Sunday, October 4, 2026

మనిషి జీవితంలో బంధాలు లేకుండా జీవించడం సాధ్యమేనా? బంధం భారంగా ఎందుకు మారుతుంది? | Ram C Vision

మనిషి జీవితంలో బంధాలు లేకుండా జీవించడం సాధ్యమేనా? బంధం భారంగా ఎందుకు మారుతుంది? | Ram C Vision

Author Name:Ram C Vision

Youtube Channel Url:https://www.youtube.com/@RamCVision-d2f

Youtube Video URL:https://www.youtube.com/watch?v=SXfB-MiQ8nY





Title: మనిషి జీవితంలో బంధాలు లేకుండా జీవించడం సాధ్యమేనా? బంధం భారంగా ఎందుకు మారుతుంది? | Ram C Vision

Author Name: Ram C Vision

Description: మన జీవితంలో బంధాలు చాలా ముఖ్యమైనవి. కానీ ఒక ప్రశ్న ఎప్పుడైనా ఆలోచించారా?

ఎదుటివారు మనల్ని నమ్ముకున్నారు కాబట్టి, వాళ్లు బాధపడతారు కాబట్టి... మనం మన జీవితంలో ఉన్న ప్రతిదాన్ని వదులుకోవాల్సిందేనా?

ఒక బంధంలో ప్రేమ, అనుబంధం, బాధ్యతలు, అంచనాలు ఉంటాయి. కానీ వీటిలో ఏది ఎంతవరకు అవసరం? భావోద్వేగాలు లేకుండా బంధం సాధ్యమేనా? ఒకవేళ మన నిర్ణయం వల్ల ఎదుటివారు బాధపడితే మనం ఏం చేయాలి?

మన పరిస్థితిని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉందా? లేక మనల్ని నమ్ముకున్న ఎదుటివారు కూడా మన పరిస్థితిని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఉందా?

బంధంలో త్యాగం ఎక్కడివరకు ఉండాలి?
ఎక్కడ మన బాధ్యత ముగుస్తుంది?
ఎక్కడ ఎదుటివారి బాధ్యత మొదలవుతుంది?

ఈ వీడియోలో బంధాలు, భావోద్వేగాలు, బాధ్యతలు, అంచనాలు, త్యాగం, వ్యక్తిగత పరిమితులు వంటి విషయాలను సింపుల్‌గా అర్థం చేసుకునే ప్రయత్నం చేశాను.

చివరికి ప్రశ్న ఒక్కటే:

మనిషికి బంధం అవసరం.
కానీ బంధం కోసం మనల్ని మనం పూర్తిగా కోల్పోవాల్సిన అవసరం ఉందా?

మీ అభిప్రాయం కామెంట్‌లో చెప్పండి.

#బంధాలు #బంధం #కుటుంబం #ప్రేమ #భావోద్వేగాలు #బాధ్యత #త్యాగం #సంబంధాలు #మనిషి #మనస్తత్వం #జీవితం #సమాజం #Psychology #Relationships #Family

