✈️ఆకాశంలో వేల అడుగుల ఎత్తున, ఊహించని విధంగా తన పక్కనున్న Pilot కత్తితో దాడికి దిగడం, రక్తం కారుతున్నా వెనక్కి తగ్గకుండా ఒక భారతీయ Co-Pilot Smit Machchhar విమానాన్ని, ప్రయాణికులను కాపాడటం.. ఇది నిజంగా రోమాలు నిక్కబొడుచుకునే అద్భుతమైన సాహసం. కానీ, ఈ వార్త బయటకు రాగానే సమాజంలో జరిగిన చర్చ ఏమిటి? ఆ Pilot ప్రాణాపాయ స్థితిలో తన మనసులో 'హనుమాన్ చాలీసా' చదువుకున్నానని చెప్పాడు. అంతే, Technical విషయాలు, అతని ధైర్యం, ప్రయాణికుల support అన్నీ side track అయిపోయాయి. "హనుమాన్ చాలీసా చదివాడు కాబట్టే హనుమంతుడు వచ్చి విమానాన్ని కాపాడాడు" అనే స్థాయికి చర్చ వెళ్లిపోయింది. 🔴ఒక్క నిమిషం ఆగి, ఏ మతపరమైన పక్షపాతం లేకుండా, ఒక Philosophical and Logical Perspective లో ఈ సంఘటనను విశ్లేషిద్దాం. Logic లేకుండా ప్రచారమౌతున్న మొదటి మాట.. "అతను హనుమాన్ చాలీసా చదివాడు, దేవుడు విమానాన్ని కాపాడేశాడు." సరే, ఒకవేళ తన స్థానంలో ఒక Muslim Pilot ఉండి, అల్లాని ప్రార్ధించుంటే ? లేదా ఒక Chirstian Pilot ఉండి Jesus ని ప్రార్ధించుంటే? ఆ దేవుళ్లు విమానాన్ని గాలిలో వదిలేసి, Crash అవ్వనిచ్చేవారా? దేవుడు అంటే కేవలం ఒక మతానికి చెందినవాళ్లని మాత్రమే కాపాడే పక్షపాతా? దేవుడు ఒక కంట్రాక్టరా? ⚪ఇక్కడే మనం అసలైన ఆధ్యాత్మికతను మిస్ అవుతున్నాం. ప్రార్థన అనేది బయట ఉన్న భౌతిక ప్రపంచాన్ని లేదా పరిస్థితులను మార్చడానికి కాదు, ఆ పరిస్థితులను ఎదుర్కొనే నీ 'మనస్సు'ను సిద్ధం చేయడానికి. 🔪కత్తిపోట్లు తిని, రక్తం కారుతూ, చావు కళ్లెదుట కనిపిస్తున్నప్పుడు ఏ మనిషికైనా భయం వేస్తుంది. Brain Panic అవుతుంది. చేతులు వణుకుతాయి. ఆ క్షణంలో Brain కి కావాల్సింది Focus. ఆ Co-Pilot తనకు చిన్నప్పటి నుండి బాగా అలవాటైన, తన Subconscious Mind లో నాటుకుపోయిన 'హనుమాన్ చాలీసా'ను మనసులో చదువుకున్నాడు. దాని వల్ల ఏమైంది? అతని మనసులో పుట్టాల్సిన భయం, ఆందోళన స్థానంలో ఒక దృఢత్వం వచ్చింది. Brain Panic State నుంచి focused state కి వచ్చింది. దానివల్లే అతను కత్తిపోట్లను సైతం తట్టుకుని పోరాడగలిగాడు. ఇక్కడ మంత్రం పని చేసింది విమానం ఇంజిన్ మీద కాదు, Pilot మెదడు మీద. 🟠హనుమంతుడిని ప్రార్ధించడం వలన, ఇప్పుడు హనుమంతుడొచ్చి ఏదో రక్షించేస్తాడని కాదు. తమని తాము రక్షించుకోడం కోసం అవసరమైన బలం, బుద్ధి, విద్య, వొస్తాయనేది నిజమైన హనుమంతుడి భక్తుల నమ్మకం. సీతాదేవి కనిపించనప్పుడు హనుమంతుడు ఒక చెట్టు కింద కూర్చుని "రామ రామ" అని జపం చేస్తూ కూర్చోలేదు. తన శక్తిని కూడదీసుకుని సముద్రాన్ని లంఘించాడు, లంకను వెతికాడు, రాక్షసులతో పోరాడాడు. అంటే హనుమంతుడు అంటేనే ఒక నిరంతర ఆచరణ, Relentless Action. ఆ Co-Pilot