Wednesday, February 12, 2025

 అవును*గంట ఏ క్షణమైనా మోగవచ్చు* శ్రద్ధ పెట్టి ఈ మెసేజ్ ను ఒక్కసారి చదవండి. 

నాకు 30 సంవత్సరాలే ఇంకా బోలెడు జీవితం ముందుంది అనుకుంటూ కొందరు. పిల్లలూ! మీకు కొత్తగా పెళ్లయింది ఇప్పుడు క్షేత్రాలు, తీర్ధాలేమిటర్రా మీ ముఖం దానికి  ముందు ముందు చాలా జీవితము ఉంది అప్పుడు ఆలోచించవచ్చులే అంటూ ఇంకొందరు, ఎప్పటికైనా మరణం తప్పదు గాని నేనైతే ఇప్పుడే చావను అని అనుకుంటూ మరి కొందరు అనుకుంటారు అంటుంటారు 

కానీ...ఎంత అజ్ఞానం, ఎంత వెర్రి తనం, క్షణం తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు, బయటికెళ్ళినవారం తిరిగి బతికే వస్తామో, శవమై వస్తామో, అసలు వస్తామౌ రామో తెలియదు, 
 
ఒకసారి ధర్మరాజు వద్దకు దానం కోసం వచ్చిన ఓ పేద బ్రాహ్మణుడిని మరుసటి రోజు రమ్మంటాడు, అది విన్న భీముడు పెద్దగా నవ్వాడు , కారణమడిగిన అన్నతో, అన్నయ్యా రేపటి వరకు నేను బతికి ఉంటాను అన్న నీ నమ్మకానికి నాకు నవ్వు వచ్చిందన్నాడు... మనందరికీ అదేగా ధైర్యం ? బాల్యమందో, ముదిమియందో, లేక ముసలియందో, ఊరినో, ఉదకమధ్యమందో, లేక అడవిలోనో  అన్నాడు ధూర్జటి. మానవజన్మ పరమార్ధం  సంపాదన, సౌఖ్యం , భొగలాలసత్వం కాదు. ఆర్జించవలసిందే, కాని డబ్బు కాదు ఆత్మ జ్ఞానాన్ని, అనుభవించవలసిందే నేను గత జన్మలో చేసిన పాపాలకు ఫలితమే ప్రస్తుత ఈతిబాధలు అన్న ఎరుకతో ప్రస్తుత బాధల్ని, సౌఖ్యం ఉండవలసిందే, అది ఆత్మ జ్ఞాన అవగాహన ద్వారా అనుభవం అయ్యే అపార సౌఖ్యమేగానీ మనం ఏర్పాటు చేసుకునే ఇళ్ళు,కార్లు, నగలు భూములు కాదని గ్రహించాలి. కోటీశ్వరులు నా భక్తులై ఉన్నా నా ఆస్తి అంతా నా రేకు డబ్బా, జోలె, నా చినిగిపోయిన అంగీ మాత్రమే అన్నారు షిరిడి సాయి, కానీ ఆయనను రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ అంటూ స్తుతించడం లేదా ? కౌపీనవంతః ఖలు భాగ్యవంతః అన్నారు శంకరులు, ఆయనను జగద్గురువుగా భావించడం లేదా ? మరణ పర్యంతం కేవలం గోచిగుడ్డతోనే ఉన్నారు భగవాన్ రమణులు, వారిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతారంగా కొలవడం లేదా ? వీరందరినీ పేదవారు అని అనగలమా ?  వారికి నమస్కారాలు చేస్తాం, పూజలు చేస్తాం కానీ వారు ఆ జీవన విధానం ద్వారా మానవజాతికి ఏం సందేశం ఇచ్చారో అర్థం చేసుకోం .

గంట ఏ క్షణమైనా మోగవచ్చు. కనుక మన జీవిత పరమార్ధం భోగభాగ్యాలు సంపదలు ఆర్జించడం కాదని, మరణం తలుపుతట్టే లోపు మనిషి జన్మ మనకు ఇవ్వబడ్డ మరో  అవకాశమని గ్రహించి, ఈ జనన మరణ చక్రము నుండి విముక్తి పొందే ప్రయత్నాన్ని ఇప్పుడే ఈ క్షణమే మొదలుపెట్టి తీవ్రంగా సాధన చేయవలసి ఉన్నదని స్పష్టంగా ఎరిగి,  ఆ దిశగా అడుగులు  వేయడమే మన జీవిత ప్రధాన బాధ్యత ఇందుకు ధ్యాన జ్ఞాన మార్గమే అత్యుత్తమ మార్గమని పితామహ పత్రీజీ ఈ లోకానికి తెలియజేశారు కదా . ఈ సందర్భంగా ఆయనకు మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ సాధనా మార్గంలో ముందుకు కదులుదాం. 

సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం👏

No comments:

Post a Comment