*_ఈ వరస.._*
_*కానివ్వకు కురస!*_
************************
*బ్రదర్స్ డే సందర్భంగా..*
***********************
*_ఎలిశెట్టి సురేష్ కుమార్_*
✍️✍️✍️✍️✍️✍️✍️
_ఈ జన్మకే_
_నువ్వు అన్న_
_నేను తమ్ముడు.._
_ఇది బంధం.._
_వెంట వచ్చేదో.._
_లేదో తెలియనిది.._
_నిలబెట్టుకంటే_
_ఈ జన్మంతా ఉండేది..!_
_గంపెడు పిల్లలు.._
_కుటుంబానికి లేని ఎల్లలు_
_రోజులు గడుస్తున్న కొద్దీ_
_పెరిగే మనుషులు.._
_కలిసిపోయే మనసులు!_
_ఎక్కడో పుట్టి ఎక్కడో_
_కలిసే స్నేహితులు_
_అయితే కలిసే పుట్టి.._
_కలిసే పెరిగే అన్నదమ్ములు.._
_ఒక కొమ్మకు పూచే పువ్వులు.._
_అమ్మానాన్నల_
_వాడిపోని నవ్వులు..!_
_నాన్న వెళ్లారు.._
_అమ్మ అనుసరించింది.._
_అంతకు ముందే ఇంట్లో_
_పెద్దోళ్ళు ఒకరి వెంట ఒకరుగా_
_మాయమైపోయారు_
_మమతలను పంచి.._
_ముద్రలను మిగిల్చి.._
_జ్ఞాపకాలను వదిలి..!_
_పిల్లలు ఉన్నంత కాలం_
_అమ్మానాన్న ఉండరు.._
_కానీ ఆ ఇద్దరూ ఉన్నప్పుడు_
_మనం ఉన్నాం.._
_ఆ మనమే సంతానం.._
_ఒకే రక్తం..ఒకే ఇంటి పేరు.._
_అదే ఇల్లు..అదే అనుభూతి!_
_అన్నయ్య..తమ్ముడు.._
_ఇవే వరసలు.._
_వీళ్లే వారసులు.._
_నీ నిండు జీవితంలో_
_ఎందరైనా రానీ.._
_ఇంకెందరైనా పోనీ..._
_కడదాకా నిలిచి ఉండే_
_బంధం రక్తసంబంధం..!_
_నువ్విక్కడ ఉన్నా.._
_నీ కన్నా ముందు_
_బొడ్డూడిన_
_అన్న భాగ్యనగరి నడిబొడ్డులో.._
_నీకు బిగుతైపోయిన బట్టలు_
_సంబరంగా తొడుక్కున్న_
_తమ్ముడు అమెరికాలో_
_ఎవరెక్కడ ఉన్నా_
_ఆ అమ్మ నోముఫలాలే,._
_ఆ నాన్న కలల పంటలే.._
_అదే పేగు..ఒకే తీగ..!_
_మాట పట్టింపులు.._
_ఆస్తి వివాదాలు.._
_శత్రువుల్లా_
_సరిహద్దు గొడవలు.._
_పద్దతి నచ్చలేదని_
_రాకపోకలు మానేస్తే.._
_పలకరింపులు వదిలేస్తే.._
_ఒకనాటి అన్నదమ్ములు_ _దాయాదులైపోతే..._
_శత్రువులుగా మారిపోతే.._
_అక్కడ స్వర్గంలో_
_అమ్మ కంట్లో కలత.._
_నాన్న గుండెలో నలత!_
_మరోజన్మ ఉంటుందేమో.._
_కాని..మరోసారి అదే ఇంట్లో.._
_అదే అమ్మానాన్నల_
_కడుపున పుట్టేవా.._
_ఈ జన్మలోనే ఈ వరస.._
_ఇంతటి గొప్ప బంధాల్ని_
_ఎన్నటికీ కానీయకు కురస..!_
🤝🤝🤝🤝🤝🤝🤝
No comments:
Post a Comment