*కాఫీవిత్..చలం 2103.
*చలం గారు హృదయవాదా? స్వ సుఖ
వాదా(హెడొనిస్ట్)..?
*బుద్ధిజీవులది ఆలోచన…హృదయజీవులది అనుభూతి"..!!
*చలం…సనాతనుల్లో ఆధునికుడు…
ఆధునికుల్లో సనాతనుడు(ఈశ్వర భక్తుడు)
*గుడిపాటి వెంకట చలం ఉరఫ్ చెలం గారు సనాత
నుల్లో ఆధునికుడు… ఆధునికుల్లో ‘సనాతనుడు’..
(ఈశ్వర భక్తుడు) బుద్ధిజీవులది ఆలోచన.హృదయ
జీవులది అనుభూతి..మరైతే..చలంహృదయవాదా?
“నాలో చూసుకుంటే నా జీవితానికి,నా రాత లకీ
ఎంతో కలయిక కనబడుతుంది.” అంటారు చలం.
అంటే చలంగారి జీవితం..చలం గారి రాత రెండూ ఒకటే…ఈ రెంటినీ వేరు చేసి చూడలేం. వేరు చేయ
నూ లేం.
చలంగారి గురించి ఇప్పటికే చాలామంది రాశారు.
నేనూ రాయాల్సిందంతా రాశాను..ఇంకాచలంగారి గురించి ఏం మిగిలుందని రాస్తారు అని మీరునన్ను
అడగొచ్చు.?
ఏమిటోనండీ…చలంగారి పేరు వింటే చాలు ఏమైనా
రాయొచ్చనిపిస్తుంది. ఎంతరాసినా,ఇంకేదోఅసంతృ
ప్తి.చలంగారిని ఎప్పుడుచదివినా,ఓ కొత్త అనుభవం
ఎదురవుతుంటుంది.ఆయన ప్లస్ లు కానివ్వండి, మైనెస్లు కానివ్వండి ,ఓ కొత్త అనుభవానికి తలుపు
లు తెరుస్తుంటాయి.అందుకే చలం గారిని చదవడం ఓ “అనుభవం” అని నేనంటాను. ఓ తొంభైయేళ్ళ క్రితం అదే సాహిత్యం.ఇప్పుడూ అదే సాహిత్యం
మరి మారిందేమిటీ ?
కాలం మారింది .
కాలంతో పాటు అవగాహన మారింది.
చలం గారు మాత్రం మారలేదు.
ఆయన సాహిత్యమూ మారలేదు.
కానీ మళ్ళీ చదువుతున్నప్పుడు 'అనుభవం' మాత్రం మారుతోంది.
చదివిన కొద్దీ ఇంకాచదవాలనిపించే చలంగారి సాహిత్యం తవ్వినకొద్దీ ఊరే జీవజలం లాంటిది.
అనుభవించినవాళ్ళకు అనుభవించినంత..అందుకే చలంగారిని చదవడం ఓ ‘అనుభవం’,అంటాను నేను..!!
చలం గారిని ఏమైనా అంటే ఆయన వీర భక్తులు
ఊరుకోరు (వీర భక్తురాళ్ళైతే మరీనూ)
అయినా చలం గారిని ఏమంటాం?
ఎందుకంటాం..?
ఆయనేం తాగుబోతా?
కాదే…
తిరుగు బోతా?
నో కామెంట్..
వగరుబోతా..?
అబ్బే కాదండీ.
మరింకేంటి?
వీటికి మించి.…
అంటే…?
అంటే ఏముంది?
రచయితలకు చలం ఒక లడ్డూ
ఆయన గురించి ఏమైనా రాయొచ్చు
ఎంతైనా రాయొచ్చు...
కొందరు పాజిటివ్ గా.
ఇంకొందరు నెగిటివ్ గా
మరికొందరు ఆ బ్జెక్టివ్ గా
అంటే..?
అంటే ఏముంది?
రాసుకున్నోళ్ళకు రాసుకున్నంత.
చలం ఓ భోగి
చలం ఓ రోగి
చలం యోగి
చలం కామ రూపి
చలం స్త్రీ లోలుడు
చలం హెడొనిస్టు….
ఆపండాపండీ…
ఇవన్నీ ప్రత్యక్షంగానో,పరోక్షంగానో ఆయన
నోటి నుండో,రాతలనుండో రాలిపడినవేగా
కొత్తగా ఏమైనా చెప్పండి..
చలం ఓ ఆధ్యాత్మిక శిఖరం
చలం ఓ పలాయన వాది
చలం ఓ విధ్వంసవాది…
కొత్తగా చెప్పమంటే " డోసు " మరీ..
