నీమ్ కరోలి బాబా సంపూర్ణ జీవిత చరిత్ర | Neem Karole Baba Complete Life Story | #neemkarolibaba
Author Name:Bhargava Reddy
Youtube Channel Url:https://www.youtube.com/@bhargavareddy1989
Youtube Video URL:https://www.youtube.com/watch?v=FzjWcVGpCj8
Transcript:
(00:06) హాయ్ ఫ్రెండ్స్ నా పేరు భార్గవ రెడ్డి నేను గత కొన్ని సంవత్సరాలుగా మెడిటేషన్ చేస్తున్నాను నాకు యోగులన్న యోగుల జీవిత చరిత్ర అన్నా చాలా ఇష్టం అయితే ఈ మధ్యనే భారతదేశ సుప్రసిద్ధ గురువుల్లో ఒకరైన శ్రీ నీమ్ కరలి బాబా గారి జీవిత చరిత్రను చదవడం జరిగింది ఆ ఆయన యొక్క జీవిత చరిత్ర నాకు ఎంతగానో నచ్చింది సో ఆ యొక్క యొక్క యోగి జీవిత చరిత్రను మీతో పంచుకోవాలని ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలిస్తున్న రోజులవి భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు దేవుడు దైవం అనేటివి ఏవి లేవని అవమానిస్తున్న రోజులు అవి అప్పుడు ఈ దైవం యొక్క ఉనికిని
(00:50) ప్రపంచమంతా తెలియజేయాలని ఒక శక్తి ఒక వ్యక్తి రూపంలో జన్మ తీసుకుంటుంది ఆ శక్తి ఆ వ్యక్తి మరెవరో కాదు శ్రీ శ్రీ శ్రీ నీమ్ కరోలి బాబా గారు ఈయనే మహారాజ్జీ అని కూడా అంటుంటారు ఈయన ఆంజనేయ స్వామి ఉపాసకులు అయితే ఈయనకు భారతదేశం నుంచే కాకుండా ప్రపంచ నలుమూలల నుంచి కూడా భక్తులు ఉన్నారు ఉదాహరణకి భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మాజీ ప్రధానమంత్రి శ్రీ చరణ్ సింగ్ గారు క్రికెట్ సూపర్ స్టార్ అయిన విరాట్ కోహ్లీ అనుష్క శర్మ హాలీవుడ్ యాక్ట్రెస్ జూలియా రాబర్ట్ facebook ఫౌండర్ మార్క్ జుకెన్స్ బర్గ్ అదేవిధంగా ఆపిల్ ఫౌండర్ ఆ
(01:32) స్టీవ్ జాబ్స్ ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే వస్తుంది ఈయన జననము అదేవిధంగా శరీరం వదిలిన రోజు రెండు ఒకటే అంటే ఈయన పుట్టింది సెప్టెంబర్ 11వ తేదీ అయితే ఈయన శరీరం విడిచింది కూడా సెప్టెంబర్ 11వ తేదీ ఇంత పెద్ద మహా గురువు అయినటువంటి శ్రీ నీమ్ కరోలి బాబా గారి జీవిత చరిత్రను ఈరోజు మనం తెలుసుకుందాం నీమ్ కరోలి బాబా సెప్టెంబర్ 11 1900 సంవత్సరంలో ఉత్తర ప్రదేశ్ ఫిరోజాబాద్ జిల్లా అక్బర్పూర్ అనే గ్రామంలో శ్రీ దుర్గా ప్రసాద్ శర్మ శ్రీమతి కౌశల్య దేవి అనే బ్రాహ్మణ దంపతులకు జన్మిస్తారు వీరిది ధనికుల కుటుంబం సో వీరు ధనికులు కావడంతో బాబా
(02:17) పుట్టిన వెంటనే వీరి కుటుంబంతో పాటు ఆ ఊరు మొత్తం కూడా సంబరాలు చేసుకుంటారు బాబాకి తల్లిదండ్రులు పెట్టిన పేరు లక్ష్మీనారాయణ శర్మ ఈ లక్ష్మీనారాయణ శర్మకి ఎనిమిది సంవత్సరాలు వయసు ఉన్నప్పుడు వీరి తల్లి శ్రీమతి కౌశల్య దేవి గారు మరణిస్తారు తల్లి మరణం తర్వాత వీరి తండ్రికి వారి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరూ నచ్చ చెప్పి పిల్లలు చూసుకోవడానికి ఒక ఆడదిక్కు కావాలని ఆయనకు రెండో వివాహం చేస్తారు లక్ష్మీనారాయణ శర్మకి 11 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అక్బర్ పూర్ కి కొంత దూరంలో ఉన్న బాదంబాస్ అనే గ్రామానికి చెందిన రాంబేటి అనే ఆవిడతో పెళ్లి జరుగుతుంది
(02:59) బాబా గారికి 11 సంవత్సరాలు ఆవిడకేమో తొమ్మిది సంవత్సరాలు మీకు డౌట్ రావచ్చు అదేంటి ఇంత చిన్న వయసులో పెళ్లి జరగడం ఏంటి అని పూర్వకాలంలో అందరికీ బాల్య వివాహాలు జరిగేటివి అంటే అసలు పుట్టిన వెంటనే కూడా మాట ఇచ్చుకుండేవారు మా కూతురు మీ కొడుకుకి అని మీ కొడుకు మా కూతురుకి అని సో అదే విధంగా బాబా గారికి కూడా చిన్న వయసులోనే పెళ్లి జరుగుతుంది పెళ్లి జరిగిన కొన్ని నెలలకే బాబా ఎవరికీ చెప్పకుండా అంటే మన లక్ష్మీనారాయణ శర్మ ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుండి వెళ్ళిపోతారు ఈ లక్ష్మీనారాయణ శర్మ కోసం తండ్రి ఊరి ప్రజలందరూ కూడా వెతికి వెతికి అలిసిపోయి
(03:37) ఎంత వెతికినా ఆయన ఆచుకి తెలియదు ఈ సంఘటనే భవిష్యత్తులో ఆయన్ని లక్ష్మీనారాయణ శర్మ నుంచి ఆయన నీమ్ కరలి బాబాగా ఎదగడానికి తోడ్పడుతుంది అలా ఇంటి నుంచి వెళ్ళిపోయిన లక్ష్మీనారాయణ శర్మ గుజరాత్ రాజ్కోట్లో ఒక ఆశ్రమంలో చేరుతాడు అక్కడ ఈయన అందరికంటే చిన్నవాడు గురువుకి సేవ చేసుకొని ఎవరైతే విద్యార్థులు ఉంటారో సాధకులు ఉంటారో వారందరికీ సేవ చేసుకుంటూ ఉండేవారు ఈయన యొక్క క్రమశిక్షణ సేవా తత్వం చూసి ఆ ఆశ్రమ గురువు ఈయనకు సాధన రహస్యాలు చెప్పి సాధన చేసుకోమంటారు అలా ఈ లక్ష్మీనారాయణ శర్మ అలా సమయం దొరికినప్పుడల్లా ఈయన గంటల కొద్దీ సాధన చేసుకునేవారు అక్కడ ఆ ఆశ్రమ
(04:23) గురువే ఈయన్ని లక్ష్మీనారాయణ శర్మ నుంచి బాబా లక్ష్మణ్ దాస్ గా ఈయన పేరును మారుస్తారు అంతేకాకుండా ఈయన భక్తి శ్రద్ధలు చూసి అతి తక్కువ కాలంలోనే ఆ ఆశ్రమానికి ఉత్తరాధికారి చేస్తారు అయితే అతి చిన్నవాడైన ఈ లక్ష్మణ్ దాస్ ఆ ఆశ్రమానికి ఉత్తరాధికారి అవ్వడం మిగిలిన విద్యార్థులకు నచ్చదు ఎందుకంటే మాకంటే వయసులో చిన్నోడు నిన్న గాక మొన్న వచ్చాడు అంటే ఇతను చెప్పింది మేము వినాలా అని ఆ ఆశ్రమ గురువు పైన వాళ్ళు కోపంతో ఉంటారు ఈ విషయం తెలుసుకున్న లక్ష్మణ్ దాస్ ఆశ్రమ గురువు దగ్గరికి వెళ్లి అనుమతి తీసుకొని అక్కడినే వెళ్ళిపోతాడు అలా వెళ్ళిన బాబా
(05:07) లక్ష్మణ్ దాస్ గారు బబనియా అనే గ్రామానికి వెళ్లి అక్కడ ఆ గ్రామానికి దగ్గరలో ఉన్న ఒక చెరువులో ప్రతిరోజు సాధన చేసుకునేవారు అంటే ఏదైతే రాజ్కోట్ ఆశ్రమంలో గురువు సాధన రహస్యాలు చెప్పారో అదే సాధనని ఈయన బబనియా గ్రామంలో అక్కడికి కొంత దూరంలో ఉన్న చెరువుకి వెళ్లి ఆ చెరువుల్లో గంటలు గంటలు సాధన చేసుకునేవారు కొంతమంది భక్తులు చెప్పేవారు ఈయన రామ జపం జపిస్తే సాక్షాత్ హనుమంతుడు ఈయన పక్కన వచ్చి కూర్చునేవారంట అంటే అంత బాగా ఆయన రామ జపం చేసేవారంట అదే విధంగా కొంతమంది ఈయనను అంటుంటారు సాక్షాత్ ఆ హనుమంతుడి అవతారం అని అలా అక్కడ ఆయన ఆ చెరువులో గంటలు గంటలు సాధన చేసుకునేవారు
(05:52) అదే బబనియా గ్రామంలో ఈయన మొట్టమొదటి హనుమంతుడి గుడిని కట్టిస్తారు ఈయన స్వహస్తాలతో విగ్రహాన్ని చేసి ఒక గుడిని నిర్మిస్తారు సో ఈయన దినచర్య ఏంటంటే చెరువుకి వెళ్లడం చెరువులో గంటల కొద్దీ సాధన చేయడం మిగిలిన సమయంలో ఆయన ఆ గుడిలోకి వచ్చి ఆ జపం చేసుకోవడం ఇలా కొన్ని నెలలు జరుగుతాయి గంటలు గంటలు సాధన చేయడం వల్ల అతి తక్కువ కాలంలోనే ఈయనకు అనేక సిద్ధులు లభిస్తాయి ఆ సిద్ధులు ఎలా ఉండేటివి అంటే ఒక భక్తుడు వచ్చి ఇది ఆయన బయోగ్రఫీ లో ఉంది ఒక భక్తుడు వచ్చి బాబా నాకు జిలేబి తినాలని ఉంది అని అడుగుతాడు జిలేబి తినాలంటే బాబా దగ్గర ఏమి షాప్ లేదు కదా జిలేబి మరి ఎలా
(06:35) తింటాడు అంటే ఆయన సిద్ధులు ఎలా ఉంటాయి అంటే ఈయన ఆయన చేతిని ఇలా వెనక్కి తీసి మళ్ళీ ముందుకు తీసుకొచ్చే లోపల ఆయన చేతిలోకి ఆ జిలేబి ప్యాకెట్ వచ్చేది ఆయన భక్తుడికి ఇచ్చేవాడు ఇలా వేసేవాడు సో అంతలా ఉండేటివి ఈయన సిద్ధులు ఇలా ఈయన సిద్ధులు తెలిసి ఆ బబనియా గ్రామ ప్రజలందరూ కూడా ఈయనకు భక్తులుగా మారుతారు అయితే ఈయన ఆ చెరువుకి వెళ్లి గంటలు తరబడి సాధన చేయడం వల్ల ఈయన్ని తలయ బాబా అని పిలిచేవారు హిందీలో తలాబ్ అంటే చెరువు అంటే ఈ చెరువులోకి వెళ్తే సాధన చేస్తాడు కదా కాబట్టి తలాబ్ ని వాళ్ళు తలయ బాబా అని పిలిచేవారు మనం తెలుగులో చెప్పాలంటే చెరువు బాబా అని మొట్టమొదట
