Saturday, February 8, 2025

 *పిచ్చి కుక్క కాదు !*

"ఏమిటండీ ఈయన ? ఏదో ఆవేశం కాకపోతే ? మిలిటరీ విమానాలను  ఉపయోగించి మరీ  అక్రమ వలసదారులు పంపించేస్తున్నాడు . మిలటరీ విమానం బాగా కాస్ట్లీ . ఒక్కో ప్రయాణికుడిపై   సివిల్ విమానం లో ఫస్ట్ క్లాస్ టికెట్ కంటే మూడు రెట్లు ఖర్చవుతుంది . ఆ దేశంలో మొత్తం కోటి మంది అక్రమ వలసదారులు ఉన్నట్టు వారే చెబుతున్నారు . ఇలా వంద మందిని...  రెండు వందల మందిని పంపాలంటే అది ఎప్పటికయ్యేను ? అమెరికా బడ్జెట్ అంతా ఖర్చు పెట్టినా మరో పదేళ్లకు కూడా అక్రమ వలసదారులు పంపించలేరు "
" ఇండియన్ స్టూడెంట్స్ పని చెయ్యడం వల్లే రెస్టారెంట్లు , గ్యాస్ స్టేషన్స్...  మాల్స్ నడుస్తున్నాయి . రూల్స్ ను కచ్చితంగా అమలు చేస్తే  అవి మూతబడుతాయి . అప్పుడు  రెస్టారెంట్లు..  గ్యాస్ స్టేషన్స్..  ఓనర్స్ నుంచి  వ్యతిరేకత వస్తుంది . మరో మూడు నెలల్లో ట్రంప్  తగ్గాల్సిందే  .  గెలిచిన ఆవేశంలో  ఏదో చేసేస్తున్నాడు . కాస్త ఓపిక పడితే అన్నీ సర్దుకుంటుంది "

 ... ఇదీ గత రెండు వారాలుగా అనేక మంది విశ్లేషకులు చెబుతున్న మాటలు  .

ఎందుకింత ఆవేశం ? 
అది ఆవేశమా ?
 లేక ఆలోచనా? 

ఓపికగా చదవండి . 
వెన్నులో వణుకు పుడితే...  నన్ను తిట్టుకోవద్దు .
 ఇలా జరగాలని నేను కోరుకోవడం లేదు .
 జరక్కపోతే సంతోషపడేవారిలో నేను మొదటి వాడిని . 

ఈ పోస్ట్ సేవ్ చేసుకోండి . 
ఆరు నెలల తరువాత ఇంకొక సారి చదవండి .

  కృత్రిమ మేధ  యుగంలో డెబ్భై శాతం ఉద్యోగాలను రోబోలు ఎత్తుకెళ్లి  పోతాయి . రోబో లతో  పని చేయించేవారికి...  రోబో లు చేయలేని పని చేసేవారికే ... ఇక ఉద్యోగాలు .. ఈ మాట గత కొన్నేళ్లుగా  తరచూ వినిపిస్తోంది .

ఇదిగో మొదలయ్యిపోయింది . 
ఎక్కడ మొదలు కాకూడదో అక్కడే మొదలయ్యింది .

ట్రంప్ ది ఆవేశం కాదు .
 ఎన్నికలకు ముందే ఏమి చెయ్యాలో..  చాలా ప్లాన్స్ వేసుకొని వచ్చాడు .

 మాగా అంటే మాక్ అమెరికా గ్రేట్ అగైన్ అని . తిరిగీ అమెరికా ను గొప్ప దేశం చెయ్యాలి అనేది ట్రంప్ బృందం అలోచన.

అమెరికా విప్లవం జరిగి 250  ఏళ్ళు అయ్యింది . ఇప్పుడు అమెరికాలో రెండవ  విప్లవం తేవాలని పకడ్బందీ ప్రణాళికతో ట్రూప్ బృందం శరవేగంతో ముందుకు ఉరకలేస్తోంది .

ట్రంప్ ప్రవేశ పెట్టిన వాటిలో ముఖ్యమయినవి...  DOGE   VSIP  .

ముందుగా డాగీ గురించి .... 
అమెరికా ఫెడరల్ వ్యవస్థ .. మీకు బాగా అర్థం కావడానికి ఫెడరల్ అనే మాట స్థానంలో...  సెంట్రల్ అని వాడుతాను.

 అమెరికా లో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగుల సంఖ్య ముప్పై లక్షలు .
 ఇందులో ఫుల్ టైం ఉద్యోగులు 23  లక్షలు .

