Monday, October 24, 2022

మంచి మాట.. లు(08-10-2022)

శనివారం --: 08-10-2022 :--
ఈ రోజు AVB మంచి మాట.. లు
గతంలో జరిగిన గతాన్ని మరచి ముందున్న గమ్యాన్ని చేరుకో భవిష్యత్తులో నిన్ను ఒడ్డు చేరుస్తుంది

నిన్ను తప్పుగా అనుకున్న వాళ్ళే నిన్ను చూసి తలదించుతారు .

ఎవరు మన కోసం ఎదురు చూస్తారో వాళ్ళ కోసం మనం బ్రతకాలి . ఎవరు మన కోసం బాధపడుతారో వాళ్ళని నవ్వించాలి, ఎవరు మనకో‌సం ప్రతిక్షణం ఆలోచిస్తారో వాళ్ళని దూరం చేసుకోవద్దు .

జారీ పోయిన కాలాన్ని జార విడుచుకున్న అవకాశాల వైపు మళ్ళీ మళ్ళీ తిరిగి చూడకు గతంలో ఆగిపోతే భవిష్యత్ కు దారి కనపడదు, ‌వైఫల్యం ముగింపు కాదు నిజానికి ఇది నీవు నేర్చుకోవటానికి లభించిన గొప్ప అవకాశం గా మలుచుకోవాలి, కానీ బాధ పడుతూ కూర్చోకూడదు. వైఫల్యాల నుండి భవిష్యత్తును నిర్మించుకో మిత్రమా

మనిషికి ఓర్పు అనేది లేకపోతే జీవితంలో ఓటమి తప్పదు, ఓటమి అనేది తెలియకపోతే జీవితంలో గెలుపుఅనేదిరాదు, గెలుపు అనేది కావాలిఅంటే మనిషికి సహనం అనేది ఉండాలి . ప్రతి మనిషికి ఉండవలిసింది ఓర్ఫు , నేర్పు , సహనం..

మన జీవితం మనకేదీ నేర్పించదు జీవితంలో మనకు ఎదురయ్యే మనుషుల ద్వారానే నేర్చుకోవాలి ఏదైనా .

మన ముందు తగ్గి తల దించుకున్న ప్రతివారు తగ్గినట్టు కాదు , తగ్గిన ప్రతివారు చేతగాని వారు కాదు కొందరు పరిస్థితులకు లొంగి తగ్గితే,, మరి కొందరు బంధాలకు లొంగి తగ్గుతారు , తగ్గారు కదా అని తక్కువ చేసి చూడకండి పరిస్థితులు ఎలాగైనా మారవచ్చు రేపు అనే రోజు మన వంతు కావచ్చు .

అదృష్టం అనేది ఎక్కడో లేదు మిత్రమా ఎప్పుడు మనతోనే మన కష్టం లోనే ఉంటుంది..ఎవరో వస్తారని ఎదో చేస్తారని ఎదురుచూసి మోసపోకుమా నిజం మరచి నిద్ర పోకు మిత్రమా
సేకరణ 🖊️*మీ ...AVB సుబ్బారావు 🤝🌹🚩

No comments:

Post a Comment