Transcript:
(00:00) గాయ్స్ ఒక్కసారి ఆలోచించండి మనిషికి బంధాలు అనేటివి అవసరమే కానీ బంధాలతో పాటు వచ్చే బాధ్యతలు, అంచనాలు, భావోద్వేగాలు ఎంతవరకు అవసరం మనిషి జీవితంలో బంధం అనేది లేకుండా జీవించడం సాధ్యం కాదా? తల్లిదండ్రులు పిల్లలు భార్యా భర్తలు స్నేహితులు తోబుట్టులు ఇలా ఏదో ఒక బంధం మన జీవితంలో ఉంటుంది. కానీ ఒక్క విషయం గమనించారా మనకు ఏ బంధమైనా ఎంత ముఖ్యమని అనుకుంటామో అదే బంధంతో పాటు మనకు భయం బాధ ఒత్తిడి బాధ్యత కూడా వచ్చేస్తుంది.
(00:38) మరి ఇక్కడ సమస్య బంధంలో ఉందా లేక బంధం మీద మనం పెట్టుకున్న అంచనాలలో ఉందా అదే ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ బంధం అంటే ఏంటి నేను ప్రేమిస్తున్నాను ప్రేమ బంధం నేను కన్నాను కాబట్టి పేగు బంధం తోడబుట్టారు కాబట్టి రక్త సంబంధం స్నేహం స్నేహ బంధం బంధం అంటే ఇంతేనా కాదు బంధంలో సాధారణంగా అనుబంధం ప్రేమ బాధ్యత అంచనాలు అవసరం భయం కోల్పోతానేమో అన్న భావన ఈ అన్ని భావోద్వేగాలు బంధంతో ముడిపడి ఉంటాయి ఈ అటాచ్మెంట్ అనేది ఈ ఎమోషన్స్ తో కలిసిపోయి ఉంటుంది. అందుకే మనిషి ఇక్కడ
(01:23) బంధంలో ఉన్నప్పుడు ప్రెజర్ ఫీల్ అవుతాడు. భారంగా ఫీల్ అవుతాడు కొన్ని చాలా సందర్భాలలో ఏ రిలేషన్ అయినా ఎమోషన్స్ తో ముడిపడి ఉన్నప్పుడు మనిషి ప్రెజర్ ఫీల్ అవ్వడం అనేది చాలా సాధారణంగా జరుగుతూ ఉంటుంది. బంధంలో ఉన్నప్పుడు అవతల వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు చేయకుంటే బాధ మనం బంధంలో ఉన్నప్పుడు మన వారి కోసం ఏదైనా చేయాలనిపిస్తుంది చేయలేకపోతున్నప్పుడు బాధ అవతల వాళ్ళు అర్థం చేసుకోలేదు అన్నప్పుడు కోపం నువ్వు నాతో బంధంలో ఉన్నావు కాబట్టి నువ్వు తప్పనిసరిగా ఇది చేయాల్సిందే అన్నప్పుడు చేయాలనుకున్న నువ్వు చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు అది తీవ్రమైన
(02:04) ఒత్తిడి ఇప్పుడు ఇదంతా మనిషికి భారంగా అనిపించదా కచ్చితంగా భారమే అవుతుంది మరి ఈ ఎమోషన్స్ అనేటివి బాధ పెడుతున్నాయి కదా మరి ఈ భావోద్వేగాలు లేకుండా బంధం అనేది సాధ్యమేనా ఇక్కడ రెండు విధాలుగా అర్థం చేసుకోవాలి ముందుగా బంధంలో నువ్వు ఎమోషన్స్ ఉండకూడదు అనుకుంటున్నావు కాబట్టి ఫస్ట్ నీకు ఎమోషన్స్ లేకుండా ఉన్నావో లేదో చూద్దాం బంధాన్ని పక్కన పెట్టు నాకు ఏ బంధము వద్దు నేను ఎవరి మీద ఆధారపడను ఎవరి వల్ల నాకు బాధ కలగకూడదు ఎవరేమైపోయినా నేను పట్టించుకోను నా బతుకేదో నేను బతికేస్తాను.