(07:20) తల్లిదండ్రులు పెట్టిన పేరు లక్ష్మీనారాయణ శర్మ తర్వాత గుజరాత్ రాజ్కోట్ లోని ఆశ్రమ గురువు పెట్టిన పేరు బాబా లక్ష్మణ్ దాస్ తర్వాత తర్వాత బమనియా గ్రామ ప్రజలు ఈయనకు పెట్టిన పేరు తలయ బాబా ఇక్కడ నేను మీకు ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను అదేంటంటే బాబా బాబా అంటుంటే తలయ బాబా అంటుంటే మీరేదో 40 ఏళ్ళు 50 ఏళ్ళు లేదా 60 సంవత్సరాలు వచ్చిన బాబా అనుకుంటుండొచ్చు కాదు అప్పటికి ఆయన వయసు 16 సంవత్సరాలు ఇన్ని చేస్తుంది అంటే ఇన్ని సిద్ధులు పొంది భక్తులు చేయదడితే అది ఇస్తుంది ఒక 50 60 సంవత్సరాల గురువు కాదు ఒక 16 సంవత్సరాల ఒక యువకుడు అలా అక్కడ కొన్ని
(08:06) నెలలు గడిపిన తర్వాత ఇక అక్కడి నుంచి ఆయనకు వెళ్ళాలనిపిస్తుంది ఆ ప్రాంతానికి కొంత దూరంలో మాతాజీ అనే ఒక ఆవిడ ఉంటుంది ఆవిడకి ఆ గుడి అన్ని అప్పజెప్పి బాబాజీ అక్కడి నుంచి వచ్చేస్తారు ఒకసారి బాబా లక్ష్మణ్ దాస్ అదే మన తలయ బాబాకి ఆయనకు గంగా స్నానం చేయాలనిపిస్తుంది సో దాని కోసమని అంటే గంగా స్నానం చేయాలంటే గడియా ఘాటుకి వెళ్ళాలి ఉత్తరప్రదేశ్ లో ఉన్న గటియా ఘాటుకి వెళ్ళాలి దాని కోసమని ఈయన ట్రైన్ లో వెళ్తుంటారు సో ఈయన ఏమో యోగి ఈయన దగ్గర ఒక రూపాయి ఉండదు సరే ట్రైన్ లో ప్రయాణిస్తుంటాడు ఈ లోపలే టిసి వచ్చి ఈయన పైకి కిందకి చూస్తాడు ఆ టిసి బ్రిటిష్
(08:49) వారు అన్నమాట ఈ స్టోరీ మొత్తం కూడా మన స్వతంత్రం రాకముందు జరిగే స్టోరీ సో అతను వచ్చి పైకి కిందికి చూసి టికెట్ అని అడుగుతాడు ఈయన దగ్గరేమో టికెట్ ఉండదు వెంటనే వెంటనే అతను ఏం చేస్తాడు నీకలి బాబాని దింపేయాలని ప్రయత్నిస్తాడు బాబా చెప్తారు లేదు నేను అట్లా ఒక యోగిని నా దగ్గర డబ్బులు ఏమి లేదు దయచేసి నన్ను వెళ్ళనివ్వు అని అడుగుతాడు టిసి ఏం చేస్తాడంటే నిర్దాక్షణంగా ట్రైన్ చైన్ లాగి బాబాని దింపేస్తారు దింపేసిన తర్వాత టిసి వెంటనే సిగ్నల్ ఇస్తాడు ట్రైన్ వెళ్ళడానికి ట్రైన్ కదలదు బాబా ఏమో వెళ్లి ఆ దింపారు కదా బాబా ఏమో వెళ్లి ఒక చెట్టు
(09:29) కింద కూర్చొని పద్మా రూమ్ లో కూర్చొని ఆయన దగ్గర యోగదండం ఉంటే దాని మీద చెయ్యి పెట్టుకొని ఇలా ట్రైన్ వైపు చూస్తూ ఉంటాడు ఈ లోపల టిసి ట్రైన్ వెళ్ళడానికి సిగ్నల్ ఇస్తాడు ఎంతసేపైనా ట్రైన్ కదలదు సరే ఎందుకు ట్రైన్ కదలట్లేదా అని ఆ ట్రైన్ ఇంజనీర్ డ్రైవర్ టెక్నీషియన్ అందరూ వచ్చి ట్రైన్ మొత్తం చెక్ చేస్తారు అంటే ఇంజన్ మొత్తం చెక్ చేస్తారు వీళ్ళకేం అర్థం కాదు ఇలా కొన్ని గంటలు గడిచిపోతుంది అయితే కొన్ని గంటల పాటు ట్రైన్ అక్కడ ఆగిపోవడం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ వచ్చి గుమిగూడి ఆ ట్రైన్ ని చూస్తుంటారు అయితే అందులో ఒక వ్యక్తి ఈ బాబాని గుర్తుపడతాడు
(10:08) గుర్తుపట్టి అసలు ఏం జరిగిందని తెలుసుకుంటాడు తెలుసుకుంటే అక్కడున్న ఒక ప్రయాణికుడు ఈ కథ మొత్తం చెప్తాడు అంటే బాబాని ఇలా ఆయన ట్రైన్ ఆపి దింపేశారండి అప్పుడు ఈ వ్యక్తి పరిగెత్తుకుంటూ టికెట్ కలెక్టర్ దగ్గరికి వెళ్లి చెప్తాడు అసలు మీరు ఎంత పెద్ద తప్పు చేశారో మీకు తెలుసా ఆయన్ని ఇలా దింపేసి వెళ్లి ఆయన క్షమాపణ అడగండి సో అడిగిన వెంటనే ఆయన క్షమిస్తే వెంటనే ఈ ట్రైన్ స్టార్ట్ అవుతుంది అని చెప్తాడు ఇంకా చేసేదే లేక అంటే వీళ్ళు కొన్ని గంటల పాటు ప్రయత్నించిన వీళ్ళకి ఎక్కడ ప్రాబ్లం ఉందో తెలియలేదు ఇంకా చేసేది ఏం లేదు ఆ వ్యక్తి వచ్చి బాబా
(10:42) దగ్గరికి వస్తాడు ఈ లోపలే ఆ ఎవరైతే ఆ బాబాని గుర్తుపట్టాడో ఆ వ్యక్తి వచ్చి బాబా బాబా మీరు మాకు ఒక చిన్న సహాయం చేసి పెట్టాలి ఏంటంటే ఇక్కడికి కొంత దూరంలో మా ఊరు ఉంది మా ఊరి ప్రజలు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలంటే ఎలాంటి రవాణా సౌకర్యం లేదు దయచేసి మీరు కరుణించి ఎక్కడైతే ట్రైన్ ఆగిందో ఈ ప్లేస్ లో మాకు రైల్వే స్టేషన్ వచ్చేటట్లు చేయండి దీనివల్ల ఏమవుతుంది అంటే మా ఊరి ప్రజలందరికీ మేలు జరుగుతుంది అని బాబాని ప్రాధాయ పడతాడు ఇంతలోగానే టికెట్ కలెక్టర్ వచ్చి బాబా నన్ను క్షమించండి మీ గురించి తెలియదు మీ శక్తి గురించి తెలియక నేను ఇలా
(11:22) చేశాను అని క్షమాపణ కోరుతాడు కోరితే అప్పుడు బాబాజీ సరే ట్రైన్ అయితే కదులుతుంది కానీ నువ్వు నాకు సహాయం చేసి పెట్టాలి అదేంటంటే ఎక్కడైతే ఇక్కడ నువ్వు నన్ను దింపేసావో అదే ప్లేస్ లో రైల్వే స్టేషన్ రావాలి సో నువ్వు మీ పై అధికారులతో మాట్లాడి ఇక్కడ రైల్వే స్టేషన్ వచ్చేటట్టు చేస్తే ఈ ట్రైన్ కదులుతుంది అని చెప్తాడు అప్పుడు టికెట్ కలెక్టర్ మాట ఇస్తాడు కచ్చితంగా నేను పై అధికారులతో మాట్లాడి ఈ ట్రైన్ ఎక్కడైతే ఆగిందో మిమ్మల్ని ఎక్కడైతే దింపానో ఆ ప్లేస్ లో రైల్వే స్టేషన్ కట్టించే బాధ్యత నాది అని చెప్పి చెప్పిన తర్వాత ఈయన ఈ బాబా
(12:03) లక్ష్మణ్ దాస్ గారు ఇలా ట్రైన్ వైపు చూస్తారు చూసిన వెంటనే ట్రైన్ స్టార్ట్ అవుతుంది మీకు అనిపించొచ్చు ఇదేదో సినిమా స్టోరీ అని కానీ నిజంగా జరిగిన ఒక సంఘటన ఇక ట్రైన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈ ఊరి ప్రజలు ఎవరైతే అక్కడ జనాలు వచ్చి గుమిగూడారో ఆ జనాలందరూ పక్కనే ఉన్న వారి ఊరికి వెళ్లి ఆ ఊరికి వెళ్లి ఆ ఊర్లో ఉన్న సర్పంచ్ కు ఈ స్టోరీ మొత్తం చెప్తారు చెప్పి అయ్యా ఇలా ఒక గొప్ప యోగి ఆయన ఇక్కడే ఉన్నారు సో మనమంతా కలిసి ఈ యోగిని మన ఊర్లో ఉండేటట్లు చేద్దాము అని ఆ సర్పంచ్ ని తీసుకొచ్చి ఈ నీకలి బాబా గారి దగ్గరికి వస్తారు వచ్చి
(12:44) అందరూ రిక్వెస్ట్ చేస్తారు బాబా మీరు మా ఊరికి రండి మీకు మేము అన్ని చూసుకుంటాం ఇలా అంటే అప్పుడు బాబా సరే నేను మీ ఊరికి వస్తాను నాకు సాధన చేసుకోవడానికి ఒక గుహ కట్టించండి అని అడుగుతారు అప్పుడు ఆ ఊరి ప్రజలందరూ కూడా కూడా ఆ సర్పంచ్ ఆ ఊరి ప్రజలందరూ కలిసి బాబాకి ఒక గుహ కట్టిస్తారు సో బాబా ఆ గుహకెళ్లి సాధన చేసుకుంటూ ఉంటారు ఏ విధంగా అయితే ఆ టికెట్ కలెక్టర్ మాట ఇచ్చారో అదేవిధంగా అది తక్కువ కాలంలోనే ఎక్కడైతే ట్రైన్ ఆపి బాబాని దింపేశారో అదే ప్లేస్ లో రైల్వే స్టేషన్ వస్తుందన్నమాట అప్పుడు ఆ రైల్వే స్టేషన్ పేరు అంటే అక్కడికి కొంత దూరంలో
(13:25) నీమ్ కరోలి అనే గ్రామం ఉంటుంది సో ఆ గ్రామం పేరుని ఆ రైల్వే స్టేషన్ పేరుగా పెడతారు అదేవిధంగా ఆ బాబా వల్ల అక్కడ రైల్వే స్టేషన్ వచ్చింది కాబట్టి ఆ ఊరి ప్రజలందరూ కూడా నీమ్ కరోలి బాబా అని పిలవడం మొదలు పెడతారు అలా మన లక్ష్మీనారాయణ శర్మ అదే లక్ష్మణ్ దాస్ అదే తలయ బాబా గారు నీమ్ కరోలి బాబాగా పేరు పొందుతారు ఇలా ఆయనకు నీమ్ కరోలి బాబా అని పేరు వస్తుందన్నమాట అప్పటికి ఆయన వయసు 18 సంవత్సరాలు మాత్రమే ఒకసారి బాబా ఆ నీమ్ గ్రామానికి కొంత దూరంలో గుహలో కూర్చుని సాధన చేసుకుంటూ ఉంటారు తపస్సు చేసుకుంటుంటే ఒక భక్తుడు ఏం చేస్తాడంటే ఆహారం ఇద్దామని పాలు తీసుకొని