ఇంతగా పెంచి చెబుతున్నారేమిటి?
పెంచిందేముంది?
ఉన్నదేగా !
*తొలుత స్త్రీ స్వేఛ్ఛ పేరుతో విశృంఖల ప్రణయా
న్నీ,వివాహ వ్యవస్థావహేళననూ ప్రతిపాదించిన
కథా రచయిత చలం ఓ విధ్వంసవాది(DADAIST)
గా కనబడతారు...
*ప్రాయంకై వ్రాలుతున్న తరుణంలో అరుణాచలం
ఆశ్రయించి ,రమణమహర్షి ఆధ్యాత్మిక బోధనల్లో పరవశించి,జననం సఫలం చేసుకున్నానని భావిం
చిన చలం పలాయన వాదిగా కనిపిస్తారు.
*చలం జీవిత పరిణామ క్రమంలో “స్వార్థహృదయ
వాది" గా మారాడని స్త్రీ కిచ్చిన ఉపదేశం కూడా సుఖవాదమేనని ,స్త్రీని శృంగార జీవితానికి పరి
మితం చేశాడని,ఈ క్రమంలో చలం సాహిత్యంలో వచ్చిన మార్పుకు కారణం"హెడొనిజం"(సుఖవాదం)
( రా.రా. 1968,సృజన సమీక్ష)
సరేనండి…!
'సంజీవదేవ్ ' అన్నట్లు …
"బుద్ధిజీవులది ఆలోచన…
హృదయజీవులది అనుభూతి"..!!
మరైతే…చలం హృదయవాదా?
స్వ సుఖవాదా(హెడొనిస్ట్)..?
"ఎందరో వేషంలో అధునాతనంగా వుంటారు..
జీవితపు చాలా రంగాల్లో సనాతనంగా వుంటారు
ఆ నవీన వేషం వెనుక బూజుపట్టిన భావాలు,...
తుప్పుపట్టిన విశ్వాసాలు,చెదలు పట్టిన ఆచరణ
లు..ఎన్నో వేలాడుతుంటవి.!!
*చలంగారిని ఎలా చూడాలి?
రమణాశ్రమానికి ముందు…
రమణాశ్రమం తర్వాతగాచూడొచ్చా.?
ఇంతకూ చలాన్ని ఏ కోవలో చేర్చాలి?
చలం…సనాతనుల్లో ఆధునికుడు…
ఆధునికుల్లో సనాతనుడు(ఈశ్వర భక్తుడు)
"I am Self when in
I am mind when out" అంటారు చలం…
"పక్కింటి దూడ ముద్దు చెయ్యమనడం,పేరు తెలీని
పూలపరిమళం నన్ను ముద్దుచెయ్యమనడం,నిన్ను
ముద్దు చెయ్యనా అనడం,ఖాళీలేదు..Excuse me
అన్నా వినకపోవడం…
ఇట్లా వరసగా...
దూడగా పువ్వుగా
పరిగెత్తే ఉడతగా
పిలిచేటి పిట్టగా
వూగేటి పువ్వుగా…
ఎన్నిసార్లు పలకరిస్తారో ఈశ్వరుడు" అంటారు
చలం..ఇంతలో రంగనాయకమ్మగారు.(శ్రీమతి)
"వడియాలకి బూజుపట్టింది ఆ బూజుని ఈశ్వరు
డే అనుకోవడం చాతకావడంలేదంటారు..!
"అయితే….
నా వడియాల్ని పాడు చేసిందనే కోపంపోతే కద !
నా…వడియాల్లో ఆ…" నా " పోయిన నాడు
బూజున ప్రేమిస్తాను ఈశ్వరుడే నని. అప్పుడు
వడియాలు పొట్టలోకి కాక, హృదయంలోకి…
లోపల అవుతాయి..బూజుతో సహా..!!
ఎప్పటికో…
ఎప్పటికో
చూపు పూర్తిగా IN కావడం..
ఈ ప్రపంచమే ఒక INN కావడం..
Creatlve aspect కంటే Critical aspect లోనే
ఎక్కువ రసపిపాసత్వం,ఆనందోపాసిత్వం వుంది.
Creative Artistt రసానికి ఓ Material ని కల్పిం
చి రూపమిస్తున్నాడు.ఆ రూపంలోనుంచిMaterial
ని Vehicle విడదీసి రసాన్ని అనుభవిస్తున్నాడు.
తాను అనుభవించిన రసాన్ని చుట్టూ వున్న నలు
గురికి ఉద్ధరిణితో ఆ పుణ్యతీర్థాన్ని పంచుతున్నా
డు..కళ్ళనద్దుకొని ఆస్వాదించమని...
