*ప్రాణం తీసుకోవడం- ప్రాణత్యాగం వేరు వేరు*
చావాలనుకోవడం- చావుకు సిద్ధపడటం వేరు.
మీ భార్యలు నిర్భయంగా ఒంటరిగా నడక కొనసాగిస్తున్నారంటే సరిహద్దుల్లోని మన కాపలాదారులు తమ భార్యల నుదుటి
సింధూరం చెరిగిపోతుందని భయపడటం లేదు. మనం మనకు నచ్చిన విధంగా జీవించేందుకు అవకాశం ఉందంటే,అక్కడ సరిహద్దుల
కాపలాలో తమ జీవితాలను పణంగా పెడుతుండడం వల్లే!
మన పిల్లలు సురక్షితంగా బడులకు వెళ్లి వస్తున్నారంటే, అక్కడ కొందరు సైనికులు
తమ పిల్లలు అనాధలవుతారని
బెంగపడటం లేదు. రక్షణ దళాల్లో చేరడం
అంటే చావుకు సిద్ధపడడమే!.
చావాలనుకోవడం వేరు, సైనికుడిగా
వీరమరణం పొందడం వేరు. చావును కోరుకోవడంలోని ఆ తేడాని మనం
గుర్తించాలి. యుద్ధం అంటే ఏమిటి?..
మనదేశంలోకి అక్రమంగా చొరబాటుకు
యత్నిస్తున్న వాళ్ళని నిలువరించేందుకు
మన జవాన్ సోదరులు ప్రాణత్యాగానికి
వెనుకాడక పోవడం వల్లే!.
అందుకే మనందరం ఒక ప్రతిజ్ఞ చేయాలి! మాకోసం మీరు,
మీకోసం మేము సదా సర్వదా!
మనం జీవిక కోసం ఎన్నో పనులు,
వృత్తులు చేసుకోగలుగుతున్నాం అంటే..
మన పనులు నిరాటంకంగా చేసుకోవడానికి
అక్కడ ఎందరో తమ ప్రాణాలను
తృణప్రాయంగా భావించడం వల్లే!
సరిహద్దులను సురక్షితంగా ఉంచడం కోసం
మన అందరి పక్షాన ప్రాణాలర్పించడానికి
సైతం సిద్ధపడి పనిచేస్తున్నందువల్లనే..
అని అర్థం చేసుకోవాలి.
(*సద్గురు జగ్గీ వాసుదేవ్ భావనకు భావానువాదం మల్లేశ్వరరావు ఆకుల*)
No comments:
Post a Comment