హనుమాన్ చాలీసా చదువుతూ, చేతులు కట్టుకుని, కళ్లు మూసుకుని ధ్యానం చేసి ఉంటే ఏమయ్యేది? విమానం నేలకు కుప్పకూలేది. అతను చాలీసా చదువుతూనే, తన తోటి ప్రయాణికుల సహాయంతో విమానం Controls ని తన అధీనంలోకి తీసుకున్నాడు. తన Duty, ధర్మం నిర్వర్తించాడు. అతని భక్తి, అతని చేతల్లో కనిపించింది. దేవుడు ఆకాశం నుంచి వచ్చి విమానాన్ని పట్టుకోలేదు.. ఆ Pilot లోపల ఉన్న ధైర్యంగా మారి, అతని చేతుల ద్వారా విమానాన్ని control చేశాడు. 🚫చాలామంది మతాన్ని ఒక Short Cut లా వాడుకుంటారు. "నేను పూజ చేశాను కదా, నాకేం కాదు", "నేను మంత్రం చదివాను కదా, దేవుడు చూసుకుంటాడు" అనుకోవడం ఒక మానసిక బద్ధకం. ✈️విమానం గాలిలో ఎగురుతోంది అంటే దానికి కారణం Aerodynamics, Bernouli సూత్రం, And ఆ విమానాన్ని design చేసిన వేలాది మంది ఇంజనీర్ల మేధస్సు. ఆ క్షణంలో విమానం safe గా land అయింది అంటే కారణం.. ఆ Co-Pilot తీసుకున్న training, అతని presence of mind, దానికి తోడు ప్రయాణికులు చూపించిన తెగువ. వీటన్నింటినీ పక్కనపెట్టేసి, కేవలం "హనుమాన్ చాలీసా చదివాడు కాబట్టే అంతా set అయిపోయింది" అనడం ఆ pilot కష్టాన్ని, training ని అవమానించడమే కదా! ఇది ఎలాంటిదంటే.. పది సంవత్సరాలు కష్టపడి చదివి ఒక విద్యార్థి IAS పాస్ అయితే, వాళ్ల అమ్మ వచ్చి "మా వాడు రోజూ గుడికి వెళ్తాడు, అందుకే పాస్ అయ్యాడు" అన్నట్లు ఉంటుంది. ఆ credit మొత్తం మతానికి ఇచ్చేయడం వల్ల, మనిషి ప్రయత్నానికి విలువ లేకుండా పోతోంది. 🟢మనం మతాన్ని ప్రతి చిన్న విషయానికి ముడిపెట్టి, మన బాధ్యతల నుంచి తప్పించుకోవాలని చూస్తుంటాం. ఒక ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, హిందువు అయినా.. విపత్కర పరిస్థితుల్లో తమకు నమ్మకం ఉన్న దేవుడిని తలుచుకుంటారు. అది వారికి ఒక మానసిక ధైర్యాన్ని, ఆశాభావాన్ని ఇస్తుంది. అంతవరకే. ఆ తర్వాత తమ మెదడును, నైపుణ్యాన్ని ఉపయోగించి పోరాడాల్సింది మనిషే. 👨🏻✈️ఈ సంఘటనలో మనం గర్వపడాల్సింది ఆ Co-Pilot చదివిన చాలీసా గురించి కాదు. రక్తం కారుతున్నా, తన ప్రాణం పోతున్నా సరే, వందలాది మంది ప్రయాణికుల ప్రాణాల కోసం అతను చూపించిన తెగువ గురించి. ఆ 'తెగువ'కు ఏ మతమూ లేదు. అది మనిషిగా అతని అత్యున్నత శిఖరం. So గ్రంథాలు చదవడం అంటే అద్భుతాలు జరుగుతాయని ఎదురుచూడటం కాదు. ఆ గ్రంథాలు ఇచ్చే స్ఫూర్తితో, కష్టకాలంలో నిలబడి పోరాడటం. ఆ Co-Pilot చేసింది అదే. ఆ పోరాటాన్ని మెచ్చుకుందాం, అంతే కానీ ఈ సంఘటనకు మతపరమైన రంగు పులిమి, ఆ సాహసాన్ని చిన్నదిగా చెయ్యొద్దు. HATSOFF TO "Smit Machchhar"🇮🇳 -PRATIKULA VEDAM.
http://youtube.com/post/UgkxkkcDeMZwCJISERDI_8fNKHzDGtwrFu96?si=cH3njkmyhVK9iRco
No comments:
Post a Comment