(02:46) ఇలా అనుకోవడం ప్రాక్టికల్ గా సాధ్యమా సాధ్యం కాదు ఎందుకంటే నువ్వు మనిషివి ఎప్పుడో ఒకప్పుడు ఏదో సందర్భంలో మన కొందరి మీద ఇష్టము ప్రేమ అనేది కలుగుతాది. నీ ఎమోషన్స్ ను నువ్వు కొంతవరకు కంట్రోల్ చేసుకోగలుగుతావేమో కానీ పూర్తిగా నియంత్రించడం అనేది సాధ్యం కాదు. ఇప్పుడు రెండవది అర్థం చేసుకుందాం. ఇక్కడ కూడా బంధములో భావోద్వేగం వద్దనుకుంటున్నారు కాబట్టి నేను బంధాన్ని పెట్టుకుంటాను కానీ భావోద్వేగాలకు లోనఅవ్వను ఇది సాధ్యమా నాకు నీ మీద ప్రేమ ఉంది కాబట్టి నీతో బంధం కోరుకుంటున్నాను కాబట్టి నిన్ను నేను నియంత్రిస్తాను నువ్వు ఎలా జీవించాలో నేనే
(03:27) నిర్ణయిస్తాను. నీకు ఏం కావాలో నేనే నిర్ణయిస్తాను నువ్వు ఏం చేయాలో నేనే నిర్ణయిస్తాను ఎందుకంటే నాకు ఎమోషన్స్ అనేటివి వద్దనుకుంటున్నా నీ నిర్ణయాలకి నీ జీవితాన్ని వదిలేస్తే దాని ప్రభావం నా మీద ఉంటుంది. అదే నీ జీవితాన్ని నేనే కంట్రోల్ చేస్తే అప్పుడు నాకు అనుకూలంగా నేను నిన్ను కంట్రోల్ చేయొచ్చు నా మీద ఎమోషన్స్ అనేటివి రోల్ ప్లే చేయలేవు కదా మరి ఇది ప్రాక్టికల్ గా సాధ్యమా కాదు నీకు ఎమోషన్స్ ఉన్నాయి ఒకవేళ నువ్వు నువ్వు కంట్రోల్ చేస్తాను నువ్వు పక్కన పెడతాను అంటే కూడా నీతో బంధంలో ఉన్న వారికి ఎమోషన్స్ ఉన్నాయి వారు పక్కన
(04:04) ఎందుకు పెడతారు పెట్టరు కదా అది నీ చేతిలో లేదు కదా సో ఇక్కడ కూడా ఎమోషన్స్ అనేటివి లేకుండా బంధం అనేది ప్రాక్టికల్ గా సాధ్యం కాదు. ఒక్క ప్రేమ బంధం అనే కాదు ఏ బంధం అయినా సరే నేను మిమ్మల్ని కన్నాను కాబట్టి పిల్లలు ఏం చేయాలనేది మేమే నిర్ణయిస్తాము మేమే వాళ్ళని కంట్రోల్ చేస్తాము మేము చెప్పినట్లే వినాలి అంటే కాదు భార్యా భర్తలు నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను కాబట్టి నేను నీకు కట్నం తెచ్చి ఇచ్చాను కాబట్టి నువ్వు చచ్చినట్లు నేను చెప్పినట్టు వినాలి నాకోసం ఇది చేయాలి నువ్వు ఏం చేయాలన్నా నేను నిర్ణయిస్తాను అంటే కాదు అలాగే నేను మగవాడిని నువ్వు
(04:43) ఆడదానివి నేను చెప్పినట్లు నువ్వు వినాలి నువ్వు ఎలా ఉండాలో నేనే నిర్ణయిస్తాను అంటే అది కూడా కాదు ఇవన్నీ సరైన బంధాలు కావు. ఇలాంటి బంధాలను మనం సమాజంలో కొంతవరకు చూస్తూనే ఉన్నాం కనబడుతూనే ఉన్నాయి ఎలా ఉంటాయి అనేది బంధం అంటే ఇరువైపులా ఉండాలి కదా అంటే ఏంటి ఇక్కడ ఎవరి పట్ల అటాచ్మెంట్ లేకుండా ఎమోషన్స్ లేకుండా ఉండడం అనేది ప్రాక్టికల్ గా సాధ్యం కాదు ఎందుకంటే నువ్వు మనిషివి నీకు ఎమోషన్స్ ఉన్నాయి మరోవైపు నాకు అటాచ్మెంట్స్ ఉంటాయి కానీ నాకు వారి పట్ల ఎమోషన్స్ నేను చూపించను అనేది కూడా సాధ్యం కాదు.
(05:19) ఎందుకంటే ఇక్కడ కూడా నీకు ఎమోషన్స్ ఉన్నాయి నువ్వు కంట్రోల్ చేసుకోవడం కష్టం అవుతుంది ఒకవేళ చేసుకున్న అవతల వాళ్ళకి ఎమోషన్స్ ఉన్నాయి వాటిని నువ్వు కంట్రోల్ చేయలేవు. మరి ఇక్కడ భావోద్వేగాలు లేకుండా బంధం ఎలా సాధ్యమవుతుంది? ఏ బంధానికైనా భావోద్వేగాలు తోడైతే మనిషికి ప్రెజర్ అనేది ఉండడం సహజం. ఎందుకంటే బంధంలో ఉన్నప్పుడు అంచనాలు అనేటివి ఉంటాయి, కోరికలు అనేటివి ఉంటాయి, బాధ్యతలు అనేటివి ఉంటాయి.
