Wednesday, October 6, 2021

మంచి మాట... లు

ఆత్మీయ బంధుమిత్రులకు బాద్రపద మాస అమావాస్య బుధవారపు శుభోదయ మరియు బతుకమ్మ పండగ ప్రారంభశుభాకాంక్షలు.💐. విగ్నేశ్వరుడు సుబ్రమణ్య స్వామి అయ్యప్ప స్వామి వార్ల అనుగ్రహం తో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ.. ఈ రోజు కీర్తిశేషులైన మన పెద్దలను బంధుమిత్రులను స్మరించుకుంటూ వారి వారి ఆచార వ్యవహారాల ప్రకారం స్మరణ చేసుకుందాం.. వారి అశ్విర్వాదం పొంది సుఖసంతోషాలతో జీవిద్దాం 🙏

బుధవారం --: 06-10-2021 :--
ఈ రోజు AVB మంచి మాట... లు
మనం ఏమి చేసినా సమర్థించే వాళ్ళు స్వార్థపరులు నీవు ఏమైన తప్పు చేసినపుడు తప్పు అని తెలియజేసే వాళ్ళే నీ అసలైనా శ్రేయోభిలాషులు మంచిని చెడుని రెంటినీ తెలియజేసే వాళ్ళు నిజమైన స్నేహితులు ఒకరి గురించి వేరొకరి దగ్గర మాట్లాడితే
దూరాలు పెరుగుతాయి
ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే
దూరాలు తగ్గుతాయి

నేడు మంచిని విమర్శించేవారు మనకు అడుగడుగునా ఉంటారు వెనక్కి లాగే వారు మన వెన్నంటే ఉంటారు . నీ మేలు కోరేవారు ఎక్కడో ఒక్కరు మాత్రమే ఉంటారు అలాంటి స్నేహన్ని నీ మాటలతో నీ చేతులతో ఎన్నడూ దూరం చేసుకోకు .

మనం ఏర్పాటు చేసుకున్న సంబంధాలు ఎప్పుడు మాములుగా చేడిపోవు ఒకరి నిర్లక్ట్యం , ప్రవర్తన , అహంకారపూరిత వైఖరి వలన మాత్రమే చేడిపోతాయి ఒకరితో స్నేహం చెయ్యడానికి కారణాలు ఉండవు కానీ శత్రుత్వానికి మాత్రం ఇదమిద్దమైన కారణాలు తప్పనిసరిగా ఉంటాయి .

మీరు చేసే మంచిపని ఏదైనా సరే దాని ఫలితం జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు మిమ్ముల్నీ తప్పకుండా వచ్చి చేరుతుంది మంచి పనులే చేద్దాం మంచి వారిగానే పేరు ప్రఖ్యాతుల్ని సంపాదించుకుందాం,మంచిగానే బతుకుదాం .

సేకరణ 🖊️*మీ ... ఆత్మీయ బంధువు.. AVB సుబ్బారావు 🌷🌹🤝💐

సేకరణ

No comments:

Post a Comment