(14:13) వెళ్తారు ఈయన గుహ ఎంట్రన్స్ లోకి వెళ్తాడు వెళ్లి ఆ గుహలో ఆ బాబాని చూసి ఆ పాలు తీసుకొచ్చిన వ్యక్తి సృహ తప్పి పడిపోతాడు ఏంటంటే బాబా కూర్చుని తపస్సు చేసుకుంటుంటే బాబా ఒళ్ళు మొత్తం గుహ మొత్తము పాములు ఉంటాయి అన్నమాట అంటే అన్ని పాములను ఆయన ఎప్పుడూ చూసి ఉండడు సో ఒక్కసారిగా ఆ పాములను చూసి అసృహపై పడిపోతాడు అప్పుడు బాబా తపస్సులో నుంచి బయటకు వచ్చి అతన్ని లేపి నేను చెప్పాను కదా నేను సాధన చేసుకునేటప్పుడు ఎవరు ఇక్కడికి రాకూడదని అని చెప్పి అతను తెచ్చిన పాలు తీసుకొని తాగేసి అతన్ని అక్కడి నుండి పంపిస్తాడు కొంతమంది చెప్పేవాళ్ళు బాబా రామ జపం గనక
(14:59) జపిస్తే సాక్షాత్తు హనుమంతుల వారే ఈయన పక్కన వచ్చి కూర్చునేవారంట కొందరికి ఆ హనుమంతుడు దర్శనం ఇచ్చేవారంట సో ఇదివరకే నేను వీడియో స్టార్టింగ్ లోనే చెప్పాను నీమ్ కరలి బాబా గారు ఆంజనేయ స్వామి ఉపాసకులు ఈయన జపించే విధానం ఆ రామ జపానికి ఆయన అంత ఇష్టపడేవాడంట హనుమంతుడు ఇంకొక అనుభవం చెప్తాను అదే నీమ్ కరోలి ఊర్లో ఒక భక్తుడు ఉంటాడు అతనికి ఏంటంటే ఈ నీమ్ కరలి బాబా తో కలిసి బృందావన్ వెళ్లి అక్కడున్న గుడులన్నీ దర్శనం చేసుకొని రావాలని ఒక కోరిక ఉంటుంది అయితే ఆ వ్యక్తి బాబా దగ్గరికి వచ్చి బాబా బాబా నాకు ఒక కోరిక ఉంది మీతో పాటు కలిసి నేను బృందావనం
(15:44) వెళ్ళాలి అక్కడున్న గుళ్ళన్నీ చూడాలనుకుంటున్నాను దయచేసి రండి బాబా అని ప్రాధేయ పడతాడు అప్పుడు బాబా సరే నేను వస్తాను నువ్వు వెళ్ళు నేను వచ్చి నిన్ను బృందావనలో కలుసుకుంటాను అని చెప్తారు అలా భక్తుడు బృందావన్ వెళ్తాడు వెళ్తే బాబా బృందావనంలో ఆ భక్తుడిని కలుసుకుంటాడు కలుసుకుని ఇద్దరు అక్కడున్న గుళ్ళని చూస్తారు చూసిన తర్వాత బాబా ఆ వ్యక్తిని నువ్వు వెళ్ళు నేను తర్వాత వస్తాను అని చెప్తాడు ఈ భక్తుడు తన ఊరికి తిరిగి వచ్చి ఆ ఊరి ప్రజలందరికీ నేను చాలా సంతోషంగా ఉన్నాను నా కోరిక తీర్చారు ఆయనతో పాటు ఆ గుళ్ళు చూడాలన్న కోరికను తీర్చారు అని
(16:25) ఎంతో సంతోషంతో చెప్తారు అయితే ఆ ఊరి ప్రజలు కూడా చెప్తారు అరే నువ్వేం చెప్తున్నావు ఈ బాబా ఇక్కడే ఉన్నారు ప్రతి రోజు మేము దర్శనం చేసుకుంటున్నాము నువ్వు చెప్తున్నావు నీతో పాటు వచ్చారని కాదు కాదు అని తర్వాత వీళ్ళకి తెలుస్తుంది అదేంటంటే ఒకేసారి అనేక శరీరాలతో అనేక చోట్ల ఉండేవారు బాబా ఇక్కడేమో నీ కొరలి ఊర్లో గుహలో కూర్చొని తపస్సు చేసుకునేవారు బృందావనలో భక్తుడి కోరికను తీర్చారు ఇలా ఒకే సమయంలో అనేక శరీరాలతో ఆయన ఆ భక్తుల యొక్క కోరికలు తీర్చేవారు అన్నమాట ఇంకొక అనుభవం చెప్తాను అదే నీన్ ఊర్లో రామ్సేవక్ అనే ఒక భక్తుడు ఉండేవారు ఈ రామ్ సేవక్
(17:10) గారు ఏంటంటే పెళ్లై కొన్ని సంవత్సరాలు అయినా కూడా ఈయనకు పిల్లలు కలగరు దాని కోసమని తిరగని గుడి ఉండదు వెళ్ళని హాస్పిటల్ ఉండదు ఎవరు ఏం చెప్పినా చేసేవారు ఇలా చేసి చేసి అలసిపోయి ఈ బాబా ఎప్పుడైతే నియమములో వెళ్తారో ఈ బాబా మహిమ తెలిసి ఆ రామ్సేవ గారు బాబా దగ్గరికి వచ్చి చెప్తారు బాబా ఇలా నాకు పెళ్లి అయి ఇన్ని సంవత్సరాలు అయింది నాకు పిల్లలు కలగలేదు నాకు ఏదైనా దారి చూపించండి అని ప్రాధేయ పడతాడు అప్పుడు బాబా ఒక ఆపిల్ ఇచ్చి ఈ ఆపిల్ ని నీ భార్యకు తినిపించు నీకు పిల్లలు కలుగుతారు అని చెప్తాడు రామసేవక్ ఎంతో సంతోషంగా ఆపిల్ తీసుకొచ్చి
(17:51) వాళ్ళ భార్యకు తినిపిస్తాడు కొన్ని నెలల్లోనే వీరికి పండంటి మగబిడ్డ జన్మిస్తాడు ఈ శుభ సందర్భంలో ఆ గ్రామసేవక్ బాబా దగ్గరికి వచ్చి బాబా బాబా మీరు చెప్పినట్టుగానే నాకు మగబిడ్డ పుట్టాడు ఈ శుభ సందర్భంలో నేను ఈ ఊరి ప్రజలకు మంచి చేయాలనుకుంటున్నాను అదేంటంటే ఈ ఊరి ప్రజలకు తాగునీరు లేదు వారి కోసమని నేను ఒక మంచి నీటి బావిని తవ్వించాలనుకుంటున్నాను అని చెప్తాడు చెప్పి దానికి మీ అనుమతి కావాలి బాబా అని అడుగుతారు అడిగితే బాబా సరే నాయనా వెళ్లి ఆ పని మొదలు పెట్టు అంటాడు అలా రామ్సేవకు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ నీకొకరలి ఊర్లో ఒక బావిని తవ్విస్తాడు
(18:35) తవ్వించిన తర్వాత తీర ఆ బావిలో ఉప్పు నీరు పడతది అన్నమాట ఈ ఉప్పు నీరు పడేసరికి అతనికి ఏం అర్థం కాదు అంటే ఉప్పు నీరు తాగలేరు కదా సో మళ్ళీ ఆ రామ్ సేవ కన్తను పరిగెత్తుకుంటూ బాబా దగ్గరికి వచ్చి బాబా బాబా నేను ఎంతో కష్టపడి ఇట్లా బావిని తవ్వించాను ఊరికి మంచి జరగాలని కానీ ఆ బావిలో ఉప్పు నీరు పడ్డాయి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు బాబా అని అడుగుతారు అప్పుడు బాబా వెళ్లి రెండు సంచుల చక్కెర తీసుకెళ్లి ఆ బావిలో కలిపేయండి అంటాడు అలా రామ్సేవకు రెండు సంచుల చక్కెర తీసుకెళ్లి ఆ బావిలో కలిపేస్తాడు అంటే ఆ నీళ్లలో కలిపేస్తారు కలిపిన వెంటనే ఆ బావిలో
(19:17) నీళ్లు మొత్తం తియ్యగా మారిపోతాయి అప్పటినుంచి ఇప్పటికి కూడా నీమ్ కొరలి అనే గ్రామంలో ఆ బావి ఉంది ఆ ఊరి ప్రజలు ఆ బావి నీరునే తాగునీరుగా వాడుతున్నారు సో ఇలా ఉండేటివి ఆయన మహిమలు ఇలా ఆయన అందరి కోరికలు తీర్చేవారు మీకు ఇంకొక ఆయన అనుభవం చెప్తాను నీకరులి బాబా గారు అదే ఊర్లో హనుమంతుడి గుడి కట్టించాలి అనుకుంటారు అయితే దీని కోసమని బాబా ఆ ఊర్లో ఉన్న అందరి దగ్గర చందాలు అడుగుతుంటారు అదే క్రమంలో ఆ ఊర్లో ఒక వ్యాపారి ఉంటాడు అతనికి ఒక బట్టల దుకానం ఒక కిరాణ దుకానం ఉంటుందన్నమాట సో బాబా అతని దగ్గరికి వెళ్లి ఇలా నేను గుడి కడుతున్నాను నీ
(20:01) వంతుగా ఆ గుడికి ఇటుకలు ఇసుక ఇవ్వాలి అని అడుగుతారు ఆ వ్యాపారి సరే నేను ఇస్తాను అంటాడు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ బాబా వచ్చి గుర్తు చేస్తాడు ఇలా నువ్వు ఇటుకలు ఇసుక ఇస్తాన్నావు మరి ఎప్పుడు ఇస్తున్నావు అని ఆ వ్యాపారి ఉన్నట్టుండి అదేంటి బాబా నా దగ్గర ఏమీ లేదు కదా సో నేను ఎలా ఇవ్వగలను దయచేసి నేను ఇవ్వలేను సో నా దగ్గర ఏమీ లేదు అని బాబాకి చెప్తాడు చెప్పిన తర్వాత సరే బాబా అక్కడి నుంచి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతారు ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత తర్వాత ఒకరోజు అనుకోకుండా ఆ వ్యాపారి బట్టల షాపు కిరాణ షాపు అనుకోకుండా అగ్గి మండుకుంటుంది
(20:38) అన్నమాట అగ్గి మండుకుంటే ఈ వ్యాపారి అక్కడున్న ఆ జనాలను తీసుకొని నీళ్లను తీసుకొచ్చి ఆ మంటల పైన చల్లుతుంటారు అయితే విచిత్రం ఏంటంటే వీళ్ళు ఎంత నీళ్లు చల్లుతుంటే ఆ మంటలు ఇంకా ఎక్కువ అవుతుంటాయి ఎలాగైతే మండే మంటలు మనం కిరోసిన్ పోస్తే మంట ఇంకా ఎక్కువ అవుతుంది కదా అదే విధంగా అక్కడ వీళ్ళు నీళ్లు పోస్తే చూస్తుంటే ఆ మంటలు ఇంకా ఎక్కువ అవుతుంటాయి ఈ వ్యాపారికి ఏం అర్థం కాదు అప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్లి నిమమ్లి బాబా కాళ్ళ మీద పడి బాబా బాబా ఇలా నా షాపులు రెండు కాలిపోతున్నాయి దయచేసి మీరు నాకు ఏదైనా నాకు సహాయం చేయండి అని ఆయన కాళ్ళ మీద పడతాడు కాళ్ళ మీద పడితే బాబా
