదది కేవలం జీవుడు మిగిలిపోయాడు. దేహో దేవాలయం పోక్త జీవో దేవో సనాతనః అంటారు కదా కాబట్టి ఇప్పుడు జీవుడు ఇంతకుముందు ఉన్న కర్మలన్నీ వదిలించుకొని ఈ కుండలిని యోగం ద్వారా శరీరాన్ని సంపూర్ణంగా స్వాస్థంగా పెట్టుకొని దేవుడితో కలిసేటి ప్రయత్నం చేస్తారు.
(05:06) ఇక్కడ ఈ కుండలిని సాధన చేసేటప్పుడు పూరక కుంభక రేచకాలు అనేటివి ఉంటాయి. ఆ కుంభక స్థితిని ఎక్కువసేపు చేస్తూ చేస్తూ దాని తర్వాత మూలబంధము ఉడియాన బంధము జాలందర బంధము అనే బంధములు గురువు చెప్పినట్లు గురు సుముఖత నేర్చుకొని వాటిని వేస్తూ ఉన్నప్పుడు కుంభించిన ఈ గాలి పైకి పోలేక కిందికి పోలేక ఇడా పింగళ నాడులలోకి పోలేక ఏదో ఒక దినం ఆ సాధకుని అదృష్టము ఊరుక కృపా కరుణా కటాక్షాలతో మనం కుంభించిన ఈ గాలి సుషుమన నాడిలోకి ప్రవేశిస్తుంది.
(05:50) సుషుమన ఒక చివరి అంతములో కుండలిని శక్తి సత్వ రూపంలో తల అడ్డం పెట్టి పడుకొని ఉంటుంది. ఈ కుమ్మిచ్చిన గాలి మాటి మాటికి అక్కడ తగిలిన పాము పడిగ మీద ఇట్లా అంటే పాడిగ లేస్తంది. అదేవిధంగా అది ఏదో ఒక రోజు జరుగుతుంది. ఇదంతా ఒక రోజులో జరిగే క్రియ కాదు ఒక్క సంవత్సరంలో జరిగే క్రియ కాదు. నిరంతరము ఉదయం ఒక మూడు గంటలు సాయంత్రం ఒక మూడు గంటల లెక్కన సాధన చేస్తే సాధన చేసిన మానవుడిలో కుండలిని మేల్కుంటే అతనిలో అత్యద్భుతమైన విచక్షణ జ్ఞానం వస్తుంది. సర్వభూత దయ ఉద్భవిస్తుంది.
(06:36) నేను నిమిత్తమాత్రుని పైనన్న పరమాత్ముడు ఆడిస్తున్నాడు అన్న సంగతి తెలుస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే స్వ ఆత్మ దర్శన ఇది జరుగుింది ఈ కుండలిని గురించి ఇట్లా చేయవలెను ఇట్లా చేయవలేను అన్న సంగతులు అనేక పుస్తకాలలో అనేకమంది మహర్షులు రాసి ఉన్నారు. మహర్షులు రాసింది చదివి చేయడం తప్పు ఒక మంచి సద్గురువు సాధన చేసి ఉన్నత స్థితిలో ఉన్న స్వామి దగ్గర శిశు చేసి ఆయన చెప్పిన విధంగా ఆచరణ చేసుకుంటూ మెట్టు మెట్టు ఎక్కుతూ కుండలిని శక్తిని సాధించుకుంటే అది అత్యంత ఉత్తమం ఆ విధంగా ఈ సాధనను
(07:23) సాధించుకొని ఆ సాధించుకున్న శక్తిని లోక కల్ాణ యాణానికి సమాజ కళ్యాణానికి అందరూ వాడుకొనెదరు గాక లోకా సమస్త సుఖినో భవంతు సర్వేజనాం సుఖినో భవంతు [సంగీతం]
No comments:
Post a Comment