191122d1403.jun23. 211122-4.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀131
ఓం నమో భగవతే రామకృష్ణాయ
స్వామి వివేకానంద జీవిత గాథ:131
➖➖➖✍️
*హఠయోగంలో ఉత్సుకత*
▪️〰️▪️
బాబా ఒక హఠయోగి. దేహాన్ని పరిపూర్ణ ఆరోగ్య స్థితిలో ఉంచుకోవడానికి హఠయోగం తగిన శిక్షణ గరపుతుంది. బాబా వద్ద హఠయోగం నేర్చుకోవాలని స్వామీజీ అభిలషించారు. దానికోసం ఒక రోజు ఎన్ను కొన్నారు. దానిని గురించి దీర్ఘంగా ఆలోచిస్తూ మంచం మీద పడుకొనివున్నారు. హఠాత్తుగా అప్పుడు శ్రీరామకృష్ణులు ఆయన ముందు కనిపించారు.
ఏదో విచారంగా స్వామీజీకి కుడివైపు నిలబడి ఆయననే తదేకంగా చూడసాగారు. రెండు మూడు గంటలు గడిచాయి.*సంపూర్ణంగా శ్రీరామకృష్ణులకు అర్పించుకొన్న తాను ఇప్పుడు మరొక గురువును ఆశ్రయించాలనుకోవడం తప్పేమోనని స్వామీజీకి స్ఫురించింది. ఏదో దోషం చేశాననే ఆవేదనతో ఆయన కూడా పడుకొని శ్రీరామకృష్ణులను చూస్తుండి పోయారు*. హఠాత్తుగా శ్రీరామకృష్ణులు అదృశ్యమయిపోయారు.
హఠయోగం నేర్చుకోవాలనే అభిలాషను తాత్కాలికంగా స్వామీజీ విరమించుకొన్నారు.
అయినప్పటికీ హఠయోగం పట్ల స్వామీజీకి గల ఉత్సుకత తగ్గలేదు. ఒకటి రెండు రోజులు గడిచాక మళ్లీ ఉత్సుకత తలెత్తింది. వెంటనే శ్రీరామకృష్ణుల దర్శనమూ కలిగింది. ఈ విధంగా ఆయన అనుకొన్నప్పుడల్లా శ్రీరామకృష్ణుల దర్శనం కలుగసాగింది. ' తాము హఠయోగం నేర్చుకోవడం శ్రీరామకృష్ణులు అంగీకరించడంలేదన్న విషయం స్వామీజీ అర్థం చేసుకొన్నారు.
దీర్ఘంగా ఆలోచించిన స్వామీజీకి అంతా అర్థమయింది - *శ్రీరామకృష్ణులు యుగపురుషుడు. ఈ యుగంలో ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైనవి తీసుకుని వచ్చిన వారు. తనకు ఏది అవసరమో ఆయనకు బాగా తెలుసు; దానిని ఆయన అనుగ్రహించారు కూడా*. కనుక ఇకమీదట *మరొకరిని ఆశ్రయించి కొత్తగా ఏదీ నేర్చుకోవలసింది లేదు* - ఈ దృఢ నిశ్చయానికి రాగానే స్వామీజీలోని మనోచాంచల్యం తొలగిపోయింది.✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖
No comments:
Post a Comment