పది మంది మనుషులు  చేసే పనిని  ఒక్క రోబో చెయ్యగలదు. 
అమెరికా సెంట్రల్ గవర్నమెంట్ వ్యవస్థలో రోబోలు ప్రవేశపెడుతున్నారు . 
అందుకే డాగీ కి ఎలోన్ మస్క్ నాయకత్వం వహిస్తున్నాడు . ప్రభుత్వ వ్యవస్థల  పని తీరు మెరుగుపరచడం  .. ఇలా ఎన్ని మాటలు చెప్పినా దాని సారం .. రోబో లను ప్రవేశ పెట్టడమే . 

అందుకే ట్రంప్ VSIP   అనే పథకం ప్రవేశ పెట్టాడు . 
ఉద్యోగాలు వదిలేసి పొతే ఎనిమిది నెలల జీతం ఇస్తాను అని చెప్పాడు .

సుమారుగా ఒకటి నుంచి రెండు లక్షల మంది అమెరికా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ పథకాన్ని ఉపయోగించుకొని స్వచ్చందం గా పదవీ విరమణ పొందుతారు అని వారి అంచనా .

అమెరికా లో సగం దాక ఎర్ర రాష్ట్రాలు . 
 అంటే కమ్యూనిస్ట్ రాష్ట్రాలు కావు .
 ట్రంప్ పార్టీ .. అదే రిపబ్లికన్  పార్టీ అధికారంలో వుండే అనేక రాష్టాలు డాగీ లాంటి పథకాన్ని తమ రాష్టంలో కూడా అమలు చెయ్యడానికి పథకాలు వేస్తున్నాయి . 
ఒక్లోహోమా, టెక్సాస్ , కరోలినా , న్యూ హాంప్షైర్...  మిస్సోరి...  ఇలా ఒక్కక్కటి ముందుకు వస్తున్నాయి .

అంటే మరో ఆరు నెలల్లో అమెరికాలో ..  సెంట్రల్..  స్టేట్...  గవర్నమెంట్ ఉద్యోగులు పెద్ద ఎత్తున వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొంటారు  .
 వీరి సంఖ్య అయిదు లక్షల దాక ఉండొచ్చు .
 అమెరికా లో  ఇప్పటికే ఉన్న   నిరుద్యోగ యువత  సంఖ్య 23  లక్షలు .

అంటే సుమారుగా ముప్పై లక్షల మంది ప్రైవేట్ ఉద్యోగాల కోసం చూస్తారు . { వాలంటరీ రిటైర్మెంట్ తీసికొన్నవారిలో కొంత మంది కొత్త ఉద్యోగం కోసం చూడక పోవచ్చు . నిజమే } .

ముప్పై లక్షల మంది.. అందరూ ..  అమెరికా పౌరులు .
 వారికి  ఉద్యోగ అవకాశాలు కల్పించాలి .
 ఎలా ?

స్టూడెంట్ వీసా పై వెళ్లి పార్ట్  టైం ఉద్యోగాలు చేసుకొంటున్నవారు లక్షల్లో వున్నారు . అలాగే వీసా నిబంధనలు అతిక్రమించి ఉన్నవారు పెద్ద సంఖ్యలో .

 చట్టాన్ని అమలు చేస్తే ఈ ఉద్యోగాలు...  పౌరులకు  దక్కుతాయి .

ఇది కేవలం ప్రారంభం మాత్రమే .. ఏదో అద్భుతం జరిగి డాగీ    ప్రక్రియ ఆగిపోతే తప్పించి .. 
 1 . లక్షల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు ఊడుతాయి...  లేదా  ఖాళీ అవుతాయి . వీరు అమెరికాలో దొరికే ప్రైవేట్ ఫుల్ టైం లేదా పార్ట్ టైం జాబ్స్ కోసం చూస్తారు .

2 . ఉద్యోగుల సంఖ్య తగ్గించుకోవడం వల్ల ప్రభుత్వానికి కోట్లల్లో ఆదా అవుతుంది . ప్రభుత్వ వ్యవస్థల పని తీరు మెరుగుపడుతుంది .
౩. అమెరికన్స్ కే జాబ్ లేనప్పుడు .. అక్కడికి వెళ్ళినవారు { గ్రీన్ కార్డు వారు తప్పించి .. అలాగే కీలక మయిన ఉద్యోగాల్లో ఉన్నవారు తప్పించి } ఏమి ఉద్యోగాలు చేస్తారు ? 
ఇప్పుడు ట్రంప్ యుద్ధ విమానాల్లో దించుతున్నాడు అంటే" అరేయ్...  బాబు వెళ్లిపోండి"  అని చెప్పడం . ఉద్యోగాలు పొతే ..  అమెరికా లో ఎన్ని రోజులు ఉంటారు ? చట్టాలను కచ్చితంగా అమలు చేస్తే ఎంతమంది అక్కడ వుండే అర్హతను కోల్పోతారు ? వీరు ఎంత కాలం అమెరికా లో ఉండగలుగుతారు ? 

