191122d1407.jun24. 221122-4.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀132.
ఓం నమో భగవతే రామకృష్ణాయ
స్వామి వివేకానంద జీవిత గాథ:132
➖➖➖✍️
*భారతదేశానికి అవసరమైన సంస్కరణలు*:-
▪️〰️▪️
స్వామీజీ వ్యక్తిత్వం పట్ల ఆకర్షితులైనవారు అనేకులు రోజూ ఆయన వద్దకు రావడమూ, ఆయన పాటలు, మాటలు వినడమూ ఘాజీపూర్ దినచర్యగా పరిణమించింది. కాని వచ్చేవారి పాశ్చాత్య వ్యామోహాన్ని స్వామీజీ గమనించకపోలేదు. వారి నడక, దుస్తులు, ప్రవర్తన అన్నీ పాశ్చాత్య సంస్కృతికి అద్దం పట్టాయి. పాశ్చాత్యులను అనుకరించడమే అభ్యుదయమని వారు భావించినట్లుగా కనిపించింది.
“విదేశీయులు ఇక్కడికి ఎటువంటి నాగరికతను కొనితెచ్చారు? ఆహా! వారు ఎటువంటి ఐహిక వ్యామోహాన్ని కల్పించారు! దుర్బల హృదయులైన వీరిని ఆ విశ్వనాథుడే సంరక్షించుగాక!
భారతదేశానికి ఆవశ్యకమైన సంస్కరణలు ఏ మార్గంలో జరగాలోఆయన మాటలు స్పష్టంగా తెలిపాయి: "ఉన్నదంతా బలవంతంగా తీసి పారవేయడమో, మన సంస్కృతిలో అంశాలనన్నింటిని నిష్పక్షపాతంగా తూలనాడడం వల్లనో కాదు మనం సంస్కరణ లను తీసుకురావలసింది. దానికి బదులు అపరిమితమైన ప్రేమను నాటాలి, ఎనలేని సహనం పాటించాలి.
*"విద్యను వ్యాపింపచేయాలి. సహజంగా అభివృద్ధికి కారణమవుతుంది.ఈ అభివృద్ధి బాహ్యంగా ఉత్తేజితమైనది కాక, లోపల నుండే ఉద్భవించినదై ఉంటుంది. మనం అందించే విద్య కూడా ఈ దృక్పథంతో కూడిన విద్యగా ఉండాలి. హిందూమత మహత్యాన్ని ఎలుగెత్తి చాటాలి*; అతిశయోక్తులకు పోకూడదు. హిందూమతంలోని ఆదర్శాలను ప్రజలు చైతన్యపూరితులై అవగతం చేసుకొనేలా చేయాలి.
*"ఒక్క విషయం మరచిపోకూడదు - హిందూమతం నీతి విరుద్ధమైనది కాదు! దాన్లో లోతుగా మునగండి, దాని మహత్యాన్ని మీరు కొలవవచ్చు. కళ్లుమూసుకొని పాశ్చాత్య సంస్కృతికీ, ఆచారవ్యవహారాల అట్టహాసాలకూ, పై పై మెరుగులకు బానిసలు కాకండి. మీ మాతృదేశం గురించి అధ్యయనం చేయండి*.. మీ జాతి, దాని జీవనాధార ప్రాతిపదిక ఉద్దేశం ఏమిటన్నది కనుగొనండి.
"భారతదేశ ఆదర్శాలూ, దృశ్యాలూ మహత్తరమైనవి కావని నేడు మనం భావిస్తున్నాం. మనం క్షణం మాత్రమే ఆలోచించవచ్చు, అయినప్పటికీ మనం అలా ఆలోచిస్తున్నాం, అలాంటి మానసిక దురాకర్షణకు లోనయ్యాం. ఇలాంటి వినాశనం కన్నా ఆవేదన కలిగించే స్థితి మన భారతదేశ చరిత్రలో సంభవించి ఉండదు.
*నిజానికి మన దేశంలో విలయతాండవం చేస్తున్న పేదరికం ఏదో తెలుసా? మన నాగరకత ఆధ్యాత్మిక కొలబద్దను మనం కనుగొనకపోవడమే*. మనలను మనం అవగతం చేసుకొన్నప్పుడు, కనుగొన్నప్పుడు మన సమస్యలు తొలగిపోతాయి.”.✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖
No comments:
Post a Comment