(21:18) నవ్వుతూ అదేంటి నువ్వు పేదవాడివి కదా నీ దగ్గర ఏమీ లేదన్నావ్ మరి ఈ షాపులు ఏంటి ఇదంట అని అడుగుతారు అంటే ఆ వ్యాపారికి అప్పుడు అర్థమవుతుంది ఎందుకంటే బాబా రెండోసారి వెళ్తారు కదా నువ్వు ఎప్పుడు ఇస్తున్నావ్ ఇటుకలు తీసుకెళ్లి అంటే అప్పుడు నా దగ్గర ఏముంది బాబా నేను పేదవాడిని నేనేమి ఇచ్చుకోలేను అంటాడు అప్పుడు బాబా దానికి అరే నువ్వు పేదవాడివి కదా మరి నీ దగ్గరికి ఈ షాపులు ఎలా వచ్చాయి ఎలా కాలుతున్నాయి ఈ షాపులు అని అడుగుతారు అప్పుడు బాబా కాళ్ళ మీద పడి లేదు బాబా మీరు అడిగిన ఇటుకలు ఇసుకలు ఇస్తాను దయచేసి మీరే నాకు ఏదైనా సహాయం చేయండి అంటే
(21:52) అప్పుడు బాబా ఉండి పో అవేం కాలేదులే పో పోయి చూసుకో పో అంటాడు ఈ వ్యాపారి పరిగెత్తుకుంటూ వచ్చి తన షాపుల దగ్గరికి వచ్చి చూస్తే ముందు ఏ విధంగా షాప్స్ ఉండేటో అదే విధంగా ఉంటాయి అన్నమాట అంటే మంట మండుకోక ముందు తన షాపులు ఎలా ఉంటాయో అలా ఉంటాయి తన షాప్ ముందు కొన్ని ఎండు మిరపకాయలు కాలి బూడిదే పడి ఉంటాయి అన్నమాట ఇలా ఆయన అనుభవాలు చాలా అద్భుతంగా ఉంటాయి అన్నమాట ఇంకొకసారి ఏమవుతుంది అంటే కొంతమంది ఒక వ్యక్తిని ఇనుప గొలుసులతో కట్టేసి బాబా దగ్గరికి తీసుకొస్తారు తీసుకొస్తే బాబా ఆ వ్యక్తిని చూసి అరే ఎందుకు ఇలా చేస్తారు చేస్తున్నారు అది అలా చేయకూడదు అతన్ని
(22:32) వదిలేసేయండి ఆ ఇనుప గొలుసుల నుంచి వదిలేసేయండి అంటారు అంటే ఆ ఎవరైతే వ్యక్తిని తీసుకొచ్చారో వాళ్ళు చెప్తారు లేదు స్వామీజీ ఈ వ్యక్తికి పిచ్చి పట్టింది ఇతను గొలుసులు వదిలితే ఎవరిని పడితే వాళ్ళని కొడతాడు అని అంటారు అంటే అప్పుడు బాబా నేను చెప్తున్నాను కదా అతని గొలుసులు తీసేయండి అంటాడు సరే అక్కడున్న వాళ్ళు ఆ గొలుసును తీసేస్తారు తీస్తే బాబా ఆ వ్యక్తి ఆ వ్యక్తిని ఇలా చూస్తూ వెళ్లి అక్కడ కనబడుతున్న చెట్టు ఉంది కదా ఆ చెట్టుకి పైకి కిందకి ఎక్కువ ఉంటాడు ఆ పిచ్చి పట్టిన వ్యక్తి ఏమీ మాట్లాడకుండా బాబా చెప్పినట్లు ఎదురుగా ఉన్న చెట్టు
(23:05) దగ్గరికి వెళ్లి అలా పైకి కిందికి పైకి ఎక్కుతూ దిగుతూ ఉంటాడు అలా కొన్నిసార్లు చేసిన తర్వాత ఆ పిచ్చి వ్యక్తి సృహ తప్పి కింద పడిపోతాడు తర్వాత బాబాయ్ వెళ్లి ఆ వ్యక్తిని లేపి ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళకి చెప్తారు ఇప్పుడు ఇతనికి ఎలాంటి పిచ్చి లేదు ఇతన్ని ఇక్కడి నుండి తీసుకెళ్ళండి అంటాడు మళ్ళీ చెప్తున్నా బాబా బాబా అంటుంటే మీరేదో ఎక్కువ వయసు అని అనుకోకండి ఇవంతా చేస్తుంది 18 సంవత్సరాల ఒక కుర్రాడు అతి చిన్న వయసులో సిద్ధులు పొందిన ఒక గొప్ప యోగి ఇలా రోజు రోజు నేమ్ కలు బాబా గారికి భక్తుల సంఖ్య పెరిగేది ఇలా ఆ నోట ఈ నోట ఇలా దేశం నలుమూల బాబా గారి గురించి
(23:50) అందరికీ తెలుస్తుంది అన్నమాట ఈ క్రమంలో అక్బర్ పూర్ లో ఉన్న తండ్రి శ్రీ దుర్గా ప్రసాద్ శర్మ గారికి తెలుస్తుంది అదేంటంటే నీకరోలి అనే గ్రామంలో ఒక బాబా ఉన్నారు ఆ బాబా దగ్గరికి వెళ్తే చిన్నప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన కొడుకు లక్ష్మీనారాయణ శర్మ అతని ఆచూకి తెలుస్తుంది అని ఆలోచించి ఈ దుర్గా ప్రసాద్ శర్మ గారు నీకొకలి బాబా గారి దగ్గరికి వస్తారు వచ్చి రాగానే ఆ వెంట్రుకలు పెరిగి ఆ కింద ఒక టవల్ కట్టుకొని శరీరం ఇక్కడ ఏమి అంటే షర్టు ఎలాంటిది లేకుండా ఆ అబ్బాయిని చూడాలి గానే ఒక్కసారిగా ఆయనకు కలల్లో నీళ్లు వస్తాయి ఎందుకంటే ఎంతైనా తండ్రి కదా ఎంత జుట్టు
(24:37) పెంచుకున్న ఆ దుర్గా ప్రసాద్ శర్మ గారు ఆయన్ని గుర్తుపట్టేస్తారు నీమ్ కర్లివి బాబా ఎవరో కాదు చిన్నప్పుడు ఇంట్లోనే వెళ్ళిపోయిన నా కొడుకు లక్ష్మీనారాయణ శర్మ అని అదేవిధంగా ఈయన తండ్రి కదా ఈ నేమ్ కరులి బాబా కూడా వాళ్ళ తండ్రిని గుర్తుపడతాడు కొంతసేపు అక్కడ వాతావరణం మొత్తం కూడా సైలెంట్ గా ఉంటుంది తర్వాత తండ్రి కళ్ళలో నుంచి ఆనంద భాష్పాలు వస్తాయి వెంటనే నేమ్ కరలి బాబా వెళ్లి తండ్రి కాళ్ళకు నమస్కరిస్తాడు దుర్గా ప్రసాద్ శర్మ గారు నేమ్ కరలి బాబాని అడుగుతారు ఏంటంటే నువ్వు ఇప్పుడు యోగివ అయ్యావు దానికి నేను చాలా సంతోషిస్తున్నాను కానీ నిన్ను
(25:23) నమ్ముకొని ఇంటి దగ్గర మీ భార్య ఉంది రామ్ బేటె ఉంది కాబట్టి నువ్వు తిరిగి ఇంటికి రా కావాల్సిందిగా నిన్ను ప్రాధేయ పడుతున్నానని తండ్రి కొడుకుని ప్రాధేయ పడతాడు అప్పుడు మన నీమ్ కలి బాబా కూడా తండ్రి వెంటే తిరిగి అక్బర్ పూర్ కి ప్రయాణం అవుతాడు ఇది ఎలా అంటే అప్పట్లో రాముడు తండ్రి మాట విని వనవాసం వెళ్తే ఎప్పటి మన నీమ్ కరులి బాబా అదే తండ్రి మాట విని తిరిగి తన ఇంటికి బయలుదేరుతాడు ఇలా నీకర్లి బాబా తన అక్బర్పూర్ వెళ్ళగానే ఆ ఊరి ప్రజలంతా సంబరాలు చేసుకుంటారు ఎందుకంటే ఎప్పుడో తప్పిపోయిన ఆ వ్యక్తి తిరిగి తన ఊరికి వస్తున్నారని ఒకటైతే
(26:08) రెండవది వస్తున్న వ్యక్తి మామూలు వ్యక్తి కాదు ఒక గొప్ప సిద్ధులు పొంది దైవ సాక్షాత్కారం పొందినటువంటి ఒక గొప్ప యోగి ఆ ఊరికి వస్తున్నాడు మా ఊరిలో ఉన్న మా కష్టాలన్నీ తీరబోతున్నాయి అని ఆనందంతో మరోవైపు రాంబేటి అదే మన నీమ్ కరోలి బాబా గారి భార్య ఆవిడ ఆనందానికి అంతులు ఉండవు అలా ఊరు వచ్చిన నీమ్ కరలి బాబా తండ్రి నుండి ఒక అనుమతి కోరుతాడు అదేంటంటే మీరు చెప్పినట్లు నేను గృహస్థ జీవితాన్ని మొదలు పెడుతున్నాను అదేవిధంగా గృహస్థ జీవితంతో పాటు లోక కళ్యాణ కార్యక్రమాలు కూడా నేను చేయాలి దానికి మీ అనుమతి కావాలి అని అడుగుతారు ఈ లోక కళ్యాణ కార్యక్రమాలు అంటే
(26:53) ఈ ఆధ్యాత్మికతలో అంటే ఆయన చేయాల్సిన పనులు అంటే ముందు ముందు ఆయన చాలా పనులు చేయబోతున్నారు వాటి ఎలాంటి అంతరాయం ఉండకూడదు రెండిటినీ నేను సమానంగా తీసుకొని ముందుకు వెళ్లాలి అనుకుంటున్నాను దానికి మీ అనుమతి కావాలి అని తండ్రిని అడుగుతాడు తండ్రి అదే విధంగా ఆయన అడిగిన దానికి ఒప్పుకుంటాడు అలా నీమ్ కరలి బాబా గారికి 1925 వ సంవత్సరంలో ఈయనకు మగబిడ్డ పుడతారు ఆయన పేరు అనేగి సింగ్ శర్మ ఇలా నీమ్ కరలి బాబా గృహస్థ జీవితాన్ని మరియు సంత జీవితాన్ని రెండిటినీ చాలా చక్కగా నిర్వర్తించేవారు వారు ఇక్కడ మీకు ఇంకొక అనుభవం చెప్తాను నీమ్ కరోలి బాబా గారు
(27:36) కీలా ఘాటు కి వెళ్లి అక్కడ కొన్ని రోజులు ఉంటారు ఈ కీలా ఘాటుకి కొంత దూరంలో రాజపూత్ రెజిమెంట్ అనే ఆర్మీ క్యాంప్ ఆఫీస్ ఉంటుందన్నమాట అందులో అక్కడ కర్నల్ గా మేకన్నా అనే బ్రిటిష్ అధికారి ఉంటారన్నమాట ఈ బ్రిటిష్ అధికారి ఏంటంటే భారతదేశ యోగులన్న సంతులన్న సన్యాసులన్న ఈయనకి పరమ కోపం వాళ్ళని చూడంగానే బండ బూతులు తిడతారన్నమాట అయితే నీమ్ కరోలి బాబా గారు ఎలాగైనా సరే ఇతనికి బుద్ధి చెప్పాలి అని ఆలోచించి ఒకరోజు కన్నల మేకన్నా లేని సమయంలో నీమ్ కరోలి బాబా గారు ఆయన రూమ్ కి వెళ్లి ఆయన రూమ్ లో పడుకుంటాడు అయితే ఆయన రూమ్ ముందు గాడ్స్ ఉంటారు వాళ్ళు ఎంత
(28:18) చెప్పినా ఈ బాబా వినరు వినకుండా వెళ్లి ఆ కర్నల్ రూమ్ లో పడుకుంటాడు కొద్దిసేపు తర్వాత ఈ కర్నల్ ఏదో పని మీద వెళ్లి ఉంటాడు బయట నుండి వస్తాడు వచ్చి ఆ రూమ్లో ఆ పడుకొనున్న నేమ్ కళ్ళు బాబాని చూసి విపరీతమైన కోపంతో ఇంగ్లీషు వచ్చిరాని హిందీలో తిట్టడం మొదలు పెడతాడు ఈ మేకన్నా తిడుతుంటాడు తిడుతుంటాడు తిడుతుంటాడు ఇటువైపు ఏమో బాబాజీ నవ్వుతుంటాడు ఆయన తిడుతుంటాడు ఈయన నవ్వుతుంటాడు కొంత సమయం తర్వాత ఏమవుతుంది ఏంటో సడన్ గా ఆయన తిట్టడం ఆపేసి పక్కనే ఉన్న పళ్ళు పాలు తీసుకొచ్చి ఈయనకు సమర్పిస్తాడు అప్పటినుంచి ఈ మేకన్న ఏ యోగి కనపడిన కనపడిన వాళ్ళకి ఎంతో ప్రేమతో ఆయన సేవ