యుద్ధ విమానాలు ..    కాళ్లకు  చేతులకు సంకెళ్లు .. ఇవన్నీ సంకేతాలు . చట్టం అమలు చేస్తాము అని అందరికీ చెప్పడం .     అక్కడ  వుండే అర్హత కోల్పోయినవారు   సొంత డబ్బులతో తిరిగీ తమ దేశాలకు  వెళ్లిపోవాల్సిందే .
 అంటే పొమ్మనకుండా పొగ పెట్టడం . 

ఇది ఒకే రోజులో జరగదు .. 
ప్రక్రియ...  ప్రారంభం అయ్యింది 
నిన్నటి పోస్ట్ లో...  జరిగింది గోరంత .. జరగబొయ్యేది కొండంత...  అని రాసాను . 
ఇదే అసలు విషయం .

4 . రోబో లు ప్రవేశ పెడితే కొత్త ఉద్యోగాలు రావా ? 
వస్తాయి . వంద ఉద్యోగాలు ఊడితే...  ఇరవై ముప్పై కొత్తగా వస్తాయి . కృత్రిమ మేధ..  రోబోటిక్స్ లాంటి కొత్త రంగాల్లో వస్తాయి .

 మొత్తం వీసా విధానాన్ని మార్చేసి కేవలం అత్యుత్తమ ప్రతిభ కలిగిన వారిని మాత్రమే అమెరికా కు రప్పించేలా / అమెరికా లో ఉండేలా చేయబోతున్నారు     .
 ఇలాంటి వారికి విమానం ఎక్కే ముందే గ్రీన్ కార్డు ఇస్తారు కాబోలు .ఇప్పటికే అక్కడ వున్నవారికి గ్రీన్ కార్డులు ఇచ్చేస్తారు .
 క్యారెట్  అండ్ స్టిక్ పాలసీ అన్న మాట . 

ప్రతిభ లేకున్నా .. ఉన్నత విద్య పేరుతొ అమెరికా కి వెళ్లిపోవడం ..  పార్ట్ టైం ఉద్యోగం  ...  ఫుల్ టైం ఉద్యోగం .. అటు పై అక్కడే సెటిల్ అయ్యిపోవడం...  ఇక గతం .

గడియారం వెనక్కు తిరుగుతోంది .. 

1960 , 1970  లలో ఉన్నట్టే కేవలం అత్త్యుత్తమ ప్రతిభ కలిగినవారికే ఇక అమెరికా ఛాన్స్ .

డెమోక్రాటిక్ పార్టీ ఎన్ని నిరసనలు చేసినా ప్రయోజనం ఉంటుందా ?
 మహా అంటే..  వేగాన్ని తగ్గించవచ్చు .

అర్థం అయ్యిందా . 
పిచ్చి కుక్క కాదు . 
భవిషత్తు ! 

ఆగండి.
 అక్కడితో అయిపోలేదు . 
డాగీ లాంటిది ఆటు పై ఇండియా లో రాదా ?

 మిగిలిన డబ్బు తో బంగారం కొనుక్కోండి . ఖర్చు తగ్గించుకొని ఆదా చేసుకోండి . పిల్లలని కృత్రిమ మేధ రోబోటిక్స్ లాంటి కోర్సులలో  చేర్పించండి .

అన్నింటికీ మించి  రోబో చెయ్యలేని పని వారు చేసేలా చెయ్యండి  ..  సృజన .. క్రిటికల్ థింకింగ్...  కాంప్లెక్స్ ప్రాబ్లెమ్ సొల్వింగ్ స్కిల్స్  వారిలో తీసుకొని రండి అంటూ...
...  సొంత ఖర్చు  తో ఊరారా బాలమిత్ర క్లాసులు పెట్టి ఎందుకు చెబుతునాన్నో అర్థం అయ్యిందా ?

వాసిరెడ్డి అమర్నాథ్..  మీకు అర్థం అయ్యింది గోరంత .  

నాకు  తెలుసు .. ఈ పోస్ట్ చూసి నా పై చాలామంది మండిపడుతారని .
 గత అయిదేళ్లుగా నాకిది మామూలే .
 అందుకే పోస్ట్ సేవ్ చేసుకొని ఆరు నెలలకు చూడండి అని  చెబుతున్నా!
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి

No comments:

Post a Comment