Saturday, February 8, 2025

 *శ్రీరంగం... భూలోక వైకుంఠం*

ఉభయ కావేరీ నదుల మధ్య రూపుదిద్దుకున్న ద్వీపంలో సప్త ప్రాకారాలతో పదిహేను గోపురాలతో విలసిల్లే భూలోక వైకుంఠమే శ్రీరంగం.. శ్రీరంగనాథస్వామి ఆలయం. దీన్నే తిరువరంగం మూర్తికి పెరియ పెరుమాళ్ ' అని పిలుస్తారు. తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిరాపల్లిలో ఉందీ దివ్యధామం శ్రీమహావిష్ణువు. స్వయంభువుగా అవతరించిన ఎనిమిది ప్రసిద్ధ బంగారుస్తంభాలను దివ్యక్షేత్రాల్లోనూ, 108 వైష్ణవ దివ్యదేశాల్లోనూ ఇదే తిరుమణైత్తూణ్ అంటారు. ప్రధానమైనది. శ్రీరామ, శ్రీకృష్ణావతారాలకు నంబెరుమాళ్ల సౌందర్య క్షీరాబ్ధినాథుడు మూలమనీ, అర్చావతారాలకు సముద్రంలో పడి శ్రీరంగనాథుడే మూలమనీ వైష్ణవుల విశ్వాసం. కొట్టుకునిపోకుండా ఉండేందుకే అళ్వారులు కీర్తించిన దివ్యదేశాల్లోనూ ఇదే " కీలకమైనది. అందుకే వాళ్ల దివ్య ప్రబంధాలతోపాటు రామానుజుని విశిష్టాద్వైత సిద్ధాంతానికి పట్టుగొమ్మగా నిలిచింది శ్రీరంగం. 9వ శతాబ్దంలో తలక్కాడుని పాలించిన గంగ వంశానికి చెందిన తొండమాన్ రాజా ఈ ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించాడట. ఆ తరవాత 44వ అళంగీయ సింగర్ జీయర్ స్వామి కలలోకి శ్రీమన్నారాయణుడు వచ్చి ఆలయాన్ని కట్టించమని కోరడంతో ఆయన దీన్ని కొంతవరకూ పూర్తిచేసినట్లు తెలుస్తోంది. ఆపై వరసగా చోళ, పాండ్య, హొయసల, విజయనగర రాజులకు సంబంధించిన శాసనాలెన్నో ఈ ప్రాంగణంలో కనిపిస్తాయి. ఇలా ఎందరో చక్రవర్తులు దీని నిర్మాణంలో పాలుపంచుకున్నప్పటికీ చోళుల కాలంలోనే దీన్ని కట్టించినట్లు తెలుస్తోంది. ముసల్మానులు, ఆంగ్లేయుల దాడుల్నీ ప్రకృతి విపత్తుల్ని తట్టుకుని నిలిచిందీ ఆలయ సముదాయం. అల్లావుద్దీన్ ఖిల్జీ ఈ ప్రాంతాన్ని ఆక్రమించిన సమయంలో ప్రధాన ఆలయంలోని విష్ణుమూర్తి విగ్రహాన్ని అక్కడి పూజారులు దాచిపెట్టారనీ తరవాతి కాలంలో విజయనగర సామ్రాజ్యాధిపతి అయిన కుమార కంబుడు ఆ విగ్రహాన్ని పునఃప్రతిష్టించి, ఆలయాన్ని పునరుద్ధరించాడ

అందుకే ఇది టెంపుల్ టౌన్. పేరొందింది. ఇక, గర్భాలయంలోని

శేష శయన భంగిమలో ఉన్న

అని పేరు. ఆయనకు

ఎదురుగా ఉన్న

ఆలయ ప్రత్యేకతలెన్నో..! సుమారు 156 ఎకరాల్లో 4,116 మీటర్ల చుట్టుకొలతతో నిర్మితమైన ఈ ఆలయం, ప్రస్తుతం ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయసముదాయంగా పేరొందింది. 11 అంతస్తులతో 237 అడుగుల ఎత్తు ఉన్న ఇక్కడి రాజగోపురం ఆసియా ఖండంలోకెల్లా పెద్దది. ఆలయ ప్రాంగణంలో 81 దేవతామూర్తులు గురుల్నీ విశ్రాంతి గదుల్నీ వాణిజ్య సముదాయాల్నీ కట్టించిన తీరు సందర్శకుల్ని చకితుల్ని చేస్తుంది.

