Friday, May 23, 2025

 


🙏 *రమణోదయం* 🙏

*సత్పదార్థమైన నా (ఆత్మ) సన్నిహిత సంబంధాన్ని పొందకపోతే ఇవన్నీ (శరీరం, ప్రాణం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం) ఉనికి లేక నశిస్తాయి. అందుచేత సత్పదార్థానికి అన్యంగా ఏ వస్తువు ఉనికి, జ్ఞానం కలిగినవిగా ఉండలేవు. కనుక అనాత్మ పదార్థాలు 'నేను' కాను.*

స్మరణ వలన లభించేవాడు కాడు
పరమాత్ముడు.
పరమాత్ముడు లభించిన తర్వాత
కలిగే కదలికే స్మరణ!

నీవు పుట్టిన క్షణం 
నీ జీవిత సినిమా రిలీజ్ అయినట్టు లెక్క.
ఇక మార్చేదేమీ ఉండదు అని 
తెలిసిననాడు హాయిగా ఉంటావు.

దేనినైనా సరే కావాలి అంటే బంధం.
దేనినైనా సరే వద్దు అంటే మోక్షం.
"కావాలి - వద్దు" ఈ రెంటినీ వదిలేయడమే
మోక్ష సన్న్యాస యోగం.

🌹🙏ఓమ్ నమో భగవతే శ్రీ రమణాయ!🙏🌹
    
*భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.672)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి 
🪷🪷🦚🦚🪷🪷
 *స్మరణ మాత్రముననె 
పరముక్తి ఫలద* |
 *కరుణామృత జలధి యరుణాచలమిది*|| 
            
🌹🌹🙏🙏 🌹🌹

No comments:

Post a Comment