🕉️ ఓం నమః శివాయ 🕉️
🙏 శివాయ గురవే నమః 🙏
మిత్రులారా పిల్లవాడికి అన్నం ఎప్పుడు పెట్టాలో
తల్లికి తెలుసు, ఆలస్యంగా పెట్టడానికి కారణం కూడా
తనకే తెలుస్తుంది.భగవంతుడు అనుగ్రహం
విషయం కూడా అంతే.
ఆ భగవంతుడు నియమాలను అర్ధం చేసుకొని అనుసరిస్తే ఎందులోని ఓటమి ఉండదు కాక ఉండదు.
కాకపోతే కొంచెం టెక్షన్ ఉటుంది
ఎంతా నమ్మకం ఉన్న మనుషులం కదా
మన ఆలోచన విధానంతో
ఆ టెక్షన్ కొని తెచ్చుకున్నట్టు తెచ్చుకుంటాం
ప్రకృతికి చూడండి చక్కగా ప్రశాంతంగా
ఆ తండ్రి పరమాత్మ ప్రణాళిక ప్రకారం చక్కగా నడుస్తుంది.
ఎలా అంటే విత్తనం వేస్తే మొలక వస్తుంది
తరువాత మొక్క ఆ తరువాత చెట్టు నుండి పువ్వులు కాయలు,పండ్లు ఆలా అన్నీ చక్కగా
ఒక విధివిధానంలో సమయానుకూలంగా జరుగుతుంటాయి.
అంటే ఫస్ట్ మొదట విత్తనం భూమిలో నాటగానే
ఆ పని మొదలవుతుంది. ఆలా ఆలా అవి భగవంతుడు ప్రణాళిక ప్రకారం కాలనుకూలంగా అన్ని ఆటుపోట్లను తట్టుకొని పరివర్తన చెందుతూ
పండ్లు గా మారుతాయి అప్పుడు చక్కగా
పండ్లు ఎంతో రుచిగా ఉంటాయి తినటానికి.
అంటే విత్తనం వేయగానే ఒక్కసారిగా పండు రావాలి అంటే వచ్చేది మాత్రం కాదు. సమయాన్ని తీసుకొని అన్నిటినీ ఓర్చుకుంటు మొత్తం తనలో దాచుకోవడం వలన
పరిపూర్ణమైన పండుగా మారింది.
అదంతా సృష్టిలోనే ఏర్పడి ఉన్న
ఆ పరమాత్మ నియయం.
దాన్ని మార్చి మన స్వీయంగా ఒక నియమాన్ని అనుసరిస్తే అందులో భాధపడవలసి వస్తుంది.
అదే చక్కగా ఆ తండ్రి పరమాత్మ నియమాన్ని అర్ధం చేసుకొని అనుసరిస్తే అందులో ఇక అపజయం ఉండదు
అపజయంతో వచ్చే బాధ దుఖం ఉండదు ఎచ్చాక.
ప్రకృతిలా మనం ఉండాలి భగవంతుడిపై నమ్మకంతో
విత్తనం అనగా మన ఆలోచన లేదా
మనం చేపట్టిన పని అది మనకు భగవంతుడు ఇచ్చిన
అవకాశం అనుకోని మనం చేసే ప్రయత్నం చేస్తూ
అన్ని ఆటుపోట్లను తట్టుకొని ముందుకు వెళ్తే
కచ్చితంగా గెలుపు సాధిస్తాం.
అసలు గెలుపు,ఓటమి మన సంకల్పానికి
సంబంధించినవి మాత్రమే.ఆ తండ్రి నియమంలో
ఈ రెండూ సమానమే అంటే అసలు ఉండవు.
నియమాన్ని ఆచరిచడమే ఉంటుంది.🙏
🙏శివయ్య అందరిని చల్లగా చూడు తండ్రి పరమేశ్వర 🙏
No comments:
Post a Comment