ఈ స్తంభాలని ప్రతీతి. ప్రాంగణంలో 12 నీటికొలనులు ఉంటే వాటిల్లోని సూర్య, చంద్ర పుష్కరిణుల్లో 20 లక్షల లీటర్లకు పైగా నీళ్లు పడతాయట. ఇక్కడ స్వామిని గరుడ వాహన, సింహవాహన, హనుమంత, శేషవాహన రథాల్లో ఉరేగిస్తారు. ఇక్కడున్న గరుడాళ్వార్ విగ్రహం ఎత్తు 25 మీటర్లు. ఆయన అలంకరణకు 30 మీటర్ల పొడవాటి వస్త్రాన్ని వాడతారట. గరుడాళ్వార్ కి ప్రత్యేకంగా మంటపం కూడా ఉంది. క్షీరసాగరమధనంలో పుట్టిన ధన్వంతరికి ఆలయం ఒక్క శ్రీరంగంలోనే ఉంది. చారిత్రక కాలంనాటి మురుగునీటి నిర్వహణ, వర్షపునీటిని నిల్వచేసుకునే విధానంతో ఈ ఆలయం ఐక్యరాజ్యసమితి అవార్డునీ సొంతం చేసుకుంది.

దేవాలయ ప్రాంగణంలో...!

ప్రధాన ద్వారం దాటి వెళ్లగానే వచ్చే మొదటి ప్రాకారంలో చిలుకల మండపం, యాగశాల, విరాజుబావి, రెండో మండపం, హయగ్రీవ, సరస్వతీ ఆలయాలు; మూడోదాంట్లో గరుత్మంతుని సన్నిది. వాలీసుగ్రీవుల సన్నిది.
•చంద్ర పుష్కరిణి, నాలుగులో గరుడాళ్వార్, నాదముని, కూరత్తాళ్వార్ సన్నిధుల్ని దర్శించుకోవచ్చు. ఐదోదానికే ఉత్తర వీధి అని పేరు. బ్రహ్మోత్సవాల సమయంలో ఈ వీదిలోనే స్వామివారిని ఊరేగిస్తారు. ఆరో ప్రాకారానికి చిత్రవీధి అని పేరు. ఇక్కడి వీధుల్లో ఆళ్వార్లను ఊరేగిస్తుంటారు. ఏదో ప్రాకారంలో వామనుని సన్నిదీ, దశావతారాలూ కనిపిస్తాయి. రంగనాథస్వామి. కొలువై ఉన్న గర్భగుడి పై కప్పు విమానం ఆకృతిలో ఉంటుంది. ఇక, గర్భగుడిలో ఆదిశేషునిపై శయనించిన స్వామిని చూడ్డానికి రెండు ళ చాలవు

స్థలపురాణం! మనువు కుమారుడైన

బ్రహ్మ దేవుడికోసం

తపస్సు చేయగా బ్రహ్మ

తాను ఆరాధిస్తున్న శ్రీరంగనాథుడి ప్రతిమను ఇక్ష్వాకు మహారాజుకి ఇస్తాడు. అలా ఆ వంశంలో శ్రీరామచంద్రుడి వరకూ ఆయన్ని ఆరాధించారు. పట్టాభిషేకానంతరం విభీషణుడు శ్రీరామ వియోగాన్ని భరించలేక లంకకు తిరిగి వెళ్లలేకపోతున్న సందర్భంలో రాముడు తనకు బదులుగా రంగనాథుని విగ్రహాన్ని

అక్కడ 900 ఏళ్లనాటి రామానుజుడు!

