Thursday, November 24, 2022

ప్రారబ్ధం (విధి) బాధించకుండా ఉండాలంటే నేను ఏం చేయాలి ?

 *🌼"శ్రీరమణీయం"*🌼

*"ప్రారబ్ధం (విధి) బాధించకుండా ఉండాలంటే నేను ఏం చేయాలి ?"*
              **

*"కర్మ ఫలదాత ఈశ్వరుడేనన్న సత్యాన్ని గుర్తించడమే. అప్పుడు ప్రారబ్ధం బాధించదు. అద్దం ఎదురుగా ఉన్నప్పుడు ప్రతిబింబం తప్పనట్లే ప్రతికర్మకి ఫలం తప్పదు. దాన్నే ప్రారబ్ధం అంటారు. ఈ ప్రారబ్ధమే మనల్ని నడిపిస్తుంది. ప్రారబ్ధాన్ని అందించే ఈశ్వరుడు మనలోనే ఆత్మగా ఉన్నాడని తెలుసుకుంటే ఆత్మానందం సొంతం అవుతుంది. ఈశ్వరశక్తే ఆత్మగా, ప్రాణంగా ఉండి మనని నడిపిస్తుందని అర్థమవుతుంది. దీపం ఒక చోట ఉన్నా దాని వెలుగు విస్తరించినట్లే ఈశ్వరశక్తి ఎల్లెడలా ఆవరించి ఉంది. మూలమైన ఈశ్వర జ్యోతిని దర్శించటమే మన గమ్యం. ఈ ప్రపంచాన్ని శివానుగ్రహమైన శక్తిగా చూసిన రోజు మాయకు ఆస్కారమే ఉండదు, ప్రారబ్ధం బాధించదు !"*

*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}*

No comments:

Post a Comment