(05:48) వాటిని సరిగ్గా మనం నిర్వర్తించలేకపోయినప్పుడు మనకు ఆటోమేటిక్ గా ఒత్తిడి అనేది ఏర్పడుతుంది అప్పుడు ఆ బంధం మీద మనకు భారం అనే ఫీలింగ్ వస్తుంది. భావోద్వేగాలని ప్రేరేపించింది ఏంది ఒక అంచనా అంచనా ఎందుకు వచ్చింది బంధంలో ఉన్న కారణంగా వచ్చింది. ఈ బంధంలో ఉన్న కారణంగా ఒకరి మీద ఒకరికి అంచనా అనేది వస్తుంది. అయితే ఈ బంధంలో ఉన్నప్పుడు అంచనాలు ఎలా వస్తాయి? ఉదాహరణకి తల్లిదండ్రులు పిల్లల సంబంధం అనుకోండి నా పిల్లలు అంటే నాకు చాలా ఇష్టం ఇది సహజం నా పిల్లలు బాగా చదవాలి ఇది అంచన అలాగే భార్యా భర్తలు నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే నా మాట అర్థం చేసుకోవాలి. ఇది
(06:32) అంచన అదే తల్లిదండ్రులు పిల్లలు మీకోసం మేము ఇంత చేశాను నువ్వు మా మాట వినాలి. ఇది అంచన. ఈ అంజనాలు తప్పినప్పుడు మా మాట వినలేదని బాధ మమ్మల్ని అర్థం చేసుకోలేదని కోపం ఇది ఇలా జరగకపోతే వీరు ఏమైపోతారో వీరి భవిష్యత్తులు ఏమైపోతాయి అన్న భయం ఇవన్నీ ఎమోషన్స్ ఇవి ట్రిగ్గర్ అయినప్పుడు ఒత్తిడి భారం అనిపిస్తుంది. ఆ బంధమే కష్టంగా అనిపించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
(07:02) మరి ఇక్కడ బంధం అంటే ఏంటి కేవలం ప్రేమ మాత్రమేనా కేవలం అంచనాలేనా కేవలం కోరికలేనా కాదు ఇవన్నీ కలిసిపోయి బంధం అనేది భావోద్వేగాలతో ముడిపడి ఉంది. బంధం ఉంటే భావోద్వేగాలు ఉంటాయి భావోద్వేగాలు ఉన్నప్పుడు బంధం కూడా ఉంటుంది. అయితే ఇక్కడ సమస్య ఏముంది బ్రో ఈ బంధంలో ఉన్నప్పుడు వీరి మధ్య అంచనాలు ఉన్న కారణంగానే కదా అవి నెరవేరనప్పుడు వాళ్ళ ఎమోషన్స్ అనేటివి కోపం రూపంలోనో బాధ రూపంలోనో భయం రూపంలోనో ట్రిగర్ అవుతున్నాయి.
(07:36) ఈ అంచనాలనే అదుపు చేస్తే ఇక వీరి మధ్య సమస్యలే ఉన్నావు కదా హ్యాపీగా బతికేయచ్చు కదా అని అడుగుతారేమో ఇక్కడే మన సమాజం రోల్ ప్లే అవుతుంది. ఇప్పుడు బంధం అనేది ప్రేమను దాటి అంచనాలను దాటి ఈ సమాజంలోని పోలికలతో కనెక్ట్ అవుతుంది. ఉదాహరణకి వాళ్ళ పిల్లలు ఇలా ఉన్నారు మరి మన పిల్లలు వాళ్ళ ఇల్లు ఇలా ఉంది మరి మన ఇల్లు వారి ఉద్యోగాలు అలా ఉన్నాయి మరి మన ఉద్యోగం ఏంటి ఇలా ఉంది వాళ్ళ సంపాదన అంతా మరి మన సంపాదన ఏంటి అంటే వాళ్ళలాగా వీళ్ళలాగా ఉండాలని తీరని కోరికలు అందుకోలేని అంచనాలు బంధంలో ఉన్న వాళ్ళ కోసం అది చేయలేకపోతున్నాను అనే బాధ బంధంలో ఉన్నావు కాబట్టి ఇవి నాకోసం ఎందుకు