విభీషణుడికి ఇస్తాడు. అంతట రంగనాథుడితో బయలుదేరిన విభీషణుడు ఉభయ కావేరుల మధ్యకు చేరేసరికి సంధ్యావందన సమయం కావడంతో, స్వామిని కింద పెట్టి నదికి వెళ్ళి. తిరిగి వచ్చేసరికి రంగనాథుడు అక్కడే ప్రతిష్ఠితం కావడం చూసి విచారించాడట. అప్పుడు ఆ ప్రాంతాన్ని పాలించే ధర్మచోళుడు అతన్ని ఓదారి విగ్రహం ఉన్నచోటే ఆలయాన్ని నిర్మించాడనీ విభీషణుడి కోరిక మేరకు స్వామి దక్షిణ దిక్కుకు తిరిగాడనీ (లంక దక్షిణంగా ఉంది కాబట్టి) పౌరాణిక కథనం.

రంగనాథుడి ఉత్సవాలు!

ఏడాదికి 365 రోజులు ఉంటే, అందులో 322 రోజుల ఉత్సవాలు జరిగేది ఈ ఆలయంలోనేనట. ఆలయంలో పేరుకున్న మలినాల్ని తొలగించేందుకు జూన్-జులై మాసంలో గర్భగుడిని శుభ్రపరిచి ప్రత్యేకంగా తయారుచేసిన మూలికా తైలాన్ని పెరియ పెరుమాళు పూసి మెరుగు పెట్టిన బంగారు తొడుగుని తొడుగుతారు. సమయంలో బంగారు కలశంతో భక్తులు కావేరి నది నుంచి నీళ్లు తీసుకొస్తారు. అలాగే ఇక్ష్వాకు మహారాజు నిత్యపూజల్లోని లోపాలను సరిదిద్దేందుకు పవిత్రోత్సవాన్ని తమిళ మాసమైన ఆణి(ఆగస్టు-సెప్టెంబరు)లో రెండురోజులపాటు చేస్తారు. ఏడాది పొడవునా ఎన్ని ఉత్సవాలు: జరిగినా ధనుశుద్ధ ఏకాదశికి ముందువెనకలుగా జరిగే పగల్పత్తు. రాపత్తు ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయట. ముఖ్యంగా ధనుర్మాసం (తమిళ నెల మార్గళి)లో వచ్చే వైకుంఠ ఏకాదశికి పదిలక్షలకు పైగా భక్తులు హాజరవుతారట. ఇలా చెప్పుకుంటూ వెళితే ఈ దివ్యక్షేత్రానికున్న ప్రత్యేకతలెన్నో, *

