Ramana Maharshi about Mental Cure
మానసిక గాయానికి మందు ఆటలో గెలిచిన వ్యక్తికి ప్రశంస ఎంత ముఖ్యమో ఓడిన మనిషికి ఓదార్పు అంత అవసరం ఓడిన వ్యక్తి తన అభ్యాసం శ్రమ బూడిదలో పోసిన పన్నీర అయిందని దిగులుపడుతూ ఉంటాడు. అలాంటి సమయంలో గెలుపు కన్నా ఓటమి ఇచ్చే అనుభవం గొప్పదని ఆటలోని మెలుకువలను మరింతగా ఒడిసి పట్టుకొని ద్విగుణీకృత ఉత్సాహంతో తలపడితే విజయం తద్యమన్న స్ఫూర్తిదాయక మాటలు చెబితే అతని మనసు కుదుటపడి తదుపరి పోటీకి సమాయత్తం అవుతుంది. విజయానికి మిత్రులు ఉంటారు అపజయం ఒంటరిది అన్నది లోక విధితం పోటీ ఏదైనా ఓటమి పాలైన వ్యక్తి పట్ల మనం చూపే సంఘీభావ తత్వం అతడికి వెన్నుదన్న అవుతుంది. విపత్కర పరిస్థితిలో తనకు తోడుగా నిలిచిన వారిని అతడు ఎన్నటికీ మరిచిపోలేడు. జీవితం అంటే కష్ట సుఖాల పడుగు పేక ఇవాళ సంతోషంగా ఉన్నాం కాబట్టి రేపు బాధ కలగదన్న నమ్మకం లేదు ఏ క్షణం ఏం జరుగుతుందో ఎవరం ఊహించలేము. అందుకే బాధల్లో ఉన్న వారిని ఓదార్చడం ఆదుకోవడం మానవత్వ భావనకు తొలిమెట్టుగా భావించాలి. ఆ పన్నుల పట్ల ఈనాటి మన ప్రవర్తన రేపటి మన కష్టానికి వారి సహకారాన్ని ముందస్తుగా సిద్ధం చేసుకోవడం అవుతుంది. మనుషులు కొందరు అకారణంగా మాటల ఈటెలతో ఎదుటివారి మనసును గాయపరుస్తారు. శరీరానికి తగిలిన దెబ్బల మానసిక గాయం బయటికి కనిపించదు కానీ ఆలోచనలను అస్థిరపరుస్తుంది. మనం ఉపశమనంగా చెప్పే నాలుగు మాటలు వారి మనసుకు చల్లని లేపనమై ఊరడిస్తాయి. ఒకరి ఆనందాన్ని పంచుకోకపోయినా పర్వాలేదు బాధను పంచుకొని భరోసా ఇవ్వాలి మానసిక అర్చకులను ఒక కంట గమనిస్తూ వీలైనంత వారితో గడుపుతూ వారిలోని ధైన్యాన్ని పటాపంచలు చేయాలి. కొంతమంది పరిస్థితుల ప్రభావానికి లోనైపోతూ ఉంటారు. సమస్యలకు వారు భయపడిపోతూ భూతద్దంలో చూసి ఉంటారు. మాటల్లోని నైరాష్యాన్ని పారద్రోలాలి అశోకవనంలో సీత చుట్టూ శత్రు రాక్షసగణం నా అన్నవారు లేరు అలాంటి సమయంలో త్రిజట చెప్పిన స్వప్న వృత్తాంతం ఆ తల్లి మనసుకు ఎంతటి స్వాంతన చేకూర్చుంటుందో కదా యుద్ధానంతరం సీతమ్మ తల్లి అయోధ్యకు వెళ్ళిన త్రిజటను మర్చిపోలేదు విశాలంగా పరుచుకున్న రావి చెట్టపై అనేక పక్షులు చేరినట్లు కోపమన్నది ఎరుగని శాంతి వచనాలతో సంభాషించే వారిని చాలామంది అంటిపెట్టుకుని ఉంటారు అటువంటి వారి సత్సంగమే మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తుంది. మాటలతో ఓదార్చి ఊరటనివ్వడం భగవంతుడు మనిషికి మాత్రమే ఇచ్చిన వరం మాటలతో మరో మనసుకు ఉపశమనాన్ని ఇవ్వగలిగితే మానవ జన్మకు ప్రయోజనం సిద్ధించినట్లే మానవుడి నుంచి భగవంతుడు ఆశించేది కూడా అదే
No comments:
Post a Comment