(29:03) చేసేవాడు అన్నమాట అయితే ఒక రోజు ఈ మేకన్న బాబాజీ దర్శనానికి వస్తారు కొన్ని రోజుల తర్వాత వస్తే రెండో ప్రపంచ యుద్ధానికి వెళ్ళాలి వెళ్లే ముందు బాబాజీ దగ్గరికి వస్తాడు బాబాజీ చూసి అతన్ని నువ్వు జనరల్ అవుతావ్ పో అంటాడు ఈ మేకన్నాకి ఏం అర్థం కాదు అదేంటిది జర్నల్ అవ్వాలని ప్రతి ఒక్కరికి ఉంటది ఆల్రెడీ జర్నల్ అవ్వడానికి చాలా మంది వెయిటింగ్ లో ఉంటారు అన్నమాట సో అంత మందిని కాకుండా నన్ను ఎందుకు జనరల్ చేస్తారు అని ఇతనికి అది నమ్మబుద్ది అవ్వదు సో బాబా చెప్పినట్టుగానే ఆ యుద్ధం నుండి తిరిగి రాంగానే కన్నల్ మేకన్నాని సో జనరల్ మేకన్నా అవుతారు సో అతనికి ప్రమోషన్
(29:43) వస్తుంది సో ఆ విధంగా బాబాజీ చెప్పిన ప్రతిదీ కూడా నిజమయ్యేది అన్నమాట 1937 వ సంవత్సరంలో నేను బాబా గారికి మరియు రామ్ బేటి గారికి రెండవ సంతానంగా ఒక కొడుకు జన్మిస్తారు ఆయన ఆయన పేరు ధర్మనారాయణ శర్మ అదేవిధంగా 1945 వ సంవత్సరంలో వీరికి మూడవ సంతానంగా ఒక ఆడబిడ్డ జన్మిస్తుంది ఆవిడ పేరు గిరిజా దేవి ఇక్కడ నేను ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను అదేంటంటే మనం చాలా మంది యోగుల జీవితాలను చదివి ఉంటాము లేదా విని ఉంటాం కానీ ఈ నీమ్ కరోలి బాబా గారి జీవితంలో ఏంటంటే ఒకవైపు
(30:29) ఈయన స్పిరిచువల్ గురువుగా ఉంటూ మరోవైపు ఈయన్ని గ్రామ పెద్దగా కూడా ఎన్నుకోబడతారు ఒకవైపు ఆధ్యాత్మిక జీవితం మరోవైపు ప్రాపంచిక జీవితం ఒకసారి ఏమవుతుందంటే ఆ అక్బర్ బూర్ కు కొంత దూరంలో ఉన్న ఒక ఊర్లో ఒక వ్యక్తికి ఒక సమస్య వస్తుంది ఈ వ్యక్తి ఆ నీమ్ కరులి బాబా గారిని వెతుక్కుంటూ వస్తారు వచ్చి నేమ్ కరులి బాబా గారిని కలుస్తారు నేమ్ కరులి బాబా గారు ఆ వ్యక్తి యొక్క సమస్యకు పరిష్కారం చెప్తారు ఇలా నేమ్లి బాబా గారు ప్రాపంచిక జీవితాన్ని మరియు ఆధ్యాత్మిక జీవితాన్ని రెండింటిని సమానంగా ముందుకు తీసుకెళ్లేవారు ఒకసారి ఏమవుతుందంటే కెంచిదాం అనే ఒక ఊర్లో పూనానంద్ తివారి
(31:15) అనే ఒక వ్యక్తి ఉంటారు ఈయన గత కొన్ని రోజులుగా ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతుంటారు సో ఆ కెన్ ధామ్ కి కొంత దూరంలో నైనతాల్ అనే ఒక టౌన్ ఉంటుంది ఈ పూనానంద్ తివారి గారు అక్కడికి వెళ్లి అక్కడ ఒక డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని తిరిగి తన ఇంటి వైపు వస్తుంటాడు సో అప్పటికే చీకటి పడి ఉంటుంది ఉత్తరాఖండ్ మొత్తం కూడా లోయలు కొండలతో ఉంటుందన్నమాట ఈయన చాలా స్పీడ్ గా నడుచుకుంటూ వెళ్తుంటాడు వెళ్తుంటే ఒక రోడ్డు మలుపు దగ్గర ఒక వ్యక్తి నిలబడి ఓ పూర్ణానంద్ ఓ పూర్ణానంద్ అని అరుస్తుంటాడు ఈ పూర్ణానంద్ గారు భయపడతారు ఏంటంటే ఆ పిలుస్తున్న
(31:56) వ్యక్తి ఎవరో ఈయనకు తెలియదు సో భయపడుతుంటే ఉంటే ఆ పిలిచిన వ్యక్తి ఈయన దగ్గరికి వస్తాడు వచ్చి రాంగానే ఈయన చెప్తాడు నువ్వు భయపడకు నువ్వు ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నావు కదా అతి తక్కువ కాలంలోనే ఆ సమస్య మటుమాయం అయ్యి నువ్వు ఆరోగ్యవంతుడు అవుతావు అని చెప్తాడు ఈ మాట వినగానే ఈ పూర్ణానంద్ తివారి గారు చాలా సంతోషపడతారు మళ్ళీ బాబా గారు పూర్ణానంద్ తివారి గారితో చెప్తారు నేను నీ ద్వారా ఒక పని చేయాలి కాకపోతే అది ఇప్పుడు కాదు 20 సంవత్సరాల తర్వాత అని చెప్పి మళ్ళీ నేను నిన్ను 20 సంవత్సరాల తర్వాత కలుస్తాను అని చెప్పి అక్కడి నుంచి
(32:39) వెళ్ళిపోతారు ఈ పూర్ణానంద్ తివారి గారికేమో ఎక్కడ లేని సంతోషం ఎందుకంటే ఆయన చాలా తీవ్రమైన జబ్బుతో బాధపడుతూ ఉండి కొద్ది రోజుల్లోనే ఆయన చనిపోతాను అనే ఫీలింగ్ లో ఉంటాడు అన్నమాట అప్పుడు ఈ నీమ్ కరులి బాబా గారు వచ్చి ఈ విషయం చెప్పడంతో ఆయన ఎంతో సంతోషిస్తాడు అలా భీమ్ కరోలి బాబా గారు చెప్పినట్లే కరెక్ట్ గా 20 సంవత్సరాల తర్వాత అంటే 1962 వ సంవత్సరంలో బాబా గారు వచ్చి ఈ పూర్ణానంద్ తివారి గారిని కలుస్తారు ఈ 20 సంవత్సరాల్లోనే ఈ బాబా గారి పేరు ప్రఖ్యాతలు మన దేశమంతా వ్యాపిస్తాయి అన్నమాట బాబా వచ్చి పూర్ణానంద్ గారిని కలవగానే పూర్ణానంద్ తివారి గారు కూడా చాలా
(33:24) సంతోషిస్తారు బాబా ఈ పూర్ణానంద్ తివారి గారిని ఒక ప్లేస్ కి తీసుకెళ్లి ఆ ప్లేస్ ని చూపిస్తూ ఇక్కడ నేను గుడి కట్టాలనుకుంటున్నాను దీనికి నీ సహాయం నాకు కావాలి అని చెప్తాడు అప్పుడు ఈ పూర్ణానంద్ తివారి గారు ఆ ఊర్లో ఉన్న పెద్ద మనుషులందరిని తీసుకొచ్చి ఈ బాబా గారికి పరిచయం చేస్తారు అప్పుడు ఆ పెద్ద మనుషుల్లో ఒక వ్యక్తి బాబా గారితో చెప్తారు బాబా గారు మీరు ఏ ప్లేస్ లో అయితే గుడి కట్టాలనుకుంటున్నారో ఆ ప్లేస్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇది కాబట్టి మనం గుడి కట్టాలనుకుంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అయినా లేదా అటవీ శాఖ మంత్రి నుంచి కానీ మనం అనుమతి తీసుకోవాలి
(34:03) అని చెప్తారు అప్పుడు బాబా ఎవరు ఈ అటవీ శాఖ మంత్రి అని అడుగుతారు అడిగితే ఆ పెద్ద మనిషి చెప్తాడు శ్రీ చరణ్ సింగ్ గారు అని చెప్తారు అప్పుడు బాబా ఒక నిమిషం కళ్ళు మూసుకొని తర్వాత కళ్ళు తెరిచి చెప్తాడు అన్నమాట సరేలే రేపు చరణ్ సింగ్ ఇక్కడికి వచ్చి మనకు పర్మిషన్ ఇస్తాలే అని చెప్తాడు బాబా గారు చెప్పినట్లే మరుసటి రోజు పొద్దున్నే శ్రీ చరణ్ సింగ్ గారు పెద్ద అన్వాయ వేసుకొని ఈ కెంచిదాంకి వచ్చి బాబా గారిని కలుస్తారు కలిస్తే బాబా గారు ఆయన ఎక్కడ గుడి కట్టాలనుకుంటున్నాడో ఆ ప్లేస్ ని చూపిస్తారు చూపించి ఇలా నేను గుడి కట్టాలనుకుంటున్నాను అని చెప్తారు చెప్పిన
(34:45) వెంటనే శరణ్ సింగ్ గారు అంటారు గురువుగారు మీరు గుడి నిర్మాణాన్ని మొదలు పెట్టండి నేను మీకు కావలసిన అనుమతి పత్రాలన్నిటిని మీకు నేను పంపిస్తాను అని చెప్తారు అప్పుడు బాబా ఈ చరణ్ సింగ్ గారితో నువ్వు ప్రధానమంత్రి అవుతావులే పో అంటాడు బాబా చెప్పినట్లే అతి తక్కువ కాలంలోనే ఆయన మన దేశ ప్రధానమంత్రి అవుతాడు అలా బాబా చెప్పే ప్రతి వాక్కు నిజమయ్యేది సో ఆ రోజు నీమ్ కరోలి బాబా గారు కట్టిన గుడే ఈరోజు కెంచిదాం నీమ్ కరోలి బాబా ఆశ్రమం ఇలా బాబా గారి జీవిత కాలంలో 108 గుడులను నిర్మించాడు అందులో ముఖ్యంగా ఒకటి కెంచిదాం అయితే రెండవది బృందావన్లో ఉన్న
(35:31) గుడి అలా బాబా కొద్ది రోజులు కెంచిదాంలో కొద్ది రోజులు బృందావనలో ఉండేవారు ఇక్కడ నేను ఒక అనుభవం చెప్తాను అదేంటంటే ఒకసారి నేమ్ కరులి బాబా గారు పెద్ద యజ్ఞం చేస్తుంటారు యజ్ఞం చేస్తుంటే ఈ యజ్ఞానికని అప్పట్లోనే కొన్ని లక్షల మంది వస్తారు అయితే అందరికీ ప్రసాదం వండుతుంటారు వండుతుంటే వారి దగ్గర ఉన్న నెయ్యి అయిపోతుంది అయిపోతే అక్కడున్న భక్తులు వెళ్లి నీకలి బాబా గారికి చెప్తారు స్వామి ఇలా లక్షల్లో భక్తులు వచ్చారు కానీ మన దగ్గర ఉన్న నెయ్యి అయిపోయింది ఇప్పుడు ప్రసాదం ఎలా వండాలి అని అడుగుతారు అడిగితే అప్పుడు బాబా గారు ఇద్దరు భక్తులను పిలిచి
