🟠మనిషి mind కి ఉన్న అతి పెద్ద జబ్బు ఏంటో తెలుసా? "Labels". మనకి ప్రతి దానికి ఒక tag తగిలించి, ఒక box లో పడేసి lock చెయ్యకపోతే మన ego కి అస్సలు నిద్ర పట్టదు. ఒక మనిషి నుదుటి మీద ఒక చుక్క లేదా బొట్టు కనిపిస్తే, వెంటనే "వీడు హిందువు, వీడు ఆస్తికుడు, వీడు ఫలానా మతం" అని ఒక stamp వేసేస్తాం. ఎందుకంటే, లోతుగా బుర్ర పెట్టి ఆలోచించడం కష్టం..అలా కాకుండా ఏ మాత్రం బుర్ర వాడకుండా పైపైన చూసి categorize చేసేయడం చాలా easy.
అసలు ఆ 'బొట్టు' అనే దాన్ని ఒక మతం patent లాగా ఎందుకు చూస్తున్నారు? ఈ rationalists కి, religious blind followers కి ఉన్న common problem ఏంటంటే.. ఇద్దరూ ఒక visual cue ని పట్టుకుని కొట్టుకుంటారు తప్ప, దాని వెనక ఉన్న అసలైన core mechanics ని అర్థం చేసుకోరు. ఒకడు గుడ్డిగా పూజిస్తాడు, ఇంకొకడు గుడ్డిగా ద్వేషిస్తాడు. But నిజమైన rationality అంటే గుడ్డిగా reject చెయ్యడం కాదు, అసలు ఆ practice వెనక ఉన్న science and psychology ని question చేసి తెలుసుకోవడం.
🟢Islam లో చూస్తే:
నమాజ్ లో చేసే 'సజ్దా' ని ఒకసారి observe చెయ్. ఒక ముస్లిం ప్రార్థన చేసేటప్పుడు తన నుదురు, సరిగ్గా రెండు కనుబొమ్మల మధ్య భాగం నేలకు ఆనిస్తాడు. అక్కడ జరిగే physical science ఏంటి? తల కిందికి వంచడం వల్ల blood flow అంతా prefrontal cortex, మెదడు ముందు భాగం వైపుకి వెళ్తుంది. ఆ focal point నేలకి press అయినప్పుడు, వాడిలోని ego ground అయిపోయి, mind calm అవుతుంది.
అంటే వాళ్ళు రోజుకి ఐదుసార్లు ఆ awareness point ని నేలకి ఆనించి తమని తాము center చేసుకుంటారు. రెగ్యులర్ గా నమాజ్ చేసేవాళ్ళకి ఆ pressure వల్ల నుదుటి మీద ఒక mark కూడా వస్తుంది. వాళ్ళు కుంకుమ పెట్టుకోకపోవచ్చు, కానీ వాళ్ళు physically hit చేసే target మాత్రం అదే!
⚪Christianity లో చూస్తే:
క్రిస్టియన్స్ ప్రార్థన మొదలుపెట్టేటప్పుడు వేసుకునే 'Sign of the Cross' ఎక్కడినుంచి మొదలవుతుంది? సరిగ్గా అదే నుదుటి మీద చేతిని టచ్ చెయ్యడంతో.
ఇంకా specific గా చెప్పాలంటే, వాళ్ళకి 'Ash Wednesday' అని ఒక ముఖ్యమైన రోజు ఉంటుంది. ఆ రోజున church లో ఫాదర్ వచ్చి, ప్రతి ఒక్కరి కనుబొమ్మల మధ్య బూడిద (Ash) తో శిలువ వేస్తాడు. దాని వెనక ఉన్న philosophy ఏంటి? "నువ్వు మట్టినుంచి వచ్చావు, మళ్ళీ మట్టిలోనే కలిసిపోతావు" అని వాళ్ళ ego ని బద్దలుకొట్టి, mortality ని గుర్తుచేసి, awareness ని నిద్రలేపడమే.
హిందువు కుంకుమతో ఆ పాయింట్ ని touch చేస్తాడు, Muslim నేలకి ఆనించి ఆ పాయింట్ ని press చేస్తాడు, Chirstian బూడిదతో ఆ పాయింట్ ని mark చేస్తాడు.
🔵ఇక ఈ మతం అనే అద్దాలు కాస్త తీసేసి, basic human anatomy and psychology వైపు నుంచి చూద్దాం.
మన రెండు కనుబొమ్మల మధ్య ఉన్న space ని scientifically 'Glabella' అంటారు. Ancient texts లో దీన్ని 'ఆజ్ఞా చక్ర' అన్నారు. ఇది ఏదో మబ్బుల్లో కూర్చున్న దేవుడికి సంబంధించిన విషయం కాదు. ఇదొక biological and neurological focal point. ముఖంలో ఉండే ఎన్నో సున్నితమైన నరాలు which are branches of the Trigeminal nerve, ఇక్కడే connect అవుతాయి. Modern Acu pressure science ప్రకారం, ఈ point ని Yin Tang point అంటారు. దీన్ని mild గా press చేసినా, లేదా అక్కడ ఒక physical sensation ని క్రియేట్ చేసినా, అది మన nervous system ని calm చేసి, stress ని తగ్గిస్తుంది. అంతే కాదు, మన మెదడు ముందు భాగంలో ఉండే prefrontal cortex.. మన logic, decision making, and conscious awareness కి కేంద్రం. దానికి exact గా ముందు ఉండే physical spot ఇది. It is literally a physical gateway to your cognitive awareness. It's an ancient neuro-hacking technique, not a religious trademark.
🟡ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన ఇంకో పెద్ద comedy ఏంటంటే.. ఒకడు 50 వేలు పెట్టి ఒక పిచ్చి brand logo ఉన్న T-shirt వేసుకుంటాడు, ఇంకొకడు మెడ మీద అర్థం పర్థం లేని ఒక Tattoo వేయించుకుంటాడు. "ఇది ఎందుకు వేసుకున్నావు?" అని వాళ్ళని ఎవరూ ప్రశ్నించరు. ఎందుకంటే అది వాళ్ళ status symbol, వాళ్ళ ego కి ఒక extension. ఈ senseless పనులకి మనకి ఏ logics అక్కర్లేదు. కానీ, వేల ఏళ్ల క్రితం ఒక highly evolved civilization కనిపెట్టిన ఒక attention-retention tool ని, కేవలం మన awareness ని center చేసుకోవడానికి వాడుకుంటే మాత్రం, మనకి దేవుళ్లు, మతాలు, కులాలు, హేతువాదాలు గుర్తొచ్చేస్తాయి. Waah..
ఇంత Simple logic ని అర్ధం చేసుకోడానికి, ఏ పవిత్ర గ్రంధాలు చదవఖ్ఖర్లేదు, ఏ గుడులకీ వెళ్లాల్సిన అవసరం లేదు, ఒక group కి, అంధ భక్తుల్లాగా భజన చెయ్యాల్సిన పనీ లేదు. కాస్త COMMON SENSE, ఇంకొంచెం Awareness ఉంటే చాలు.
కానీ ఏం చేస్తాం... మన చుట్టూ ఈ రెండూ లేనోళ్లే ఉన్నారు. విచిత్రమేంటంటే, కొన్ని సార్లు వీళ్ళు ముఖ్య మంత్రులు, ప్రధాన మంత్రులు కూడా అయిపోతుంటారు.
-PRATIKULA VEDAM
http://youtube.com/post/UgkxOtAKtc4BdTsKx5jEa9r8Ud80brOt34f2?si=9T8HBHK4tb04LGNY
No comments:
Post a Comment