Tuesday, November 22, 2022

మనసును ఎలా అదుపులో ఉంచుకోవాలో తెలుసుకుందాం

 * ఈరోజు మనసును ఎలా అదుపులో ఉంచుకోవాలో తెలుసుకుందాం*

చలన శీలమైనది మనిషి మనసు. సర్వకాల సర్వావస్థల్లోనూ మారుతూ ఉండటం దాని లక్షణం. అందువల్ల దానికి స్థిరత్వం ఉండదు.  స్థిరత్వం లేకపోయినా స్పష్టత మాత్రం ఉండాలి. స్పష్టత వ్యక్తిగత నియంత్రణకు అత్యంత కీలకమైంది. మనసు గాలి కంటే వేగంగా పయనిస్తుంది. అరిషడ్వర్గాలను, రాగద్వేషాలను మోస్తూ మనుషుల్ని ఉత్సాహపరచడం, నియంత్రించడం లాంటి పరస్పర విరుద్ధమైన పనులు చేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు స్పష్టమైన ఆలోచనలు కొరవడితే మనసు చేసే విన్యాసాలను అదుపులో పెట్టుకోలేక, జీవన గమనం అస్తవ్యస్తంగా మారే ప్రమాదం ఉంది.

స్పష్టత, రుజువర్తన లేని జీవనం ఎగుడు దిగుడు బాటలో ప్రయాణం లాంటిది. మనం ఏమి చేయాలనుకుంటున్నాం. ఏర్పరచుకున్న గమ్యాలను ఎలా చేరాలనుకుంటున్నాం అనే విషయాల్లో సరైన దృక్కోణం, దృక్పదం ఉండాలి. అలాగైతేనే అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత శిఖరాలను అధిరోహించగలం. ఒక్కరోజులోనో, కొద్ది సమయంలోనో ఎవరూ శాస్త్రవేత్తలు, మేధావులు, పెద్ద కళాకారులు, అపర కుబేరులుగా తయారు కాలేదు.నేడు అందరూ తక్కువ సమయంలో ధనాన్ని సంపాదించాలని, వాటి ద్వారా సులభంగా సుఖభోగాలను అందిపుచ్చు కోవాలని అర్రులు చాస్తున్నారు. ఈ క్రమంలో తమ మూలాలను మరిచి సరైన దిశానిర్దేశం. లేకుండా పరుగులు పెట్టి ఒత్తిడికి, ఆత్మన్యూనతకు శ్రీ గురవుతూ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి,
ఏర్పరచుకున్న గమ్యం చేరడానికి, ఎన్నో ఏళ్ల శ్రమ స్పష్టమైన ఆలోచనా విధానం, దిశానిర్దేశం చేసే పెద్దలు ఉండటం వంటివి దోహద పడతాయి. అనాలోచిత నిర్ణయాలతో నష్టాలను, కష్టాలను కొని తెచ్చుకున్న వ్యక్తుల కథలు మనకు ఎన్నో పురాణాల్లోనూ తారస పడుతూ ఉంటాయి. కర్ణుడు సూత పుత్రుడినని న్యూనత చెందుతూండేవాడు. దుర్యోదనుడి స్నేహం వల్ల రాజుగా మారాడు. పాండవుల మీద అనవసర ద్వేషాన్ని పెంచుకున్నాడు. ఇంకా అస్త్రశస్త్రాలు సంపాదించే క్రమంలో సరైన ఆలోచనా దృక్పదాన్ని సైతం మరిచాడు. ఫలితంగా ఎన్నో శాపాలకు గురి కావలసి వచ్చింది.

ఒకసారి బాలుడిగా ఉన్న వివేకానందుడు ఉపాధ్యాయుడు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాడు. అతడి సమాధానం తప్పని ఉపాధ్యాయుడు వివేకానందుణ్ని శిక్షించాడు. ఎంత కొట్టినా తాను చెప్పిన సమాదానమే సరైనదని వాదించాడు బాల వివేకానందుడు. అనుమానం వచ్చిన ఉపాధ్యాయుడు పుస్తకం చూసి తన జవాబు తప్పు అని గ్రహించి పశ్చాత్తాపం చెందాడు. ఈ సంఘటన బాల్యం నుంచే వివేకానందుడి స్పష్టమైన ఆలోచనా సరళికి మచ్చుతునక. 
మన ఆంతర్యంలో రేగే ఆలోచనలను నెమ్మదిగా నిజాయతీగా ఓర్పుతో పరిశీలించినట్లయితే దూకుడైన ఆలోచనలు క్రమంగా సన్నగిల్లి, మనసు నెమ్మదై ఆవేశం వేగం తగ్గి ఆవే మనకు దిశానిర్దేశం చేస్తాయంటారు. మనోవిశ్లేషకులు. 

ఎంత చదివిన నేమి వినిన తన చింత ఏల మాను సిరులేల కలుగు' అన్న

 తమ కలలను సాకారం చేసుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అందరికీ ఉంటుంది. ఈ క్రమంలో ఎదురయ్యే ఎన్నో అవరోధాలను, ఎదుర్కొని నేర్పుతో గెలుపోటములను తట్టుకునే ఓర్పు, మనోనిబ్బరం, స్పష్టమైన ఆలోచన.. పరిపక్వత సాధ్యం కావాలంటే మనం ధ్యానాన్ని నిత్యకృత్యంగా మలచుకోవాలి.

సేకరణ. మానస సరోవరం 👏

No comments:

Post a Comment