సమానత్వాన్ని చాటుతూ విశిష్టాద్వైత గొప్పతనాన్ని ప్రపంచానికి చెప్పిన మహనీయుడు రామానుజాచార్యులు. శ్రీపెరంబుదూరులో పుట్టి, కంచిలో వేదవిద్యని అభ్యసించి, శ్రీరంగం వేదికగా శ్రీవైష్ణవాన్ని ప్రభోధించాడాయన. కొందరికే పరిమితమైన అష్టాక్షరీ మంత్రాన్ని తిరుకొట్టియార్ ఆలయగోపురం పైకి ఎక్కి అందరికి వినిపించారు. దీన్ని బహిరంగంగా వినిపిస్తే నరకానికి వెళతారనే వాదనను తోసిపుచ్చి, 'వెళ్లినా పరవాలేదు. మరికొందరికి ముక్తి వస్తే అదే మేలు' అని భావించిన గొప్ప వ్యక్తి. 1137లో ఆయన మరణానంతరం- తొమ్మిది శతాబ్దాలుగా పార్థివదేహం శ్రీరంగంలో భద్రంగా ఉన్నట్లు చెబుతారు. నాలుగో ప్రాకారంలో రామానుజాచార్యుల ఆలయాన్ని సందర్శించినప్పటికీ విగ్రహం వెనక ఉన్నది ఆయన దివ్యశరీరమేననీ, పద్మాసనంలో కూర్చునే పరమపదించడంతో ఆ భంగిమలోనే దేహాన్ని భద్రపరిచారనీ, ఈ రకమైన మమ్మిఫికేషన్ మరెక్కడా కనిపించదనీ అంటారు. ఏటా ఆయనకి రెండుసార్లు. ఉత్సవాలు నిర్వహించిన సమయంలో మాత్రమే కర్పూరం, కుంకుమపువ్వును ముద్దగా నూరి శరీరానికి పూస్తారట అందువల్ల ఒకరకమైన ఎరుపురంగులో అది మెరుస్తూ ఉంటుంది. హారతి ఇచ్చే సమయంలో ఆయన కళ్లనూ, గోళ్లనూ గుర్తించవచ్చనీ అంటారు.
#శ్రీరంగం_శ్రీరంగనాధస్వామి ఆలయం......

శ్రీరంగం గురించి కొద్దిగా శ్రీరంగంలోని శ్రీరంగనాధస్వామి ఆలయం ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం. ఇది వైష్ణవ దివ్యదేశాలలో అత్యంత ప్రధానమైనదిగా భావిస్తారు. ఆళ్వారులు అందరూ ఈ క్షేత్రం మహిమను గానం చేశారు.

భారతదేశంలో అతి పెద్ద ఆలయసంకీర్ణాలలో ఒకటి ఈ ఆలయం ప్రదేశ వైశాల్యం 6,31,000 చదరపు మీటర్లు (156 ఎకరాలు). ప్రాకారం పొడవు. 4 కిలోమీటర్లు (10,710 అడుగులు).

ప్రపంచంలో అతిపెద్దదైన కంబోడియాలోని అంకార్ వాట్ మందిరం శిధిలావస్థలో ఉన్నది గనుక ప్రపంచంలో పూజాదికాలు జరిగే అతిపెద్ద హిందూ దేవాలయం ,ఆలయ 7 ప్రాకారాలతో, 21 గోపురాలతో విరాజిల్లుతున్నది...

ఈ గోపురాన్ని “రాజగోపురం” అంటారు. దీని ఎత్తు 236 అడుగులు (72 మీటర్లు) – ఆసియాలో అతిపెద్ద గోపురం.
ఆళ్వారుల దివ్య ప్రబంధాలకూ, రామానుజుని శ్రీవైష్ణవ సిద్ధాంతానికీ శ్రీరంగం పట్టుగొమ్మగా నిలిచింది.

నాలాయిర దివ్యప్రబంధంలోని 4,000 పాశురాలలో 247 పాశురాలు “తిరువారంగన్” గురించి ఉన్నాయి. శ్రీవైష్ణవుల పవిత్ర గురు ప్రార్థన (తనియన్)గా భావించే “శ్రీశైలేశ దయాపాత్రం..” అనే శ్లోకాన్ని రంగనాధస్వామి స్వయంగా మణవాళ మహామునికి సమర్పించాడని భావిస్తారు.

ఆలయం లోని విశేషాలు:

1. ఆలయం 157 ఎకరాలలో నిర్మించబడి ఉంది,కంబోడియా లో నిర్మించిన విష్ణు దేవాలయం కన్నా ఈ ఆలయంలో శ్రీరంగనాధ స్వామి మూర్తి(విగ్రహం)చాలా పెద్దది,50 పైచిలుకు పరివార దేవత మూర్తులు కలిగిన ఆలయం,ఆలయం ప్రాగణం ల్లోనే వసతి సముదాయాలు ,వాణిజ్య సముదాయాలు కలిగిన ఆలయం.