(08:21) చేయలేకపోతున్నావు అన్న కోపం అందరిలాగా మనం బాగుండాలి మన భవిష్యత్తులు బాగుండాలి తప్పకుండా చేయాల్సిందే చేయాల్సిన సామర్థ్యం లేకపోయినా నీకు వీలు కాకపోయినా చేయాల్సిందే చేయాల్సిందే ఒత్తిడి ఒత్తిడి ఒత్తిడి ఈ ప్రెజర్స్ తో బంధంలో ప్రశాంతత లేక సమాజంతో పోరాడలేక జీవితం ప్రెజర్ అనిపిస్తుంది భారంగా అనిపిస్తుంది.
(08:48) మరి ఇక్కడ సమస్య బంధం ఒకటేనా అంచనా ఒక్కటేనా కాదు అంచనాలతో పాటుగా బంధం చుట్టూ ఈ సమాజం నిర్మించిన ప్రమాణాలు కూడా అంతే ఈ సమాజంలోని ప్రమాణాలన్నీ మన జీవితాల్లోకి వచ్చేసాయి. మీరు ఏ విధంగా అయినా ఆలోచించండి మనం బాగా గమనిస్తే చాలా సందర్భాలలో బంధం కోసమే మన ఎమోషన్స్ ట్రిగర్ అవుతుంటాయి అది డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో బంధం భావోద్వేగం ఇవి రెండు బాగా కనెక్ట్ అయి ఉంటాయి.
(09:19) ఒకప్పుడు బంధం అనేది మనిషి తనని తాను కాపాడుకోవడానికి అవసరమైంది. కానీ ఈరోజు అదే బంధాన్ని కాపాడుకోవడం కోసం మనిషి పోరాడుతున్నాడు. అసలు బంధం ఎక్కడ మొదలయింది అది ఎలా మారుతూ మారుతూ మారుతూ ఈరోజు భావోద్వేగాలకు ఎలా కనెక్ట్ అయిపోయింది ఎలా ముడిపడిపోయింది అనేది నేను ఒక వీడియో చేస్తాను లేండి అయితే ఇప్పుడు ఈ ఎమోషన్స్ తో ఈ బంధాలలో ఈ ప్రెజర్స్ ఈ ఒత్తిడి ఈ భారం అని ఏదైతే భావిస్తున్నామో అది మనకు ఉండకుండా ఉండాలంటే ఈ బంధాల నుంచి బయట పడాలా ఏ బంధం నుంచి అయినా సరే మనం బయట పడడం కంటే ఆ బంధం మనమీద మీద ఎంత ప్రభావం చూపుతుంది అనేది అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు
(10:04) తల్లిదండ్రులు పిల్లల కోసం బాధ్యత తీసుకోవడం అనుకుందాం. పిల్లలు అనేవాళ్ళు నా బాధ్యత వాళ్ళు బాగుండాలి వారి భవిష్యత్తు బాగుండాలి దానికోసం నేను నా బాధ్యతలని నిర్వర్తించాలి. ఎంతవరకు నిన్ను నువ్వు కోల్పోనంతవరకు నా పిల్లలు బాగుంటే చాలు నేను ఏమైపోయినా పర్వాలేదు నా పిల్లల్లో భవిష్యత్తు బాగుండాలి దానికోసం నేను ఏమైనా చేస్తాను నేను చచ్చిపోయినా పర్వాలేదు నా పిల్లలు బాగుండాలి.
(10:36) ఇలా అనుకోవడం ఆ బంధంలో తప్పనిసరియా కాదు ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే నీది కూడా ఒక జీవితం అది మర్చిపోకూడదు. నిన్ను నువ్వు కోల్పోయే అంత ఇదిగా ఉన్నావు అంటే అక్కడ భావోద్వేగాలు ట్రిగర్ అవుతాయి. ట్రిగర్ అయినప్పుడు నువ్వు ఏవైతే ఆ బంధం కోసం ఆ పిల్లల కోసం చేయాలనుకున్నావో అవి నువ్వు చేయలేని పక్షంలో నువ్వు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతావ్.