(36:15) అక్కడున్న కుండలను తీసుకొని వెళ్లి ఆ యజ్ఞానికి కొంత దూరంలో నది ప్రవహిస్తుంటుంది ఆ నదిలో ప్రవహించే నీటిని తీసుకురమ్మంటారు తీసుకురమ్మని ఇక్కడి నుంచి వెళ్లేటప్పుడు తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆ నీటిని తెచ్చేంతవరకు కంటిన్యూగా రామ జపాన్ని జపిస్తూ వెళ్ళాలి అని చెప్తారు అలా బాబా చెప్పినట్లే ఆ ఇద్దరు భక్తులు ఆ కుండల్ని తీసుకొని రామ నామాన్ని జపిస్తూ నదిలో నీటిని తీసుకొచ్చి బాబా చెప్పిన ఒక పెద్ద పాత్రలో పోస్తారు పోస్తే ఆ విచిత్రం ఏంటంటే వీరు తెచ్చిందేమో నీళ్లు కానీ ఇక్కడికి తెచ్చి ఆ పాత్రలో పోయంగానే ఆ నీరు నెయ్యి అయిపోయి
(36:55) ఉంటుందన్నమాట అలా బాబా గారు నీటిని నెయ్యిగా మారుస్తారు మార్చి ఆ నెయ్యితో ప్రసాదాన్ని వడ్డించి అక్కడున్న భక్తులందరికీ పంచుతారు మళ్ళీ బాబా ఆయన ప్రియ భక్తుని పిలిచి రేపు పొద్దున్నే మార్కెట్ నుంచి రెండు టిన్నుల నెయ్యిని తీసుకురమ్మంటాడు కానీ ఆయనకేం అర్థం కాదు ఎందుకు బాబా అలా చెప్తున్నాడు అని బాబా చెప్పినట్లే మరుసటి రోజు పొద్దున్నే ఆ భక్తుడు రెండు పెద్ద టిన్నుల నెయ్యిని తీసుకొస్తాడు తీసుకొస్తే ఈ బాబా ఆ నెయ్యిని తీసుకెళ్లి ఆ నదిలో కలిపేస్తాడు ఇలా ఈయన అనుభవాలు చాలా అద్భుతంగా ఉండేటివి ఇంకొక అనుభవం చెప్తాను అదేంటంటే హార్వర్డ్
(37:36) యూనివర్సిటీలో ఆల్బర్ట్ రిచార్డ్ అనే ఒక ప్రొఫెసర్ మరియు సైంటిస్ట్ ఉండేవారు ఈయన ఏంటంటే ఎల్ ఎస్ టి అనే డ్రగ్ పైన పరిశోధనలు చేస్తుంటారు ఈ ఎల్ ఎస్ టి అనే డ్రగ్ ఏంటంటే ఇదొక మారగద్రవ్యం సో మనం చూస్తుంటాం కదా మన సెలబ్రిటీస్ అందరూ డ్రగ్ తీసుకుంటారు అంటే అది తీసుకోగానే వీళ్ళు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతారు ఏదో తెలియని ఒక మత్తులోకి వెళ్ళిపోతారు సో ఈ వ్యక్తి ఏంటంటే ఈ డ్రగ్స్ పైన ఎక్స్పెరిమెంట్ చేస్తుంటాడు అయితే ఆ యూనివర్సిటీ యొక్క రూల్ ప్రకారం ఆ డ్రగ్ ని అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కి ఇవ్వకూడదు అయితే అనుకోకుండా ఈ రీచార్ట్
(38:15) అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ కి ఇస్తాడన్నమాట ఈ విషయం తెలిసిన హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఆయన్ని డిస్మిస్ చేస్తారు అలా డిస్మిస్ అనే ఈ రీచార్ట్ ఏం చేయాలో తెలియక కొన్ని నెలల తర్వాత ఇండియాకి వస్తాడు ఇండియాలో భగవాన్ దాస్ అనే ఒక యోగా టీచర్ ని కలుస్తాడు ఆ యోగా టీచర్ ఈ రీచార్డ్ ని నేమ్ కలి బాబా గారి దగ్గరికి తీసుకొస్తారు తీసుకొచ్చిన వెంటనే బాబా గారు ఈ ఆల్బర్ట్ రిచార్డ్ ని చూసి హే నీ దగ్గర ఏదో యోగి మెడిసిన్ ఉంది కదా ఇదో నాకు ఇవ్వు అంటాడు ఈ ఆల్బర్ట్ రిచార్డ్ కి ఏం అర్థం కాదు అదేంటి యోగి మెడిసిన్ ఏంటి అంటాడు హే అదే నీ దగ్గర ఏదో ఉంది కదా
(38:54) మాతలు అది నాకు ఇవ్వు అంటాడు అప్పుడు ఓ ఈయన అడుగుతుంది ఎల్ ఎస్ డ్రగ్ అని ఆల్బర్ట్ రిచర్డ్ దగ్గర ఉన్న ఒక టాబ్లెట్ ని తీసి బాబా చేతిలో పెడతాడు బాబా అది చూసి అరే ఇంకోటి ఇవ్వు అంటాడు మళ్ళీ ఆ రీచార్డ్ ఇంకోటి ఇస్తాడు అలా ఆయన దగ్గర సిక్స్ టాబ్లెట్స్ ఉంటే ఆ సిక్స్ టాబ్లెట్స్ తీసుకొని ఒకేసారి వేసేసుకుంటాడు ఈ ఆల్బర్ట్ కేమో ఎక్కలేని టెన్షన్ ఎందుకంటే ఇంత చిన్న మిల్లీ మైక్రో గ్రామ్ తీసుకుంటేనే మనం మత్తులోకి వెళ్ళిపోతాం ఈయనేమో ఈ టాబ్లెట్స్ అన్నిటిని మింగేస్తాడు ఈయన ఏమైపోతాడు అని టెన్షన్ పడుతుంటాడు టెన్షన్ పడుతుంటాడు బాబా గారేమో ఆ టాబ్లెట్స్ అన్నీ మింగేసి
(39:32) పక్కనున్న భక్తులతో మాట్లాడుతుంటాడు ఇలా కొన్ని గంటలు అయిపోతుంది ఆయనలో ఎలాంటి మార్పు ఉండదు అప్పుడు ఈ ఆల్బర్ట్ రిచార్డ్ కి అర్థమవుతుంది ఈ డ్రగ్ కంటే ఈ ఏదైతే మత్తు పదార్థం ఉంది కదా దీనికంటే గొప్పదైంది ఆధ్యాత్మికత స్పిరిచువాలిటీ మెడిటేషన్ అని ఆయన రియలైజ్ అవుతాడు రియలైజ్ అయ్యి ఆయన పేరుని ఆల్బర్ట్ రిచర్డ్ నుంచి బాబా రామ్దాస్ గా మార్చుకుంటాడు మార్చుకొని అలా అమెరికా మొత్తం అనేక సంస్థలను స్థాపించి యోగ మరియు మెడిటేషన్ ని ప్రచారం చేస్తాడు ఈయన అనేక పుస్తకాలు రాస్తారు ఇక మీకు ఇంకొక అనుభవం చెప్తాను ఒకసారి ఏమవుతుందంటే బాబా గారు కీలా ఘాటు దగ్గర ఉంటున్నప్పుడు
(40:20) ఆ కీలా ఘాటుకి కొంత దూరంలో వృద్ధ దంపతులు ఉంటారు ఈ ఇద్దరు కూడా బాబా గారికి పరమ భక్తులు ఈ దంపతులకు ఒక్కగాన ఒక కొడుకు ఆర్మీలో పని చేస్తుంటాడు అయితే గత కొన్ని నెలల నుంచి వాళ్ళ కొడుకు నుంచి ఈ తల్లిదండ్రులకి ఎలాంటి సమాచారం ఉండదు అరే నా కొడుకు ఏమైపోయారు అసలు నా కొడుకు ఉన్నాడా వాడికి ఏమన్నా అయ్యిందా అని ఏమి ఎలాంటి సమాచారం ఉండదు ఈ రోజుల్లో అంటే ఫోన్లు ఉన్నాయి మనం ఫోన్ చేయొచ్చు కనుక్కోవచ్చు కానీ ఇది 60 70 సంవత్సరాల క్రితం జరిగిన ఇన్సిడెంట్ సో ఇలా ఆ వృద్ధ దంపతులు బాధపడుతుంటే ఒకానొక రోజు నీమ్ కరోలి బాబా గారు వాళ్ళ ఇంటికి వెళ్తారు వెళ్లి అరే నాకు ఆకలిగా
(41:05) ఉంది ఏదో ఒకటి పెట్టు నాకు తినాలని ఉంది అంటాడు ఆ వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉన్నది ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి బాబా గారికి ఇస్తారు బాబా దాన్ని తిని ఈ రాత్రికి నేను మీ ఇంట్లోనే ఉంటున్నాను అని బాబా చెప్తారు సో వీళ్ళేమో చాలా పూర్ ఫ్యామిలీ ఒకవైపు వీళ్ళు పడుకొని మరోవైపు బాబా పడుకోవడానికి ఏర్పాట్లు చేస్తారు రాత్రి అవుతుంది బాబా గారు వచ్చి పడుకుంటారు ఈయన ఎక్కడికి వెళ్ళినా ఈయనతో పాటు ఒక కంబలి ఉంటుంది సో ఈయన తెచ్చుకున్న కంబలి ఈయన ముసుకేసుకొని పడుకుంటాడు పడుకున్న తర్వాత ఈ కంబలి లోపల నుంచి ఎవరైనా వ్యక్తి బాగా అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు కొన్ని సౌండ్స్
(41:48) చేస్తారు కదా అంటే ముక్కుతూ మూలుగుతూ ఏడుస్తూ అలాంటి శబ్దాలు ఆ కంబల లోపల నుండి వస్తుంటాయి ఈ వృద్ధ దంపతకి ఏం అర్థం కాదు అరే ఏమవుతుంది ఈయన మన ఇంటికి వచ్చి పడుకున్నాడు చాలా అనారోగ్యంతో బాధపడుతున్నాడు అని వాళ్లకేం అర్థం కాదు ఇలా రాత్రి ఆ వృద్ధ దంపతులకు జాగారం ఆయనేమో కంబల్లో పండుకొని ఈ ఇలా విచిత్ర విచిత్రమైన శబ్దాలు చేస్తూ ఉంటారు ఇలా మొత్తానికి తెల్లవారుతుంది ఈ బాబాగారు లేచే కంబల్ని నీట్ గా చుతారు చుట్టి ఆ వృద్ధ దంపతుల చేతుల్లో ఇచ్చి మీరు గత కొంతకాలంగా మీ కొడుకు గురించి బాధపడుతున్నారు కదా ఏం కాలేదులే సరిగ్గా నెల రోజుల్లో మీ కొడుకు మీ ఇంటికి
(42:31) వస్తాడులే అని చెప్పంగానే ఈ వృద్ధ దంపతులు ఇద్దరికి ఎక్కడ లేని ఆనందం వస్తుంది తర్వాత బాబా ఆ చుట్టిన కంబలిని వాళ్ళకి ఇచ్చి ఈ కంబలిని తీసుకొని వెళ్లి ఆ నదిలో పడేయండి కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కంబలి లోపల ఏముంది అని మీరు చూడకూడదు అంటారు సరే గురువు చెప్పినట్లే ఈ వృద్ధ దంపతులు ఇద్దరు చెరువు వైపు పట్టుకొని నది వైపు వెళ్తూ ఉంటారు అయితే ఆ కంబలి చాలా బరువుగా ఉంటుంది వీళ్ళకి డౌట్ వస్తుంది అరేయ్ ఈ కంపల్ లోపల ఏముంది ఒకసారి విప్పి చూద్దామని కానీ ఆయన గురువు కదా ఆయన చెప్పిన మాట గుర్తుకొచ్చి అలాగే తీసుకెళ్లి నదిలో పడేస్తారు సరిగ్గా