గౌరవం లేని ప్రేమ లేదురా! అని వాపోయాను.ఏళ్ళ
కొద్దీ నేను తెలుగువారి ముందు. అట్లానే గాంభీర్యం
సౌందర్యం ఎక్కడ వుంది.రెండూ వున్నాయి మీలో.
Analysis అంటే రసాన్ని విడదీసి అనుభవించడం.
Legendry హంసవలె,ఏదో వెర్రిగా మీకు బోధిస్తు
న్నాను.ముఫ్ఫైయేళ్ళ టీచరు అంతకన్నా ఏంచేస్తా
డు?" (చలంగారు సంజీవదేవ్ కు రాసిన లేఖ…
18.4.1957 )
*చలంగారి జీవితం...చలంగారి రాత
రెండూ ఒకటే !!
ఇందుకే చలంగారు నాకు బాగా నచ్చేది. 'చలం
గారి జీవితం..సాహిత్యం' రెండూ వేర్వేరుకాదు.
ఆయన “ జీవితం"..ఆయన “రాత" రెండూ ఒకటి
గానే కనబడతాయి.అది మంచికావచ్చు.చెడు కావ
చ్చు.ఆయన అకున్నది రాస్తాడు.దానివల్ల లోకం..
దృష్టిలో ఇమేజ్ పడిపోతుందేమోనన్న భయం …
కూడా వుండదు.ఏది రాసినా నిజం రాయాలి.
నిజంగా, నిజాయితీగా రాయాలనే తత్వం.దీని
వల్లనే ఏమో చాలామంది దృష్టిలో చలం గారంటే
ఓ సెక్స్ రచయితగాచిన్నచూపు ఏర్పడింది…
(చలంగారి భక్తులుమాత్రం ఆయన్ను ఆకాశానికి ఎత్తేస్తారు.అది వేరే సంగతి)
చలం గారు 'కథ' చెప్పినా,'ప్రేమ లేఖలు' రాసినా
'నవల'ను చిత్రీకరించినా,'మ్యూజింగ్స్' అల్లినా,..
'కవిత్వం' చెప్పినా తన నిజ జీవితంలో తారస
పడిన సందర్భాలు,సంఘటనలు,అనుభవాలు, కనిపిస్తాయి.ఇక మనుషులైతే పాత్రలవుతారు..
బంధువులు,మిత్రులు,ఇష్టసఖులు,ఒకరేమిటి ?
తనకు తారస పడిన వారినెవరినీ వదలకుండాతన సాహిత్యంలో వాడుకున్నాడు.
ముఖ్యంగా.. సఖుల సాంగత్యాన్ని,సాన్నిహిత్యా
న్నిసరసాన్ని, విరహాన్ని, వియోగాన్ని, భోగాన్ని..,
యోగాన్ని, సంయోగాన్ని, రాగాన్ని,అనురాగాన్ని ,
ఏదీ, ఎక్కడా మిస్ కాకుండా జాగ్రత్త పడ్డాడు.ఇదే విషయాన్ని ఆయన మాటల్లోనే విందాం.!!
"కవిత్వానికీ,జీవితానికీ మధ్య ఏమిటి సంబంధ
మని ఎన్నేళ్ళమట్టో తర్కం. ఉన్నదని కొన్నాళ్ళూ,
లేదని కొన్నాళ్ళూ! నాలో చూసుకుంటే నా జీవితా
నికి,నా రాతలకీ ఎంతో కలయిక కనబడుతుంది
నాకు.నాతో నా రాత మారుతోంది.నా కలలు,ప్రేమ
లు,నా ఆశలు,నా నిరాశలు,అన్నిటినీ పాడుతుంది.
నా కలం ఒకప్పుడు శ్రావ్యంగా,ఒకప్పుడు కఠోరంగా కానీ. నా మిత్రులలో కవిత్వం రాసే వారిజీవితాలకీ
ఆ కవిత్వం ఆశయాలకీ సంబంధం కనబడదు నాకు,
వారికి కనబడుతుందనుకుంటాను” అంటారు చలం (మ్యూజింగ్స్..పే39 ).