(11:01) ఆ ఒత్తిడి దేని కారణంగా వచ్చింది? ఆ బంధం కారణంగా వచ్చింది. అప్పుడు ఏం బంధాలు రా బాబు అనిపిస్తుంది. అదే భార్యా భర్తల బంధం. మనం పెళ్లి చేసుకున్నాము మీ బాధ్యత నా మీద ఉంది. కాబట్టి ఆ బాధ్యతలను నేను నిర్వర్తించాలి. ఎంతవరకు నేను పెళ్లి చేసుకున్నాను కాబట్టి నీకు ఇది కావాలి కాబట్టి చేయకపోతే నువ్వు బాధపడతావు కాబట్టి నేను చేసి తీరుతాను దానికోసం నేను ఏమైపోయినా పర్వాలేదు అన్నంతవరకా నువ్వు చేయలేని పరిస్థితుల్లో కూడా చేస్తావా ఇది ఎంతవరకు సరైనది లేదు నువ్వు చేయలేని పరిస్థితుల్లో ఉన్నా సరే అవతల వాళ్ళు అర్థం చేసుకోవాల్సిందే వారు కూడా బంధంలో ఉన్నారు కదా అరే నా బాధ్యత తీసుకున్నాడు
(11:42) నాకోసం ఎంతో చేయాలి అనుకుంటున్నాడు ఒకవేళ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాడేమో అదే అమ్మాయి వైపు అయితే చేయలేని పరిస్థితుల్లో ఉందేమో అని అవతల వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. అంతేగాని నాకు బాధ్యత ఉంది కాబట్టి నేను ఏమైపోయినా సరే చేయాల్సిందే అన్న నియమం ఏమీ ఉండదు. మనక ఇక్కడ ఇంకో డౌట్ వస్తుంది. వాళ్ళు మన జీవితంలోకి వచ్చినప్పుడు వారు ఏదైనా కోరుకున్నప్పుడు మనం వారి కోసం చేయకపోతే మనం ఆ మాత్రం త్యాగాలు చేయకపోతే వాళ్ళు బాధపడతారు కదా అని గుర్తుపెట్టుకోండి మనం తీసుకున్న ప్రతి నిర్ణయానికి చేసే ప్రతి పనికి ఎదుటివారు సంతోషపడాలి అనేది సాధ్యం
(12:24) కాదు. మనకు ఒక నిర్ణయం సరైనదే అనిపించొచ్చు. ఒక పని ముఖ్యం అని అనిపించొచ్చు. అవి నువ్వు చేయడం వల్ల అవతల వాళ్ళు ఇబ్బంది పడొచ్చు సంతోష పడాలని లేదు. అలా అని చెప్పి నువ్వు చేయకుండా మానేస్తావా అప్పుడు అది నువ్వు త్యాగం చేసినట్లే కదా ఇప్పుడు వాళ్ళు బాధపడతారని నువ్వు వీటిని వదులుకుంటే వీటిని వదిలినందుకు నువ్వు బాధపడతావు కదా వాళ్ళు వీళ్ళు బాధపడతారు అనేసి నీ జీవితం మొత్తాన్ని త్యాగం చేయాల్సిందేనా తప్పదా అలా కాదు మన బాధ్యత ఏంటో మనం అర్థం చేసుకోవాలి.
(13:00) బంధం పట్ల నిజాయితీగా ఉండాలి బంధంలో వారిని గౌరవించాలి బంధానికి సంబంధించి వాళ్ళు ప్రభావితం అవుతారన్న ఏ నిర్ణయానికి సరే మనం బాధ్యత తీసుకోవాలి. మన బంధంలో ఉండి దాని కారణంగా నేను ఈ నిర్ణయం తీసుకున్నాను దాని వల్ల ఏదన్నా ఓ ప్రభావితం అయితే బంధంలో ఉన్నవారు దానికి మనం బాధ్యత తీసుకోవాల్సిందే తీసుకుంటాం కూడా ఎప్పుడు మన నిర్ణయాల వల్ల ఏదైనా ఎఫెక్ట్ అయినప్పుడు అంతేగాని మన నిర్ణయాలనే వాళ్ళ కోసం మార్చేసుకోవడం వదిలేసుకోవడం ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే నువ్వు నిజాయితిగా ఉన్నావ్ నీ నిర్ణయంలో అర్థం ఉంది నువ్వు చేసే పనిలో అర్థం ఉంది కాబట్టి త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు.
