Saturday, December 4, 2021

మంచి మాట.. లు

ఆత్మీయ బంధుమిత్రులకు శుక్రవారపు శుభోదయ శుభాకాంక్షలు.. మీకు మీ కుటుంబసభ్యులకు లక్ష్మి దుర్గ సరస్వతి గాయత్రీ అమ్మవార్ల అనుగ్రహం తో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ..

శుక్ర వారం : 03-12-2021

ఈ రోజు AVB మంచి మాట.. లు

మనిషి కన్నా విలువైనది మనసు ఆవేశం కన్నా విలువైనది ఆలోచన కోపం కన్నా విలువైనది జాలి స్వార్థం కన్నా విలువైనది య త్యాగం వీటన్నంటి కంటే విలువైనది నీ స్నేహం నేస్తమా !

మనం కష్టపడాలన్నా ఈ క్షణమే మనం ఆనందించాలన్నా ఈ క్షణమే మనం బ్రతకాలన్నా ఈ క్షణమే బ్రతికించాలన్నా ఈ క్షణమే ఎందుకంటే నిన్న నీది కాదు గడచిపోయింది కాబట్టి రేపు నీది కాదు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఈ క్షణమే నీది నేస్తమా .

నేనే అనే అహంకారం ఉంటే నీతోనే నువ్వు పతనం అవుతావు మనం అనే ప్రేమ ఉంటే నీతో పాటు అందరూ ఉంటారు నువ్వు లేనప్పుడు కూడా నీకోసం ఉంటారు . వ్యక్తులు శాశ్వతం కాదు వ్యవస్థ శాశ్వతం అధికారం శాశ్వతం కాదు ఆప్యాయత శాశ్వతం .

నోటిలో నుంచి వచ్చే మాటని అదుపు చేయ గల వాళ్ళు ప్రపంచంలో దేనినైన జయించ గలగుతారు మాట చాలా శక్తి వంతమైనది , చెడ్డ పని కన్న చెడ్డ మాట చాలా ప్రమాదకరమైనది .

సేకరణ ✒️*మీ ..ఆత్మీయ బంధువు AVB సుబ్బారావు 💐🤝

సేకరణ

No comments:

Post a Comment