2. భారదేశం లోనే 7 ప్రాకారములు కలిగి 6 మైళ్ళ వైశాల్యం తో సుందరమైన 2 రాజగోపురాలతో విరాజిల్లుతోంది శ్రీరంగం లోని శ్రీరంగనాధ స్వామి ఆలయం.

3 . స్వామి వారి రాజగోపురం 236 అడుగుల ఎత్తు కలిగి 13 అంతస్తులతో బహుసుందరంగా నేత్ర శోభితం వెలుగొందుతోంది.1987 మార్చ్ 27న అహోబిల మఠం 44 వ జీయర్ వారి అద్వర్యం లో ఈ గోపురానికి కుంభాభిషేకం నిర్వహించారు.

4.  శ్రీ రంగం ఆలయంలో గరుడాళ్వార్ 25 అడుగుల ఎత్తు కలిగి వుంటారు ,గరుడాళ్వార్ మూర్తికి వస్త్రాలంకారానికి 30 మీటర్లు పొడువుకలిగిన వస్త్రం అవసరం అవుతుంది.

5.  ఆలయం లో గరుడాళ్వార్ కి అన్ని వైష్ణవ దివ్యదేశాలలో కెల్ల అతి సుందరమయమై శిల్ప కళతో ఒక మండపం కలదు.

6.  శ్రీ రంగం మాత్రమే వుండే ఆరోగ్య కారకుడైన ధన్వంతరి ఆలయం కలదు.

7. ఈ ఆలయం లో మాత్రమే శ్రీ రంగనాథ స్వామి భక్తి ప్రపత్తులతో ఆరాధించిన మహ్మదీయ రాణి తుళ్ళకు నాచ్చియార్ చిత్రం కలదు.

8. ఈ ఆలయం లోనే భగవద్ శ్రీ రామానుజాచార్య స్వామి పార్థివ దేహం 8 వ శతాబ్దం లో భద్రపరిచారు.

9. ఈ ఆలయం లో సంవత్సరం లో 365 రోజులు ఐయితే 322 రోజులు ఉత్సవాలే…

10. ఈ ఆలయం లో సుదర్శన ఆళ్వార్ మాత్రమే ప్రత్యేక ఆలయం కలదు.

శ్రీ రంగనాధ స్వామి గర్భాలయం...

ఇచ్చట గర్భాలయములో శయనించియున్న మూర్తికి “పెరియ పెరుమాళ్” అని పేరు. ఉత్సవ మూర్తికి ‘నంబెరుమాళ్‌’ అనిపేరు. ఒకానొక సమయమున తురుష్కుల వలన ఉపద్రవ మేర్పడగా శ్రీరంగనాధుల ఉత్సవ మూర్తిని చంద్రగిరి ప్రాంతమునకు చేర్చారు. ఆ సమయములో మరియొక అర్చామూర్తిని ఉత్సవమూర్తిగా ప్రతిష్టించారు. ఆ విధముగా కలాపకాలమున వేంచేసి ఉత్సవాదులు స్వీకరించిన మూర్తిని ‘తిరువరంగ మాళిగైయార్‌’ అని అంటారు.

గర్భాలయం లోని బంగారు స్థంభాలు :

గర్బాలయములో శ్రీరంగనాథుని ఎదుటగల బంగారు స్తంభములకు “తిరుమణై త్తూణ్” అని పేరు. నంబెరుమాళ్ల సౌందర్య సముద్రములో పడి కొట్టుకొని పోవు వారిని నిలువరించు స్తంభములుగా వీనిని పేర్కొంటారు. 

స్వామి ప్రసాదములారగించు ప్రదేశమునకు “గాయత్రీమంటపము” అనిపేరు. గర్బాలయమునకు ముందుగల ప్రదేశము “చందన మంటపము”. గర్బాలయ ప్రదక్షిణకు “తిరువణ్ణాళి” ప్రదక్షిణమని పేరు.