(43:11) ఇది జరిగిన నెల రోజులకు ఆర్మీ నుంచి కొడుకు ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చి అమ్మ నాన్న మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే సరిగ్గా నెల రోజుల క్రితం మేము జపాన్ వాళ్ళ పైన యుద్ధానికి వెళ్ళాం అయితే ఆ జపాన్ సైనికులు మేము ఉంటున్న క్యాంప్ పైన అటాక్ చేశారు ఆ అటాక్ లో నాతో పాటు ఉన్న సైనికులందరూ చనిపోయారు కాకపోతే వాళ్ళు నా వైపు గన్స్ తో కాలుస్తున్నారు కానీ బుల్లెట్లు తగలకుండా నా వైపు నుండి ఇటు అటు వెళ్ళిపోతున్నాయి కాసేపు తర్వాత నేను సృహ తప్పి పడిపోయాను తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు పొద్దున్నే మా సీనియర్ ఆఫీసర్ వచ్చి ఆఫీస్ కి
(43:54) తీసుకెళ్లాడు అని చెప్తాడు అప్పుడు ఈ తల్లిదండ్రులు ఏ రోజు జరిగిందో ఆ డేట్ అడుగుతారు అప్పుడు చూస్తే అదేంటంటే ఈ అబ్బాయి పైన అటాక్ జరిగింది ఆ బాబా వచ్చి వీళ్ళ ఇంట్లో పడుకున్న రోజు రెండు ఒకటే అంటే ఏదైతే ఆ కొడుకు అనుభవించాలో ఆ అబ్బాయి అనుభవించాలో ఆ బుల్లెట్లు గాయాలు ఆ నొప్పులను ఈ బాబా అనుభవించి ఆ అబ్బాయిని కాపాడాడు బాబాను నమ్ముకున్న భక్తుల్ని బాబా ఈ విధంగా కాపాడేవారు ఈ అనుభవాన్ని బుల్లెట్ ప్రూఫ్ కంబల్ అని బాబా రామ్దాస్ గారు మిరాకిల్ ఆఫ్ లవ్ అనే పుస్తకంలో రాశారు ఇంకొక అనుభవం చెప్తాను ఒకసారి బాబా గారు భూమిదార్ ఆశ్రమంలో ఉన్నప్పుడు ఈ
(44:41) భూమిదార్ ఆశ్రమం ఎక్కడంటే కెంచిదాం నుంచి కొంత దూరంలోనే ఈ భూమిదార్ ఆశ్రమం ఉంది సో అక్కడ బాబా ఉంటున్నప్పుడు బాబా గారికి ప్రియ శిష్యుడు ఒకాయన ఉంటారు ఆయన పేరు ఓంకార్ సింగ్ ఈ మన బాబా గారికి ఒక భక్తుని కలుసుకోవాల్సి వస్తుందన్నమాట అయితే ఆ భూమి ఆశ్రమం నుంచి వేరే ఊరు వెళ్ళాలి సో అప్పుడు ఈయన ఓంకార్ సింగ్ ఏం చేస్తాడంటే ఆయన దగ్గర ఉన్న కారుని అదేవిధంగా బాబాని తీసుకెళ్లడానికి ఒక డ్రైవర్ కావాలి కదా అలా ఈ ఓంకార్ సింగ్ గారి కొడుకుని డ్రైవర్ గా పంపిస్తాడు ఓంకార్ సింగ్ గారి కొడుకు పేరు యుధిష్ఠిర్ సింగ్ ఈ యుధిష్ఠిర్ సింగ్ వయసు ఒక 20 22 సంవత్సరాలు ఉంటుంది ఈ
(45:29) అబ్బాయి బాబా గారిని కార్లో ఎక్కించుకొని ఏ వ్యక్తినైతే కలవాలో ఆ వ్యక్తిని కలిసిన తర్వాత తిరిగి మళ్ళీ ఆశ్రమానికి తీసుకొస్తాడు మరుసటి రోజు పొద్దున్నే ఈ యుధిష్టర్ సింగ్ కాళ్ళ కృత్యాలు తీర్చుకోవాలని ఆశ్రమం వెనకున్న చెట్లు పొదల్లోకి వెళ్తాడు వెళ్తే అనుకోకుండా నల్ల తాచుపాము ఈ యుధిష్ఠిర సింగ్ ని కరుస్తుంది ఈ యుధిష్ఠిర సింగ్ భయంతో ఆ ప్లేస్ నుండి ఆశ్రమం వైపు పరిగెత్తు పరిగెత్తు గారి మధ్యలో పడిపోతాడు చనిపోతాడు అయితే అక్కడున్న వాళ్ళు వెళ్లి బాబా గారితో చెప్తారు ఇలా మీతో పాటు వచ్చిన కుర్రాడు చనిపోయాడు అని బాబా గారు ఎక్కడైతే ఆ యుధిష్ఠి సింగ్
(46:14) చనిపోయి పడి ఉన్నాడో అక్కడికి వస్తాడు ఈ లోపల అక్కడున్న జనాలందరూ కొంతమంది ఏడుస్తూ ఉంటారు చనిపోయాడని ఆ ఏడుస్తున్న వాళ్ళని చూసి ఏమైంది అని ఏడుస్తున్నారు ఏం కాలేదు అని చెప్పి బాబా గారి శరీరం పైన ఎప్పుడూ ఒక ఒక కంబలి ఉంటుంది మీరు ఈ ఫోటోలో చూస్తే ఆయన ప్రతిక్షణం ఆయనతో పాటు ఒక కంబలి కప్పుకొని ఉంటారు ఆయన ఆ కంబలిని తీసి ఆ యుధిష్ఠి సింగ్ అంటే ఆయన చనిపోయి పడి ఉన్న ఆ అబ్బాయి పైన కప్పుతాడు వాడి పైన కప్పి బాబా గారు ఇలా చెప్తారన్నమాట ఏ యుధిష్ఠి సింగ్ నీ కోసం ఎంతసేపు వెయిట్ చేయాలిరా మనం అర్జెంట్ గా వెళ్ళాలి రాణికైతే వెళ్ళాలి లే లే అంటాడు ఈ యుధిష్ఠి సింగ్
(46:54) ఏమో అక్కడున్న వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తుంటారు ఈ యుధిష్ఠిర సింగ్ ఏమో నిద్రలో నుండి బయట వచ్చినట్లు ఆ కంబాలు తీసి ఆ ఓకే స్వామీజీ ఓకే స్వామీజీ లేస్తాడు బాబా అంటారు వెళ్లి కార్ తీయరా ఎంతసేపు వెయిట్ చేయాలి నీ కోసం అంటాడు ఈ యువకుడు పరిగెత్తుకుంటూ వెళ్లి కార్ ని రెడీ చేస్తారు ఇలా ఈ బాబా గారు చనిపోయిన వ్యక్తులను కూడా బ్రతికించేవారు ఇలా బాబా నుంచి కాపాడబడిన యుధిష్ఠిర్ సింగ్ 82 సంవత్సరాలు జీవించారు ఒకసారి ఏమవుతుంది అంటే ఇది ఫేమస్ అనుభవం ఆయన లైఫ్ స్టోరీలో బాబా గారు ఆగ్రా లో ఒక భక్తున్ని కలవాల్సి ఉంటుంది దాని కోసమని ఈయన రైలు మార్గం
(47:34) ద్వారా వెళ్లి ఆగ్రా రైల్వే స్టేషన్ లో దిగుతాడు సమయం పొద్దున్నే నాలుగు నాలుగున్నర ఆ మధ్యలో బాబా గారేమో స్టేషన్ నుండి బయటకు వస్తాడు అంటే అప్పట్లో రిక్షాలు ఉండేటివి ఇప్పుడు ఆటోలు కార్లు ఉన్నాయి కదా అప్పట్లో రిక్షాలు ఉండేటివి ఈ బాబా గారు వెళ్లి రిక్షా స్టాండ్ లో రిక్షా వాళ్ళని అడుగుతారు ఇలా ఫలానా చోటికి వెళ్ళాలి అంటే ఎవరు ఒప్పుకోరు ఎందుకంటే ఈయన సాధువు ఈయన దగ్గర ఏం డబ్బులు ఉండవు పొద్దు పొద్దున్నే బోనీ కాకపోతే రోజు మొత్తం కూడా వాళ్లకు ఏం డబ్బులు రావనే ఒక సెంటిమెంట్ ఉంటుంది అలా అక్కడున్న రిక్షా స్టాండ్ లో ఎవరూ రారు
(48:11) అయితే సీతారాం అనే ఒక వ్యక్తి ఈయన దగ్గరికి వచ్చి అయ్యా మీరు నా రిక్షాలో కూర్చోండి మిమ్మల్ని మీరు ఎక్కడికి వెళ్లాలో అక్కడ మిమ్మల్ని దింపుతాను అంటాడు బాబాయ్ వెళ్లి ఆయన రిక్షాలో కూర్చుంటాడు అడ్రస్ చెప్తాడు ఈ సీతారాం అనే వ్యక్తి బాబా గారిని తీసుకెళ్లి ఆ ప్లేస్ లో దించుతారు దించిన తర్వాత బాబా గారు తీసి డబ్బులు ఇవ్వబోతారు ఇవ్వబోతే ఆ సీతారాం అనే వ్యక్తి తీసుకోకుండా అయ్యా నాకు డబ్బులు వద్దు మీ ఆశీర్వాదం నాకు కావాలి అదేంటంటే మా ఇంట్లో ఇలా ముగ్గురు పిల్లలు ఉన్నారు నేను నా భార్య నేను ఒక్కడినే సంపాదిస్తున్నాను నా పిల్లల చదువు వాళ్ళ
(48:52) ఫుడ్ అన్ని చూసుకోవడానికి నాకు చాలా కష్టంగా ఉంది కాస్త మీరు నాకు ఆశీర్వదించండి నాకు ఏదో విధంగా ఒక మంచి మంచి పని దొరికేటట్లు అని ఈ రిక్షా అతను బాబా గారిని వేడుకుంటారు అప్పుడు బాబా గారు ఈ రోజు నుంచి నీ జీవితం మారిపోయింది పో అంటారు ఈ రిక్షా డ్రైవర్ ఆ మాట విని ఎంతో సంతోషిస్తాడు బాబా గారు ఆ ఇంట్లోకి వెళ్తూ ఉంటారు ఈ రిక్షా అతను మళ్ళీ బాబా బాబా అని పిలుస్తాడు బాబా తిరిగి చూసి ఏంటి అంటాడు అయ్యా మీరు మీ బ్యాగ్ ని మర్చిపోయారు తీసుకెళ్ళండి ఇద్దో అంటారు ఆయన అంటారు అది నా కోసం కాదు అది నీ కోసమే దీన్ని ఇక్కడ చూడకు ఈ బ్యాగ్ ని మీ ఇంటికి
(49:34) తీసుకెళ్ళు మీ ఇంట్లో విప్పి చూడు అంటాడు సరే అని ఈ సీతారాం అనే వ్యక్తి ఇంటికి వెళ్తాడు పొద్దున్నే ఐదున్నర ఆరు మధ్య సమయం ఇది పోంగానే ఈ సీతారాం గారి వైఫ్ సీతారాం చూసి బాధపడతాది అరే మనకు ముగ్గురు పిల్లలు ఉన్నారు నువ్వు ఇప్పుడు వెళ్ళావు అప్పుడే వచ్చేస్తున్నావు వాళ్ళ చదువులు ఏంటి వాళ్ళ భవిష్యత్తు ఏంటి అని సీతారాం గారి భార్య బాధపడుతుంటుంది అప్పుడు ఈ సీతారాం గారు ఒక సంచి తీసుకెళ్లి ఈ జరిగిన స్టోరీ మొత్తం చెప్తారు చెప్తే ఆ సంచిలో ఏముందో చూడాలి కదా సరే ఈ భార్య భర్తలు ఇద్దరు విప్పి ఆ సంచి చూస్తారు సంచిలో కలశం లాంటి ఒక రాగి
(50:15) పాత్ర ఉంటుంది ఈ ఇద్దరు ఆ రాగి పాత్రను విప్పి చూస్తారు విప్పి చూస్తే ఆ రాగి పాత్ర నిండా బంగారు నాణ్యాలు ఉంటాయి అలా ఆ రోజు నుంచి సీతారాం కాస్త సీత సీతారామ్ సేట్ అవుతాడు సేట్ అంటే కోటీశ్వరుడు వాళ్ళ కొడుకులు వీళ్ళంతా పెద్ద బిజినెస్ లో ఉన్నారు అలా బాబా గారి వల్ల ఒక రిక్షా దక్కుకుండే వ్యక్తి పెద్ద కోటీశ్వరుడై ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అవుతాడు అదేవిధంగా ఆ సీతారాం గారు అనేక గుడులను నిర్మిస్తాడు మీకు ఇంకొక అనుభవం చెప్తాను బాబా గారు కీల ఘాట్ లో ఉంటున్నప్పుడు ప్రతిరోజు బాబా జైలుకి వెళ్లి జైల్లో పెట్టే ఆహారాన్ని తినేవారు
