Thursday, November 24, 2022

పరాశర మహర్షి గురించి తెలుసుకుందాము..

 🎻🌹🙏 మన మహర్షిల చరిత్రలు...

🌹🙏ఈరోజు 46 వ పరాశర మహర్షి గురించి తెలుసుకుందాము..🙏🌹

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

🌿సప్తర్షులలో ఒకరైన వశిష్టునికి, శక్తి అనే కుమారుడు ఉన్నాడు. 
ఆ శక్తిమహర్షికి జన్మించినవాడే పరాశరుడు. 

🌸కల్మాషపాదుడనే రాజు వేటాడి వస్తూ దార్లో కనిపించిన శక్తి మహర్షిని తప్పుకో అన్నాడు . మహర్షి , బ్రాహ్మణుడు ఎదురొస్తే నమస్కరించాలి గాని ఇలా అనడం తప్పు కదా ! అని అడిగితే కర్రతో కొట్టాడు రాజు

🌿రాజుని రాక్షసుడుగా మారిపోతావని శక్తి మహర్షి శపిస్తాడు . రాజు రాక్షసుడుగా మారిపోయి  శక్తి మహర్షిని చంపేస్తాడు 

🌸దాంతో తన తండ్రి చావుకి కారణమైన విషయాన్ని తన తల్లి ద్వారా తెలుసుకొని రాక్షసజాతి ఉండటానికి వీల్లేదని పరాశరుడు పగపట్టాడు.

🌿ఆ పగతో ఆయన వందలాది రాక్షసులను సంహరించాడు.
చివరికి పరాశరుని శాంతింపచేసేందుకు సాక్షాత్తూ అతని తాత వశిష్టుడు దిగిరావల్సి వచ్చింది.

🌸‘వ్యక్తిగత ద్వేషంతో సృష్టిధర్మాన్ని తిరగరాయద్దని’ వశిష్టుడు నచ్చచెప్పడంతో పరాశరుడు శాంతించాడు.

🌿వసిష్ఠుడు  పరాశరుణ్ణి అలా చేయడం తప్పని చెప్పి ని తండ్రిని చూడాలనుంటే శివుడి గురించి తపస్సు చెయ్యి . ఆయనే నీ తండ్రిని నీకు చూపిస్తాడు పరాశరుడు తపస్సు చేసి శివుడి అనుగ్రహంతో స్వర్గలోకంలో తన తండ్రిని చూసి ఆశీర్వాదం తీసుకుని మళ్ళీ ఆశ్రమానికి వచ్చి తల్లికి , తాతకి చెప్పాడు

🌸పరాశరుడు అంటాడు నేను రాక్షసులను చంపడానికి సత్రయాగం  మొదలు పెట్టాను రాక్షసులందరూ హోమాగ్నిలోపడి చచ్చిపోతారు అని 

🌿అప్పుడు మహర్షులందరూ కలిసి వచ్చి నాయనా ! నువ్వు ఇలా హింస చెయ్యకూడదు . రాక్షస వంశం నాశనము తగదు 
లోకానికి ఉపయోగించే పనులు చెయ్యాలి గాని ఇలాంటి హింసా కార్యక్రమాల అన్నారు . 

🌸మీరు చెప్పింది నేను వినాలి కాబట్టి  , మరి ఈ అగ్నిని ఇలా వదిలేస్తే 
నన్నే తినేస్తుంది కదా ! అన్నాడు పరాశరుడు . మహర్షులు దాన్ని హిమాలయాల్లో వదిలేసి రమ్మన్నారు 
పరాశరుడు హిమాలయాలలో అగ్నిని వదిలెస్తాడు.

🌿ఒకనాడు తీర్థయాత్రలు చేద్దామని పరాశరుడు బయలుదేరి యమునానది ఒడ్డుకి వచ్చి నది దాటుదామని పడవ ఎక్కాడు . 

🌸ఆ పడవని దాశరాజు కూతురు సత్యవతి ( మత్స్యగంధి అంటారు ) పడవ నడుపుతోంది . ఆమెని చూసి ఇష్టపడి సత్యవతి పూర్వజన్మలో దేవకన్య అని దివ్యదృష్టితో తెలుసుకుని సత్యవతికి విషయం చెప్పాడు . 

🌿నాకు ఏ దోషం రాకుండా కన్యగానే వుండేలా వరమిస్తే మీరు చెప్పినట్లు చేస్తాను అంది సత్యవతి . 
పరాశరుడి వల్ల సత్యవతికి శ్రీ వేదవ్యాసుడు పుట్టాడు . 

