Monday, October 24, 2022

మంచి మాట.. లు(13-10-2022)

గురువారం:-13-10-3022
ఈ రోజు AVB మంచి మాట.. లు
భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచించేవారికి భయం ఉంటుంది, గతం గురించి ఎక్కువ ఆలోచించే వారికి బాధ ఉంటుంది, వర్తమానం లో జీవించేవారికి ఆనందం ఉంటుంది . మన ఆలోచనలు ఎప్పుడూ రాబోయే భవిష్యత్ వైపు పరుగెత్తాలి కానీ మనతో కలిసి నడవని గతం కోసం వేచి చూడకూడదు .

మంచివారు ఎప్పుడూ మొండి గానే ఉంటారు, ఎందుకంటే వారికి నటించడం ఇష్షం ఉండదు కనుక.

మనషులు సంతోషంగా బతకడం మానేసి ఆర్భాటంగా బతకడానికి ఇష్టపడుతున్నారు మనకు ఉన్నదాంతో వచ్చేది సంతోషం.మనకు ఉంది కదా అనుకుంటే వచ్చేది ఆర్భాటం .

డబ్బు చెబుతుంది అందరిని మరచి నన్ను సంపాదించమని, సమయం చెబుతుందిఅన్నింటిని మరచి నాకోసం శ్రమించమని, కానీ ! దేవుడు చెబుతాడు అందరికీ మంచి చేస్తూ ఉంఢు నీకేమి కావాలో నేను చూసుకుంటాను అని .

జీవితంలో అనుభవాల ద్వారా నేర్చుకునే పాఠాలు పుస్తకాలు కూడా నేర్పలేవు . ఎందుకంటే చదివి నేర్చుకునేవి పరీక్షల వరకే పనికివస్తాయి,అనుభవాలు మాత్రం జీవితం అంతం అయ్యే వరకు ఉపయోగ పడతాయి .

ధైర్యంతో అన్ని సమస్యలను దాదాపుగా మనం పరిష్కరించుకోవచ్చు కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ధైర్యాన్ని కొల్పోరాదు దైర్యం కోల్పోతే జీవితాంతం వాటి తాలూకు ఆలోచనలు బాధిస్తూనేఉంటాయి

సేకరణ 🖊️*మీ .ఆత్మీయ బంధువు AVB సుబ్బారావు 🤝🌷🌹💐..

No comments:

Post a Comment