Thursday, October 20, 2022

స్త్రీ అంటే అవసరం కాదు ధైర్యం.

 *స్త్రీ అంటే అవసరం కాదు ధైర్యం.*

రామునికి — సీత,
కృష్ణునికి — రాధ,
ఈశునకు — ఈశ్వరి,
మంత్రపఠనంలో — గాయత్రి,
గ్రంధ పఠనంలో — గీత,
దేవుని యెదుట -- వందన, అర్చన, పూజ, హారతి, ఆరాధన, వీరికి తోడుగా శ్రద్ధ.

మన దినచర్యలో భాగంగా
ఉదయాన—ఉష, అరుణ,
సాయింత్రం — సంధ్య,
చీకటేల — జ్యోతి, దీప
రాత్రి మత్తులో — నిషా
పడుకున్నాక — స్వప్న

చూచేటప్పుడు— నయన
వినేటప్పుడు — శ్రావణి
మాట్లాడేటప్పుడు—వాణి
ఓరిమిలో --- వసుధ 
వడ్డించేటప్పుడు  --- అన్నపూర్ణ
నడుస్తున్నప్పుడు — హంస
నవ్వేటప్పుడు — హాసిని, ప్రసన్న
అద్దంలో చూస్తే— సుందరి
చేసేపనికి --- స్పూర్తి
పని చేయడానికి — స్పందన
మంచి పనికి — పవిత్ర
ఇష్టంగా చేసే పనికి — ప్రీతి
నీరు త్రాగేటప్పుడు — గంగ
ఐస్క్రీమ్ తినేటప్పుడు — హిమజ
సినిమా చూస్తున్నప్పుడు — చిత్ర
అబద్ధ మాడునప్పుడు — కల్పన
నిజం చెప్పేటపుడు —సత్యవతి, నిర్మల
ఆలోచనలప్పుడు — ఊహా, భావన
చదువుచున్నప్పుడు — సరస్వతి
వ్యాపారంలో — ప్రతిభ , ప్రగతి
సంతోషంలో— సంతోషి
కోపంలో — భైరవి
ఆటలాడునప్పుడు — ఆనంది
గెలుపు కోసం — జయ, విజయ
గెలిచిన తర్వాత — కీర్తి
సరిగమలు నేర్చునప్పుడు — సంగీత
పాటలు పాడేటప్పుడు — శృతి, కోకిల
తాళం వేయునప్పుడు — లయ

సాహిత్య గోష్టిలో — కవిత
నగరాన్ని కాపాడుతూ — ప్రకృతి

జీవిత గమనంలో మనతో
విద్యాభ్యాసంలో — విద్య
సంపాదనప్పుడు — లక్ష్మి
చేసేవృత్తిలో — ప్రేరణ 
పని చేసి వచ్చాక — శాంతి
చిన్నతనంలో — లాలన
మధ్యవయస్సులో --- మాధురి
ముసలితనంలో -- కరుణ, మమత
జీవితాంతం మనతో — “జీవిత”.🙏

*బాగుంది కదా మన తెలుగుభాష*

No comments:

Post a Comment