ఆలయంలోని ప్రాకారములు....

మొదటి ప్రాకారం :

మొదటి ప్రాకారంలో ద్వారపాలకులు, యాగశాల, విరజబావి, సేనమొదలియార్ సన్నిధి, పగల్‌పత్తు మండపం, చిలకల మండపం, కణ్ణన్ సన్నిధి ఉన్నాయి. ఇక్కడ గల చిలుకల మండపము నుండి విమానముపై గల పరవాసు దేవులను దర్శించాలి.

రెండవ-ప్రాకారము :

ఈ గోపుర ద్వారమునకు “ఆర్యభట్టాళ్‌వాశల్” అని పేరు. ఈ ప్రాకారములోనే పవిత్రోత్సవ మండపం ఉంది. ఈ మండపములో హయగ్రీవులకు సరస్వతీదేవికి సన్నిధులు ఉన్నాయి. రెండవది ఉళ్‌కోడై మంటపము. దీనికి దొరమండపమనియు పేరుగలదు. విరజా మండపము. దీని క్రింది విరజానది ప్రవహించుచున్నదని పెద్దలందురు. నాల్గవది వేద విణ్ణప్పం (అభ్యర్ధన) జరుగు మండపం. పరమపద వాశల్, తిరుమడప్పళ్లి, ఊంజల్ మండపం, ధ్వజారోహణ మండపం ఉన్నాయి. ఇచట స్తంభముపై ఉన్న వినీత ఆంజనేయస్వామి వరములను ప్రసాదించగలిగిన శక్తివంతుడు.

మూడవ ప్రాకారం :

ఈ ప్రాకారమునకు “ఆలినాడన్ తిరువీథి” అనిపేరు. ఈ వీథిలో గరుత్మంతిని సన్నిధి ఉంది. దీనికి వెలుపల వాలిసుగ్రీవుల సన్నిధులు ఉన్నాయి. నమ్మాళ్వార్ల సన్నిధి ఈ ప్రాకారములోనే ఉన్నాయి. ప్రాకారమునకు ఎడమ భాగమున ధాన్యం కొలచే మండపము ఉంది. దీని ప్రక్కనే నంజీయర్ సన్నిధి ఉంది. ఉగ్రాణము పైన పట్టాభిరామన్ సన్నిధి, ముదలాళ్వార్ల సన్నిధి, చంద్రపుష్కరిణి, పొన్నవృక్షము, దీని వెనుక వేదవ్యాసర్ సన్నిధి, వరాహ పెరుమాళ్ కోయిల్, వరదరాజస్వామి సన్నిధి, కిళ్ పట్టాభిరామన్ సన్నిధి, వైకుంఠనాదన్ సన్నిధి, తిరుమణల్ వెళి (ఇసుకబయలు) తిరుమళికై ఆళ్వార్ల సన్నిధి, శ్రీ భండారము, సూర్య పుష్కరిణి, తిరుక్కచ్చినంబి సన్నిధి ఉన్నాయి.

నాల్గవ ప్రాకారము :

ఈ ప్రాకారమునకు “అకళంకనాట్టాళ్వాన్” తిరుచ్చి అనిపేరు. ఈ ప్రాకారము లోపల కుడిప్రక్క కూరత్తాళ్వాన్ సన్నిధి ఉంది. శ్రీ పరాశర భట్టర్ సన్నిధిలో వారి శ్రీపాదములందు నంజీయర్ ప్రతిష్ఠితమై ఉన్నాడు. లక్ష్మీనారాయణులు, అమృతకలశహస్తులైన గరుడాళ్వార్‌సన్నిధి కలదు. ఎడమచేతి ప్రక్క బజారు దాటిన పిమ్మట నాదముని సన్నిధి ఉంది. దీనికి బయట కంబనాట్టాళ్వాన్ మండపము ఉంది. ఈ ప్రాకారమలో శ్రీరంగ విలాసం ఉంది. 