🌸పరాశరుడు సత్యవతి అడిగిన వరాలిచ్చి కొడుకుని దీవించి వెళ్ళిపోయాడు . వ్యాసుడు కూడా తల్లికి నమస్కరించి తపస్సు చేసుకుందుకు వెళ్ళిపోయాడు . 

🌿జనకమహారాజు పరాశరుడి దగ్గరకి వెళ్ళి ధర్మాన్ని గురించి చెప్పమన్నాడు . పరాశరుడు రాజా ! పండు కావాలంటే దాని గింజ ఎంత అవసరమో మనిషికి సుఖం కావాలంటే ధర్మం అంతే అవసరం అని ధర్మాల్ని గురించి వివరంగా చెప్పాడు పరాశరుడు .

🌸జనకమహారాజు మహర్షీ ! తపస్సు వల్ల ఉపయోగం ఏమిటని అడిగాడు . రాజా ! మనిషి ఇంద్రియాల్ని జయించి ధర్మార్థ కామమోక్షాలు పొందడానికి తపస్సే , కారణమవుతుందని , హింస అహింసల గురించి కూడా చెప్పాడు పరాశరుడు . 

🌿జనకమహారాజుకి ఇంకా జ్ఞానాన్ని గురించి కూడ వివరంగా చెప్పాడు . దీన్నే ' పరాశరగీత ' అంటారు . పరాశరుడు శిష్యులందరికి జ్ఞానబోధ చేసేవాడు . 

🌸పాపాలు లేకపోతే పుణ్యం వస్తుందే కానీ మోక్షం రాదని , మంచి గురువు చెప్పినట్లు చేసి జ్ఞానం సంపాదించి మోక్షాన్ని పొందాలి అప్పుడే మళ్ళీ జన్మ వుండదని చెప్పాడు పరాశరుడు . 

🌿 భద్రసేనుడనే మహారాజుకి ఒక కొడుకుండేవాడు . అలాగే మంత్రికి కూడా . ఆ ఇద్దరు పిల్లలు రుద్రాక్షలు వేసుకుని శివుడ్ని ధ్యానించడం తప్ప బంగారాన్ని పెట్టుకునేవాళ్ళు కాదు .

🌸పరాశరుడు భద్రసేనుడికి వాళ్ళిద్దరూ అల్పాయుష్కులని చెప్పి శివజపం ఉపదేశించి పూర్తి అయుష్షు కలిగేలా చేశాడు . 

🌿వ్యాసభగవానుడు ఋషులందరితోను కలిసి వెళ్ళి తండ్రి పరాశరుణ్ణి అడిగి కలియుగధర్మాలు అడిగి తెలుసుకున్నాడు . దాని పేరు ' పరాశరస్మృతి ' . దాంట్లో ఆచార కాండం , ప్రాయశ్చిత్తకాండం వున్నాయి . ఇంకా “ పరాశర హోరాశాస్త్రం ” అని గొప్ప జ్యోతిష గ్రంథం విష్ణుతత్వం గురించి వుంది .

🌸సనాతన విజ్ఞానంలో జ్యోతిషానికి గొప్ప స్థానం ఉంది. మానవుల జీవితంలో శుభాశుభాలను అంచనా వేసేందుకే కాకుండా ఖగోళాన్ని అధ్యయనం చేసేందుకు కూడా ఈ జ్యోతిషాన్ని ప్రమాణికంగా నమ్ముతారు. 

🌿కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆ జ్యోతిషశాస్త్రానికి ఒక భూమికను ఏర్పరిచినవాడు పరాశరుడు. ‘పరాశరహోర’ పేరుతో ఆయన రచించిన గ్రంథాన్ని ఇప్పటికీ భక్తితో అనుసరించేవారు ఉన్నారు.

🌸ఇలాంటి గ్రంథాల్లో మహర్షులని ఉద్ధరించాడు పరాశరుడు .
చూశారా ! పరాశరుడు గొప్ప గ్రంధకర్తె కాకుండా , గొప్ప మహర్షికి తండ్రి , మనుమడు అయ్యి ఎంత కీర్తి పొందాడో ! జనకమహారాజంతటి వాడికే జ్ఞానాన్ని బోధించాడంటే .... !! ఇదే పరాశర మహర్షి కథ !!

No comments:

Post a Comment