(51:00) ఇలా కొన్ని రోజులు జరుగుతుంది అప్పుడు ఒక భక్తుడు బాబాని అడుగుతారు బాబా నాకు చిన్న డౌట్ ఉంది అదేంటంటే అసలు మీరు జైలుకి వెళ్లి ఫుడ్ తినడం మాకు నచ్చలేదు ఎందుకంటే ఇక్కడ ఈ ఆశ్రమంలో ఇంత మంచి ఫుడ్ వండుతున్నారు అదేవిధంగా నీ భక్తులు కూడా నీకు ప్రసాదాన్ని తీసుకొస్తున్నారు మీరు ఇవేమీ తినకుండా ఎక్కడో ఆ జైలుకి వెళ్లి వాళ్ళ దగ్గర అడుక్కొని తినడం మాకు నచ్చట్లేదు అసలు దీని వెనకున్న మర్మం ఏమిటి అని అడుగుతాడు అప్పుడు బాబా అరే అక్కడ జైల్లో ఖైదీలు ఉన్నారు కదా ఆ ఖైదీలకు వాళ్ళు సరైన ఆహారం పెట్టట్లేదు అదే నేను వెళ్ళాను అనుకో నేను వస్తున్నానని వాళ్ళు బాగా ఆహారం
(51:43) వండుతున్నారు వండి వాళ్ళకి పెడుతున్నారు అని చెప్తాడు అంటే ఆయన అలా ఖైదీల గురించి కూడా ఆయన ఆలోచించి వాళ్లకు మంచి ఫుడ్ ఇవ్వాలని ఈ బాబా గారు ఆ కీలా ఘాటికి దగ్గరలో ఉన్న జైలుకి వెళ్లి ఆహారం తినేవారు ఒకసారి ఏమవుతుంది అంటే బాబా గారు భూమి ద్వార ఆశ్రమంలో భక్తులతో కూర్చొని మాట్లాడుతుంటారు అదే సమయంలో ఒక విచిత్రమైన వ్యక్తి బాబా దగ్గరికి వస్తాడు అతను చూడ్డానికి ఎలా ఉంటాడు అంటే నల్లగా బాగా కండలతో అతను వేసుకున్న దుస్తులు కూడా చాలా పాతవిగా కళ్ళేమో ఎర్రని నిప్పు కణాల్లా ఉంటాయి అతను బాబా దగ్గరికి వచ్చి బాబాని చడబడా చడబడి తిడుతుంటాడు అక్కడున్న
(52:28) భక్తులకు ఏం అర్థం కాదు అసలు ఎవరు ఇతను ఎందుకు ఇలా తిడుతున్నాడు ఏ కారణం లేకున్నా ఇంత పెద్ద గురువుని పట్టుకొని అసలు ఎందుకు తిడుతున్నాడు అక్కడున్న అందరికీ ఆశ్చర్యం వేస్తుంది అతనేమో తిడుతుంటాడు బాబా ఏమో నవ్వుతుంటాడు అతను తిడుతుంటాడు ఈయన నవ్వుతుంటాడు కాసేపు తర్వాత అప్పుడు బాబా అక్కడున్న భక్తుడితో లోపలికి వెళ్లి ఆహారాన్ని తీసుకురా ఈయన కోసం అని చెప్తాడు ఈ భక్తులకు ఏం అర్థం కాదు ఆయనేమో తిడుతున్నాడు ఈయనేమో నవ్వుతున్నాడు మధ్యలో ఆయనకు ఆహారం తీసుకొచ్చి పెట్టండి అంటున్నాడు అని ఆ భక్తుడు సరే ఈయన చెప్పాడు కదా అని లోపలికి వెళ్లి
(53:06) ఆహారాన్ని తీసుకొస్తాడు ఈయన అది తిడుతుంటాడు తిడుతుంటాడు ఇలా ఆయన తిట్టి తిట్టి తిట్టి అలసిపోయి ఆ వ్యక్తి బాబాతో అంటాడు అసలు నువ్వు ఎవడు ప్రతిసారి నా పండ్లు వేలు పెట్టడానికి అసలు నీకు ఏం అధికారం ఉంది చూస్తూ ఉండు నేనేంటో నీకు చూపిస్తాను అంటాడు అప్పటివరకు శాంతంగా నవ్వుతున్న బాబా ఒక్కసారిగా ఆ వ్యక్తి వైపు ఉరిమి చూస్తాడు అంతే ఒక్కసారిగా ఆయన ఆ మాటలన్నీ ఆపేసి పరిగెత్తుకుంటూ ఆశ్రమం బయట వెళ్తాడు అలా అందరూ చూస్తుండగానే అతను కొంత దూరం వెళ్లి అదృశ్యం అయిపోతాడు ఇక్కడున్న భక్తులకు ఏమి అర్థం కాదు అసలు వచ్చిన వ్యక్తి ఎవడు ఈయన ఎందుకు తిట్టాడు
(53:41) అలా కొంత దూరం వెళ్లి ఎలా అదృశ్యం అయిపోయాడు అని ఒక భక్తుడు ఏంటి స్వామి ఇదంతా అతను ఎవరు అని అడుగుతాడు అడిగితే అప్పుడు బాబా అతనా అతని పేరు యమధర్మరాజులే అంటాడు అక్కడున్న వాళ్ళకి అందరికీ ఒక్కసారిగా గుడ్డ జల్లుమంటుంది అదేంటి స్వామి అంటే ఆ ఏం లేదులే మొన్న ఈ మధ్య ఒకరిని తీసుకెళ్లాలి అనుకున్నాడు నేను ఆ ఛాన్స్ ఆయనకి ఇవ్వలేదు కదా అందుకు కోపంతో నా మీద వచ్చారు సార్లే ఇంకేం లేదులే అంతే అంటాడు ఆబ్వియస్ గా ఆయన యమధర్మరాజు ఆయన డ్యూటీ నేను చేయనివ్వడం లేదు ఈయన ఆపుతున్నాడు అలా ఆయనకు కోపం వచ్చి ఈయన దగ్గరికి వచ్చాడు సో ఇలా బాబా గారి
(54:19) ఎన్నెన్ని చెప్పాలి అనుభవాలు బాబా గారు కెంచిదాం ఆశ్రమంలో ఉన్నప్పుడు ఒకరోజు ఆయన ప్రియ శిష్యున్ని పిలిచి రేపు నేను నేను బృందావన్ వెళ్ళాలి అనుకుంటున్నాను దానికి కావలసిన ఏర్పాట్లు చెయ్యి అని చెప్తారు అయితే ఈసారి నేను కార్లో కాకుండా రైల్లో వెళ్తాను అని చెప్తారు ఆ భక్తుడికి ఏం అర్థం కాదు ఇదేంటి ఫస్ట్ టైం ఈయన అంటే ఎప్పుడు బృందావనం వెళ్ళేవారు ఇక్కడి నుంచి కార్లో వెళ్ళేవారు ఈసారి ట్రైన్ లో వెళ్తాను అంటారు ఏంటి అని ఆలోచించి ఆయన గురువు కాబట్టి ఆయన చెప్పినట్టుగానే ట్రైన్ లో వెళ్ళడానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తాడు మరుసటి రోజు
(54:59) పొద్దున్నే బాబాగారు ఆ కెంచిదాం ఆశ్రమం మొత్తం చుట్టూ తిరిగి ఆ ఆశ్రమంలో ఉన్న కాళికాదేవి విగ్రహం ముందు హనుమంతుడి విగ్రహం ముందు సాష్టాంగ నమస్కారం చేస్తారు ఇది అక్కడున్న భక్తులకి కాస్త వింతగా ఉంటుంది అంటే ఎప్పుడూ చేయని విధంగా బాబాజీ ఆ రోజు చేస్తుంటారు ఒక్కసారిగా ఆకాశం మొత్తం కూడా ఉరుములు మెరుపులు మొదలవుతాయి అలా బాబా ఆ ఆశ్రమం నుంచి బయటకు వస్తారు రాంగానే ఆయన శరీరం పైన ఉన్న కంబలి కింద పడిపోతుంది అక్కడున్న భక్తుడు వెంటనే వెళ్లి ఆ కంబలిని తీసి బాబా శరీరం పైన కప్పాలని చూస్తారు చూస్తే బాబా ఆపి ఇక దీని అవసరం నాకు లేదు వదిలేయ్ అంటారు ఆ
(55:43) భక్తుడికి ఏం అర్థం కాదు అలా బాబా కెంధామ్ నుంచి మధుర స్టేషన్ చేరుకుంటారు చేరుకోగానే బాబాని చూడడానికి అక్కడున్న భక్తులందరూ మధుర రైల్వే స్టేషన్ లో వెయిట్ చేస్తుంటారు ఆయన శరీరం నుంచి విపరీతమైన వేడి వస్తుంది ఉంటుంది ఒక భక్తుడి దగ్గర బాబా నీళ్లు తీసుకుని తాగుతాడు తాగి బాబా అన్ కాన్షియస్ అయిపోతారు అప్పుడు బాబాని ఆశ్రమానికి తీసుకెళ్లకుండా నేరుగా రామకృష్ణ మిషన్ హాస్పిటల్ కి తీసుకెళ్తారు తీసుకెళ్లి ఆయనకు ఊపిరి ఆడడం ఇబ్బందిగా ఉంటే ఆక్సిజన్ మాస్క్ పెట్టి బ్లడ్ టెస్ట్ కి కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తుంటారు అప్పుడు బాబా కోపంతో ఆయనకు పెట్టిన మాస్క్
(56:23) ని తీసేసి నేల మీద కొట్టి ఇవేమి అవసరం లేదు అని చెప్పి జై జై జగదీష్ హరి జై జగదీష్ హరి జై జగదీష్ హరి అని మూడు సార్లు చెప్పి బాబాగారు శరీరాన్ని వదిలేస్తారు అలా బాబాగారు 1900 సంవత్సరం సెప్టెంబర్ 11వ తేదీన లక్ష్మీనారాయణ శర్మ గారి శరీరాన్ని తీసుకొని 1973 వ సంవత్సరం సెప్టెంబర్ 11వ తేదీన అంటే 73 సంవత్సరాలు ఆ శరీరంతో ఉండి బాబా నీమ్ కరులిగా శరీరాన్ని వదిలేస్తారు బాబా శరీరం తీసుకున్నది ఆ శరీరాన్ని విడిచిపెట్టింది రెండు ఒకటే రోజు బాబా శరీరం వదిలే ముందు కొంతమంది భక్తులు ఏడుస్తుండగా అప్పుడు
(57:09) బాబా గారు నేను ఎక్కడికి పోవడం లేదు ఇక్కడే ఉంటున్నాను కేవలం శరీరాన్ని మాత్రమే విడిచిపెడుతున్నాను అని చెప్పి శరీరాన్ని విడిచిపెడతారు దానికి నిదర్శనంగా బాబా శరీరం విడిచిపెట్టిన తర్వాత కూడా ఎంతో మంది భక్తులకు దర్శనం ఇచ్చారు ఇప్పటికీ ఇస్తున్నారు ఆయన జీవితం చరిత్రను చెప్పే అవకాశం నాకు ఇచ్చినందుకు శ్రీ నీమ్ కరులి బాబా గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా బాబా గారి జీవిత చరిత్రను విన్న మీ అందరికీ నా ధన్యవాదాలు జై నీమ్ కరులి బాబా జై శ్రీరామ్ జై హనుమాన్ మళ్ళీ మనం మరో గొప్ప యోగి జీవిత చరిత్రతో కలుసుకుందాం ఈ వీడియో
(57:50) మీకు నచ్చినట్లైతే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ధన్యవాదాలు
No comments:
Post a Comment