దీనిపై తిరుమంత్రము, ద్వయము, చరమశ్లోకములు, (శ్రీకృష్ణ, శ్రీవరాహ, శ్రీరామ)అవతరించిన విధము చిత్రించబడి ఉంది.

విజయ స్థంభం :

విజయ స్తంభము, ఉళ్ ఆండాళ్ సన్నిధి, వాహన మండపం, చక్రత్తాళ్వార్ సన్నిధి, తిరువరంగత్తముదనార్ సన్నిధి, వసంత మండపం, ఈ ప్రాకారములోనే ఉన్నాయి.. శ్రీరంగనాచ్చియార్ సన్నిధియు ఈ ప్రాకారములోనే ఉంది. ఈ సన్నిధి ముఖ మండప స్తంభముపై తిరువెళ్లరై పుండరీకాక్షుడు ప్రయిష్టితమై ఉన్నాడు. మీనమాసం, పంగుని ఉత్తరా నక్షత్రమున శ్రీరంగనాచ్చియార్‌తో శ్రీరంగనాథులు వేంచేసియున్న సమయమున ఉడయరులు శరణాగతి గద్యను విన్నవించిన స్థలము శరణాగతి మండపము ఉంది. 

మేట్టళగియ సింగర్ సన్నిధి, ధన్వంతరి సన్నిధి, ఐన్దుకుడి మూన్ఱు వాశల్ (అయిదు గుంటలు, మూడు ద్వారములు) శ్రీనివాస పెరుమాళ్ సన్నిధి. ఈ ప్రాకారములోనే ఉన్నాయి.
ప్రతి సంవత్సరము రాపత్తు పది దినములు శ్రీ రంగనాధులు కొలువు తీరు వేయి కాళ్ల మండప మీప్రాకారములో కలదు. దీనికి “ఆయిరం కాల్ మండపమని” పేరు.

(సహస్రస్థూణా మండపం) ఈ మండపములో స్వామి వేంచేయుండు స్థలమునకు తిరుమామణి మండపమని పేరు.

శేషరాయన్-మండపము :

ఈ ప్రాకారంలో ఉన్న శేషరాయన్-మండపములో ఒక ప్రక్క దశావతారములు, మరియొక ప్రక్క కోదండరామన్ సన్నిధి ఉన్నాయి. దాని ప్రక్కన లోకాచార్యుని సన్నిధి, సోదరులు అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ సన్నిధి, పార్థసారది సన్నిధి ఉన్నాయి.

పరివారదేవతలు :

ఈ ప్రాకారములో ప్రధానమైన మరియొక సన్నిధి ఉడయవర్ (రామానుజుల) సన్నిధి. ఇచట ఉడయవర్ “తానానా” తిరుమేనిగా వేంచేసియున్నారు (పవిత్రశరీరం తానే అయిన ) ఇది ఒకప్పటి వసంత మండపము. ఇచట ఉడయ వరులు భక్తుల హృదయమున వేంచేసి ఉంటాడని మణవాళ మామునులు అభివర్ణించాడు. ఈ సన్నిధిలో ఆళవందార్ పెరియనంబి సన్నిధులు ఉన్నాయి. వరదరాజస్వామి సన్నిధి ప్రక్కన ఉంది. ప్రతి దినం ఉదయం 9 గంటల సమయంలో స్వామి సన్నిధిలో శాత్తుముఱై సేవ జరిగుతుంది.ఈ ప్రాకారములో వీరాంజనేయ స్వామి , విఠల్ కృష్ణన్ , తొండరడిప్పొడియాళ్వార్ ఉన్నాయి.

ఐదవ ప్రాకారము :

ఈ ప్రాకారమునకు ఉత్తర వీధి యనిపేరు. మకర (తై) మీన (పంగుని) మాసములో జరుగు బ్రహ్మోత్సవములలో శ్రీరంగనాధులు ఈ వీధులలో వేంచేయుదురు. మకరమాస పుష్యమీ నక్షత్రమున నంబెరుమాళ్లు ఉభయనాచ్చియార్లతో తిరిత్తేరుపై వేంచేయుదురు. 

