
🔪AI వాడి ఒక అమ్మాయి Faceని అసభ్యంగా మార్చడం నేరం. ఒక అమ్మాయి face తో అసభ్యంగా AI వీడియోస్ generate చేయడం నేరం. అందులో ఎలాంటి సందేహం లేదు.
మహాభారతంలో ద్రౌపది వస్త్రాపహరణం episode గుర్తు తెచ్చుకో. ఆ రోజు నిండు సభలో ద్రౌపదికి అవమానం జరుగుతుంటే, భీష్ముడు, ద్రోణుడు లాంటి పెద్దలు తలదించుకున్నారు. కానీ, అసలు ఆ పరిస్థితికి కారణం ఎవరు? పక్కనే ఉన్న పాండవులు కదా! ధర్మరాజు ద్రౌపదిని జూదంలో పణంగా పెట్టాడు. అంటే, అంత గొప్ప ధర్మరాజుకి కూడా తన భార్య, తన మహారాణి ఒక మనిషి లాగా కనిపించలేదు, తన సొంతమైన ఒక ఆస్తి లాగ కనిపించింది. నువ్వు ఒక మనిషిని propertyగా చూసిన క్షణానే, ఎదుటివాడు ఆ propertyని కొల్లగొట్టడానికి ప్రయత్నిస్తాడు.
🎞️ఈ సినిమా ఇండస్ట్రీ అనేది ఒక మోడ్రన్ జూద గృహం. ఇక్కడ Box office కలెక్షన్స్ కోసం, సినిమాల్లో హీరోయిన్ల దేహాన్ని పణంగా పెడుతున్నారు ఈ పాండవులు. అంటే మన హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు. ఒక Item song అనో, రొమాంటిక్ సీన్ అనో చెప్పి, ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి కెమెరా ముందు ప్రదర్శిస్తారు. ఇది వీళ్ళు చేస్తున్న Legal వస్త్రాపహరణం.
పాండవులు ఆ రోజు ద్రౌపదిని పణంగా పెట్టి, దుశ్శాసనుడు ఆమె చీర లాగుతుంటే "అయ్యో మా మహారాణికి ఎంత ఘోరం జరిగింది, మా దేవిని అవమానిస్తారా?" అని ఎలా అయితే ఏడ్చారో.. ఈ రోజు మన హీరోలు కూడా, వాళ్ళే హీరోయిన్లని గ్లామర్ పేరుతో అమ్ముకుని, ఇప్పుడు ఎవడో AI వాడి మార్ఫింగ్ చేస్తుంటే "అయ్యో స్త్రీలు దేవతలు కదా, ఇలాంటి నీచం చేస్తారా?" అని మొసలి కన్నీరు కారుస్తున్నారు.
🎦అసలు ఆ AI వాడేవాడు ఎవరో తెలుసా? వాడు ఈ మోడ్రన్ కౌరవుడు. నిండు సభలో పెద్దలు, అంటే సినిమా వాళ్ళు, ఒక స్త్రీని ఆటవస్తువుగా వాడుకోవడం వాడు చూశాడు. "వాళ్ళు కోట్లు పెట్టి కెమెరా ముందు ఆమె దేహంతో ఆడుకుంటుంటే తప్పులేదు, నేను నా ఫోన్లో freeగా ఆడుకుంటే తప్పా?" అనే తెగింపు వాడికి వచ్చింది. ఇండస్ట్రీ వాళ్ళు స్త్రీని ఒక భౌతికమైన వస్తువుగా మార్చి, కౌరవుల లాంటి ప్రేక్షకుల మెదళ్లలో కామాన్ని నింపారు. ఇప్పుడు ఆ విత్తనం మహా వృక్షమై, AI రూపంలో వాళ్లనే భయపెడుతోంది.
సినిమా వాళ్ళు హీరోయిన్ bodyని వాడుకుని బిజినెస్ చేస్తే అది Art. అదే పబ్లిక్ లో ఒకడు Freeగా AI tool వాడి తన fantasyని క్రియేట్ చేసుకుంటే అది Crime.
🔴అంటే problem ఆ అమ్మాయిని వస్తువుగా చూడటం కాదు. ఆ వస్తువుని అమ్ముకునే Monopoly మా చేతుల్లోంచి, ఒక Software చేతికి వెళ్ళిపోయిందే అన్న EGO. "స్క్రీన్ మీద మేము చూపించినంత వరకే నువ్వు ఆస్వాదించాలి, దానికి మాకు డబ్బులు కట్టాలి. నీ అంతట నువ్వుగా క్రియేట్ చేసుకుంటే మా బిజినెస్ మోడల్ ఏమైపోవాలి?" ఇదీ లోపల ఉన్న అసలు బాధ.
దేవత అని పిలవడం ఒక Patriarchal Trap. దేవతకి కోరికలు ఉండవు, హక్కులు ఉండవు, గుడిలో పెడితే కూర్చుంటుంది, పూజలు చేస్తే తీసుకుంటుంది. సినిమా వాళ్ళు ఈ 'దేవత' కార్డు ఎందుకు వాడుతున్నారంటే, అసలు పాయింట్ ని divert చేయడానికి.
Societyలో జరుగుతున్న ఒక తప్పును point out చేసే అర్హత, ఆ తప్పుకి foundation వేసిన వాళ్ళకి ఉంటదా? ఉండదు..
🟠నువ్వే ఒక స్త్రీని వస్తువులా project చేసి, రేపు సమాజం కూడా ఆమెను అలాగే చూస్తే ఆశ్చర్యపోవడం, కేవలం మూర్ఖత్వం మాత్రమే. ఈ సారి ఎవరైనా "స్త్రీలు దేవతలు" అని Emotional dialogueలు కొడితే, వాళ్ళ మొహం మీదే ఈ ప్రశ్న అడుగు... "దేవతల మీద ITEM SONGS తీసి డబ్బులు సంపాదించడం ఏ వేదంలో రాసి ఉంది?" అని. అప్పుడేం సమాధానమొస్తుందో చూడు.
-PRATIKULA VEDAM
http://youtube.com/post/UgkxUf2mG61wCtX6U92JorV-aKfOUweECekp?si=BAumfpKBE0rxYzmk
No comments:
Post a Comment