*_పూటగడవని రోజే తెలుస్తుంది ఆకలంటే ఆ రోజు... బ్రతుకు విలువ తెలిసేది ఆరోజే..._*
*_పొట్ట కూటి కోసం, పొట్ట గడవడానికి పడరాని పాట్లేన్నో పడుతున్నావు. ఆ పొట్ట నింపుకోవడానికి ఎన్ని వేషాలు... ఎన్ని వెధవ వేషాలు._*
*_అందరిలా బతకాలనుకోకు... నీవు నీలాగా బతకడం నేర్చుకో..._*
*_తాడో పేడో తేల్చు కోవాలంటే... నీతో నువ్వే పోరాడు... గుండె పగిలి నెత్తురొస్తె... నొప్పి అంటూ మొత్తుకోకు..._*
*_చిప్పకూడు చేతికొస్తె, బ్రతుకు భారంగా తోస్తే... నెత్తీనోరూ బాదుకోకు చావుకోరల్లోన చిక్కి కొత్త జన్మ ఎత్తి ఆకాశాన్ని ఏలినట్టు కలల్ని కళ్ళజూడు..._*
*_గాయపడితే మనసు సాయాన్ని కోరమాకు ఆ బాధను నీలోనే దాచుకొని బతుకు..._*
*_నీకు, నీవే దొరికే వరకూ కాలమడిగే ప్రశ్నకే బదులు చెప్పమాకు కేవలం మౌనంగా మిగిలిపో..._*
*_బ్రతుకు నువ్వై సాగిపో... రాని దేదో కాని దేదో తెలుసుకుంటూ... ఏది కాదూ శాశ్వతం మరిచిపోకూ ఈ నిజాన్నీ..._*
*_ఆస్తిపాస్తులు ఎన్ని ఉన్నా చిల్లిగవ్వా తోడురాదు... నలుగురి లోనూ కలిసిపోతూ నువ్వు నీలా మారు..._*
*_జ్ఞాపకాలనే పోగు చేసే ఆటే కదా జీవితమంటే... కన్నులతడే. ఆ పరమాత్మ నేర్పేనుమరి నువు నడవని ... దారే ఏదో... నీ మౌనమే... నీ తోడు అని..._*
*_పూలు పరిచిన దారే కావాలి అనుకోమాకు... ముళ్ళున్న దారి కూడా... నీదనుకో... అప్పుడే కదా నీవనుకున్నది సాధించగలవు.☝️_*
*_-సదా మీ శ్రేయోభిలాషి...👏_*
🪷🪷🪷 🌹🙇🌹 🪷🪷🪷
No comments:
Post a Comment