ఈ ప్రాకారములో ఉత్తమనంబి, తిరుమాళిగ, శ్రీరంగనారాయణ జీయర్ మఠం, ఆచార్యపురుషుల తిరుమాళిగలు మణవాళమామునుల సన్నిధి కలవు.

ఆరవ ప్రాకారము :

ఈ ప్రాకారమునకు “చిత్రవీధి” యనిపేరు. మేషమాస (చిత్రి) బ్రహ్మోత్సవంలో నంబెరుమాళ్లు ఈ వీధులలో ఊరేగుటచేత ఈ వీధికి “చిత్రవీధి” యని పేరు వచ్చెను. ఆళ్వార్లు తిరునక్షత్రముల యందు ఈ తిరువీధులలో ఊరేగించబడతారు. 

ఉత్తర మాడ వీధిలో వేధాంత దేశికర్ సన్నిధి, జగన్నాధన్ సన్నిధి, తూర్పు చిత్ర మాడ వీధిలో రధం, పెరియనంబి, కూరత్తాళ్వాన్, మొదలి యాండాన్ తిరుమాళిగలు, వానమామలై జీయర్ మఠం గలవు. దక్షిణ ప్రాకార వీధి మధ్యలో 5 అడుగుల లోతులో పాతాళకృష్ణన్ సన్నిధి ఉంది.

ఏడవ ప్రాకారము :

ఈ ప్రాకారమునకు “అడయవళంజాన్” వీధియనిపేరు. ఈ ప్రాకారములో తిరుక్కురళప్పన్ (వామనుని) సన్నిధి కలదు. వెళియాండాళ్ సన్నిధి కూడా కలదు. పడమటి ద్వారము గుండ తెప్పగుంటకు ఫొవచ్చును.

కుంభమాస(మాసి) బ్రహ్మోత్సవములో రథోత్సవమునకు బదులు తెప్ప ఉత్సవము ఈ తెప్పగుంటలోనే జరుగును. ఉత్తర ద్వారమునుండి కొల్లడమునకు పోవు దారి కలదు. ఈ కొల్లడం దక్షిణ తీరమున తిరుమంగై యాళ్వార్లకు ప్రత్యక్షమైన దశావతారముల సన్నిధి కలదు. 

ఇచట తిరుమంగై ఆళ్వార్ వేంచేసి యున్నారు. ఈ కొల్లడ మందు తిరుమంగై ఆళ్వార్ పడిత్తురై, ఆళవందార్ పడిత్తురై కలవు. పడమటి ద్వార సమీపములో కాట్టళిగియ శింగర్ సన్నిధి కలదు. ఇది శ్రీ వచన భూషణ మవతరించిన స్థలము. దక్షిణ గోపురము ద్వారా కావేరి నదికి పోవచ్చును. దీనికే రాయగోపురమని పేరు.
ఆళ్వార్లు కీర్తించిన నూట యెనిమిది దివ్య దేశములలో శ్రీ రంగము ప్రధానమైనది. శ్రీరామకృష్ణాది విభవావతారములకు క్షీరాబ్ది నాధుడు మూలమని అర్చావతారములకు శ్రీరంగనాథుడే మూలమని ఆళ్వారుల విశ్వసిస్తారు. 

మన పెద్దలు ప్రతి దినం 

“శ్రీమన్ శ్రీరంగ శ్రియ మన పద్రవాం అనుదినం సంవర్దయ”

అని అనుసంధానము చేస్తుంటారు. పదిమంది ఆళ్వార్లు, ఆండాళ్, ఆచార్యులు అందరు సేవించి ఆనందించి తరించిన దివ్యదేశము శ్రీ రంగం.             

No comments:

Post a Comment