అవును.చలంగాలన్నట్టే,ఆయన జీవితం..ఆయన
రాత రెండూ ఒకటే ! చలంగారి జీవితానికి, రాతల
కీ ఎంతో కలయిక కనబడుతుంది.కానీ, ఆయన… మిత్రులలో కవిత్వం రాసే వారిజీవితాలకీ ఆ కవి
త్వం ఆశయాలకీ సంబంధం కనబడదట..చలం
గారిని చదివేవారు ఈ విషయాన్ని తప్పకుండా
దృష్టిలో పెట్టుకుంటే…ఆయన సాహిత్యం సరిగ్గా
అర్ధమవుతుంది.!సాహిత్య ప్రక్రియ ఏదైనా కావ
చ్చుఅందులో చలం ‘మార్కుతప్పనిసరి.ముఖ్యంగా తన "ముద్ర" ను ప్రణయ వాంఛ,లైంగిక స్వేచ్ఛను సరసిజాన్ని కలగలిపి'ఇంజక్ట్ “చేశాడు.
ఆరుద్ర చెప్పినట్లు”తెలుగు సాహిత్యాన్ని కొత్త మలు
పు తిప్పిన చలం గారు"ఒకే రాగంలోపాడేపాటగాడి
గా కనిపిస్తాడు,”(సమగ్రాంధ్ర సాహిత్యం..4వ సంపు
టి,పే.562).!!
చలం గారు ఎవరికోసం రాశాడు?
సమాజం కోసమా?
కాదు...కానే కాదు.!
మరి ఎవరికోసం రాశాడు.?
తన కోసం రాసుకున్నాడు.
తన తృప్తి కోసమే రాసుకున్నాడు.
ఆ మాటకొస్తే ఏ కవైనా, రచయితైనా ముందు తన కోసమే రాసుకుంటాడు.ఆ తర్వాత అది సమాజ పరమవుతుంది.ఫలానా కవి,రచయిత సమాజాన్ని ఉద్ధరించడానికి రాశాడన్నది శుద్ధ అబద్ధం. చలం.. గారు ఇందుకు మినహాయింపు కాదు.చలం గారు
ఎందుకు రాశారో ? ఎవరికోసం రాశారో ? ఆయన మాటల్లోనే వినండి.!
"నేను ఏది రాస్తున్నానో వాటి న్యాయం,సత్యం
నాకు ఆనాడే స్పష్టం.ఈశ్వరానుగ్రహం వల్ల గోచర
మైన కాంతిలో నా జీవితాన్ని ఉడికించిన భావాల సత్యం,న్యాయం,అవసరం గోచరమైనాయి.నా రచ
నలు,నా జీవిత సమరాన్నే ప్రతిబింబించాయి.
నా యత్నం సంఘాన్ని సంస్కరించడానికి కాదు.
నన్ను నేను సంస్కరించుకోడానికి “ (చలం ఇంట
ర్వ్యూలు..పే21 )
దీన్నిబట్టి ఏది రాసినా చలం గారు స్పృహతోనే రాశాడనిపిస్తోంది.ఆయన ఏది రాసినా అందులో
న్యాయం, సత్యం తెలిసే రాశాడు.తన జీవన సమరంలో ఎదురైన అనుభవాలన్నటిని తన
రచనల్లోపొందుపరిచాడు.అందుకే చలం గారి సాహిత్యం చదువుతుంటే..,.ఆయన "ఆత్మకథ"
చదువుతున్నట్లే వుంటుంది.
చలం గారి రచనలకు మూలస్థానం ఆయన హృద
యమే.సంఘం కన్నా వ్యక్తి ముఖ్యమనే తత్వం.. ఆయనది.కనుక చలం గారినిసంఘజీవిగానో,సంఘ సంస్కర్తగానో భావించకూడదు.ఈమాటంటే
కొందరికి నచ్చకపోవచ్చు.కానీ నిజం ఇదే.ఎవరో ఎందుకు సాక్షాత్తు చలంగారే 'రజనీ కాంతారావు ‘ గారికిచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పారు.
"నా పుస్తకాల్లో తిట్టింది బయట వున్న మనుష్యు
లను కాదు.నన్ను .నాలో ఏయే మచ్చలున్నాయో
వాటిని నేను గట్టిగా తిట్టుకోవడంలో నా పుస్తకాలు బయలు దేరాయి .మిమ్మల్ని కాదు.నన్ను నేను తిట్టుకున్నా.!!”.(చలం)
చలంగారికి సంఘాన్ని సంస్కరించాలన్న కోరిక ఏ
కోశానా లేదు.అసలు ఆయన అటువంటి ప్రయత్న
మే చేయలేదు.మంచైనా,చెడైనా ఆయనే భరించా
డు.తన జీవితంలోని చేదునిజాలకు సంఘటనలకు ఓ రూపం కల్పించడానికో చేసిన ప్రయత్నమే ఆయ
న సాహిత్యం.అందులో ఎవరినైనాతిట్టినా,నిందించి
నా,తప్పుపట్టినా, అవన్నీ చలం గారికే వర్తిస్తాయి.
