RSS ను నిషేధించడానికి...సులభ మార్గాలు...
ముందుగా దానికి తగ్గ బలమైన ఆధారాలు సంపాదించాలి...
ఒక సంవత్సరం పాటు... మీరు దగ్గరలో ఉన్న శాఖ కు వెళ్లాలి...
అక్కడ నేర్పించే విషయాలను ఎప్పటికప్పుడు నమోదు చేసుకోవాలి...
వివిధ శారీరిక శిక్షణలు ఎలా ఇస్తున్నారో అధ్యయనం చెయ్యాలి...
వీలుంటే...మీరూ పాల్గొనాలి...
మధ్య మధ్యలో వాళ్ళు చిన్న చిన్న సమావేశాలు పెడుతూ ఉంటారు...
వాటిల్లో పాల్గొనాలి అంటే...కొన్ని పన్లు చెయ్యాలి...
శాఖా స్థలం శుభ్రం చెయ్యడం, రోజూ ఒకరిద్దరిని పిలుచుకుని రావడం, ప్రార్థన నేర్చుకోవడం లాంటివి...
ఇవి చేస్తూ ఉంటే...ఏదో ఒక బాధ్యత అప్పజెప్పి...సమావేశాలకు పిలుస్తారు...
అంతే..మీ పంట పండి నట్టే...
ఒక ఆరునెలలు అలా వెళితే...ఏడురోజుల కేంప్ కి డ్రెస్ మీచేతే కొనిపించి... తీసుకుపోతారు...
ఆరెస్సెస్ కి నిధులు రావు...
అదో తలకాయ నొప్పి...మొత్తం యూనిఫాం డబ్బు.. కేంప్ ఖర్చు మన జేబులోంచే పోతాయి...
ఆఖరికి ఆయుధం కూడా...అంటే కర్ర ఖర్చు కూడా మనదే..
ఈ ఒక్క ఇబ్బంది అధికమిస్తే.. కేంప్ లో పడ్డట్టే...
ఇంకొక సౌకర్యం కూడా ఉంది...
మీరు ఏ మతం ఏ కులము అని కూడా అడగరు కాబట్టి... ఈజీ గా లోపలకి వెళ్లిపోవచ్చు...
ఆ వారం రోజులు...పొద్దున్నే 4 గంటలకే లేపుతారు... అదో ఇబ్బంది...అయిన తట్టుకోవాలి...
నిషేధానికి ఎవిడెన్స్ కావాలంటే ఆ మాత్రం త్యాగం తప్పదు...
నేర్చుకున్నవి...అక్కడ ప్రసంగాలు వ్రాసి గోడకు పెట్టి మరీ వ్రాసుకోమంటారు...
ఇంకేం కావాలి.. నిషేధించడానికి కావలసిన మెటీరియల్ దొరికి పోయినట్టే...
అయినా పట్టు విడవద్దు....
మరో ఆరునెలలు...అలాగే వెళితే... ఏదో ఒక బాధ్యత ఇచ్చి...ఇరవై రోజుల వర్గకి తోలుకుపోతారు...
కేరింతలే ఇంక....
కర్ర యుద్ధం, కరాటే...నేర్పించి...వివిధ పుస్తకాలు, చర్చలు ఉంటాయి...
వయసు పెద్ద విషయం కాదు...కాబట్టి ఎంట్రీ దొరికేస్తుంది...
అక్కడకి ఆరెస్సెస్ దేశ నాయకులు వస్తారు...
ఇంకేం ఇంకేం ఇంకేం కావాలి...
వాళ్ల ప్రసంగాలు, మత విషయాలు రికార్డ్ చేసేసి...మీరే సాక్ష్యులు కాబట్టి...రేపు ఎక్కడైనా చెప్పేయొచ్చు...
అయినా నమ్మొద్దు...
గురూజీ అని...ఆయన వ్రాసిన పాంచ జన్యం వంటి..పుస్తకాలు ఆ వర్గలో బహిరంగంగా అమ్మేస్తారు...
మొత్తం కొనేయండి.. కుదిరినప్పుడల్లా చదివేయండి..
ఆరెస్సెస్ తిక్క కుదర్చాలి మరి..
ఇంకా పెద్ద రహస్యం మీకు చెబుతా...
రాబోయే మూడు నాలుగు రోజుల్లో...విజయ దశమి ఉత్సవాల పేరుతో..
కవాతులు...నేర్చుకున్న శారీరిక ప్రక్రియలు బహిరంగంగా ప్రదర్శిస్తారు..
వీడియోలు తీసి సాంఘిక మాధ్యమాల్లో పెట్టండి...
సాక్ష్యాలుగా కోర్టుల్లో పనికి వస్తాయి...
అన్నట్టు ఈ విజయదశమికి తొంభై ఏడేళ్ల ముసల్ది అయిపోయింది సంఘం...
శక్తి సన్నగిల్లే ఉంటుంది...
వీలైనంత ఎక్కువ మందిని...ఆ కార్యక్రమాలకు తీసుకుని పొండి...మిమ్మల్ని చూసి ఆరెస్సెస్ వణకాలి...
ఆరెస్సెస్ బ్యాన్ చేద్దాం...
మరిన్ని వివరాలకు..మీ సమీపంలో ఉన్న బాల స్వయం సేవక్ ను సంప్రదించండి..
ఉన్నవి ఉన్నట్లు చెప్పేస్తాడు...
నేను RSS కి ఏకలవ్య శిష్యుడనూ అనీ.. స్వయంసేవక్ ఐనందుకు నేను గర్వపడుతున్నా అన్నాడు:-సర్వోత్తమ్ మిశ్రా.
దిగ్విజయ్ సింగ్ & గడ్డి Scam చేసిన బీహార్ మాజీ Cm లాలూ ప్రసాద్ యాదవ్ లు ముందుగా Rss ని Ban చేయాలి అంటున్నారు..
వీళ్ళు చెప్పగలరా మేము PFI కి అనుబంధ అన్నదమ్ములం లేదా సభ్యులమని గర్వంగా చెప్పగలరా?
విజయీభవ!!!
Source from:- Shekar Mangalampalli
No comments:
Post a Comment