(13:42) ఎంతకీ త్యాగాలు చేయలేం కదా వారు బాధపడతారు వీరు బాధపడతారు అంటే వారి వారి ఎమోషన్స్ మన కంట్రోల్ లో ఉంటాయా ఉండవు. బంధం అనేది ఇద్దరిది బంధం అయినప్పుడు అవతలను కూడా అలానే అర్థం చేసుకోవాలి. అరే ఏదో ఒక నిర్ణయం తీసుకున్నాడు నాకు నచ్చట్లేదు బాగానే ఉంది అయినా ఆ నిర్ణయం వల్ల మాకు ఏమైనా మంచి జరుగుతుందేమో అతను సరైనది అని నమ్ముతున్నాడు కదా నేను అర్థం చేసుకోవాలి కదా నాకోసం అతను ఎందుకు అన్ని త్యాగాలు చేయాలి ఎందుకు మార్చుకోవాలి నేను ఎందుకు అతన్ని అర్థం చేసుకోవాలని అవతలవాళ్ళు కూడా ఆలోచించాలి కదా బంధం అంటే రెండు వైపులా స్ట్రాంగ్ గా ఉండాలి కదా
(14:18) అయితే ఎన్ని మాట్లాడుకున్నా సరే బంధానికి భావోద్వేగానికి అనేది మంచి కనెక్షన్ ఉందని మనకు అర్థంవుతుంది ఒకవేళ బంధంలో కొనసాగాలి అనుకుంటే ఈ ఎమోషన్స్ ని కొంతవరకైనా కంట్రోల్ చేసుకోగలమా బంధాన్ని ఒక హెల్దీగా ముందుకు తీసుకెళ్ళగలమా నేను బంధంలో ఉండాలనుకుంటున్నాను ఇలాంటి ఆలోచనలో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే బంధం కావాలనుకున్న వారు ఎవరైనా సరే వారికి వారే నాలుగు క్వశ్చన్లు వేసుకోవాలి.
(14:47) నేను చేస్తున్నది ఏదైనా సరే నిజంగా ఇది నా బాధ్యతేనా నేను ఇది ప్రేమతో చేస్తున్నానా లేక భయంతో చేస్తున్నానా ఎదుటివారి అంచనాలను నెరవేర్చడం అనేది నిజంగా నా బాధ్యతేనా ఈ బంధాన్ని కాపాడుకోవడానికి నేను నా జీవితాన్ని ఏమైనా కోల్పోతున్నానా ఈ ప్రశ్నలు బంధంలో ఉన్నవారు వారికి వారే వేసుకుంటే ఒక క్లారిటీ వస్తుంది. అంటే ఆ బంధంలో మనం ఎంతవరకు ఉన్నాం ఎంతవరకు ఉండాలి పరిమితి ఎంతవరకు అనేది చూడండి ఎక్కడ కూడా మనిషికి బంధాలు వద్దు అని కాదు ప్రతి బంధానికి ఒక హద్దు ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి బంధాల పట్ల బాధ్యతలు తీసుకోకూడదని కూడా కాదు ఏ బాధ్యతకైనా ఒక
(15:35) పరిమితి ఉంటుంది అని అర్థం చేసుకోవాలి. బంధాలలో భావోద్వేగాలు ఉండకూడదని కాదు ప్రతి అంచనాలని మనము ప్రెజర్ గా ఫీల్ అవుతున్న సరే తీర్చాల్సిన అవసరం లేదు అని అర్థం చేసుకోవాలి. బంధాల నుంచి బయట పడటం కాదు బంధంలో మన స్థానం మన బాధ్యత మన పరిమితి ఏంటో అర్థం చేసుకోవడం ముఖ్యం. సో ఇది గాయస్ ఈ వీడియో ఈరోజు మనుషులు బంధానికి భావోద్వేగాలకి మధ్య ఏ విధంగా సతమతం అవుతున్నారు అనేది ఈ బంధాల నుంచి మనిషి బయట పడడం అనేది సాధ్యమేనా అసలు పడాల్సిన అవసరం ఉన్నాదా అనేది క్లియర్ గానే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో
(16:17) పట్ల మీ ఉద్దేశం ఏదన్నా గాని కింద కామెంట్ లో చెప్పండి. ఇలాంటి మరెన్నో ఉపయోగకరమైన వీడియోలు నేను అప్లోడ్ చేసిన వెంటనే మీ దృష్టికి రావాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థాంక్యూ సో మచ్.

No comments:

Post a Comment