ఎందుకంటే ..? సాహిత్యంలోని పాత్రల ద్వారా చెప్పింది ఆయన జీవితంలోని విశేషాలే కాబట్టి.
అందుకే, చలంగారి సాహిత్యం చదువుతుంటే , మనం కూడా ఆయనతో పాటు కలిసి ప్రయాణి
స్తున్నట్లువుంటుంది.చలంగారు ఈ సంఘాన్ని ఉద్ధరించాలని ఏనాడూ అనుకోలేదు.మనుషు
లంతాఉన్నతులు కావాలని మాత్రమేకోరుకున్నారు.
అలాంటప్పుడు ఆయన జీవితంలో, సాహిత్యంలో
వేసిన తప్పటడుగుల్లో నడిచినవారు ఎలా ఉన్నతు
లవుతారన్న ప్రశ్న తలెత్తుంది.
దానికి సమాధానం ఒకటే….
సాహిత్యంలో తన పాత్రలు చేసినతప్పుల్ని పాఠకు
లుతిరిగి చేయకుండా వుండటమే.తనబలహీనత
లు పాఠకులకు గుణ పాఠాలుగా మారితే మనుషు
ల్లో చాలావరకు మార్పు వస్తుంది.సంఘ సంస్కర
ణ,మనుషుల ఉద్ధరణను పక్కనబెట్టి ఉన్నది వున్న
ట్లుగా చెబితే...ఏది మంచో ? ఏది చెడో తెలుసుకో గలిగితే మానవజాతి మహర్దశ కు దారితీస్తుంది.
"నాకు సంఘాన్ని సంస్కరించాలన్న అభిలాష…
తక్కువ.మనుషులు వ్యక్తిగతంగా ఉన్నతులు
కావాలన్నదే నా దేవులాట.”! అంటారు చలం గారు!( ఇంటర్యూ విత్ నవీన్ 1968 ) తన
ఆత్మకథలో కూడా ఈ విషయమై మరింత స్పష్ట
త ఇచ్చారు.
*సంఘ నీతి నియమాల్ని,నిబంధనల్నీ చాటుగా,
స్వార్థంగా,గిల్టీగా,అపాలజెటిక్ గా కాక సంఘం
మీద అభిమానం వల్ల,మనసు మీది ప్రేమ వల్ల ఎదిరించగల ధీరులు అవసరం “(ఆత్మకథ పే91)
చలం కూడా అదే చేశాడు.ఓ ధీరుడిగా ఆచరించి చూపాడు.తానే కాదు..సాహిత్యంలో తన పాత్రల
చేత కూడా అదే చేయించి చూపాడు. తడడేన కథల ద్వారా తాను కొట్టే దెబ్బలకి ఎవరూ ఎదురు
పలకక పాఠకలోకం దిమ్మదిరిగే పడుకుందంటాడు చలంఅయినా,దాని రొద వినపడుతూనే వుండేద
ట.అసలు పాఠక లోకం నుంచి అవ్యాజమైన బాధా
రవమే తనకెంతో ప్రోత్సాహమిచ్చేదట.త్వరలోనే పాఠకులు తన చుట్టూ చేరి , తన శైలికి ప్రోత్సాహ
మిచ్చారట.అంతే కాదు తన శైలిని అనుసరించే
ప్రయత్నం కూడా చేశారట.కానీ సాహసించి తనతో సహవాసం చేసే యువకులు తను రాసిన శృంగార
పు ,విప్లవ భావాలకి,వాటి ఆచరణకి తట్టుకోలేక ఎక్కిరించి,భయపెట్టే వారి ధాటికి తాళలేక బావు
రుమంటో భయపడి తనను వదిలి పోయేవారని చలంగారే స్వయంగా చెప్పుకున్నారు.(ఆత్మకథ .పే73)
"సాధారణంగా రచనలు చేసేవారు తమ పేరుతో అచ్చుపడే వ్యానిటి కోసం ,కీర్తి కోసం రచనలు
చేస్తారు. కానీ చలం గారు మాత్రం అలాకాదు. కేవలం తాను నమ్మిన సిద్ధాంతం ప్రచారం కోసం
చలం రచనలు చేశారు.అధికారం చేతుల్లో వుంది కదా అని అబలల్ని హింసించుకు తినే వాళ్ళమీద
నే తన దాడి" అంటూ...చలంగారే సగర్వంగా ప్రకటించుకున్నారు.(ఆత్మకథ.పే 73).
*ఎ.రజాహుస్సేన్..
హైదరాబాద్....!!
No comments:
Post a Comment