Monday, January 23, 2023

శ్రీరమణీయం: మనం దేన్నయినా జయించాలంటే ఏ విధంగా ప్రయత్నించాలి ?

 🙏🕉🙏                    ...... *"శ్రీ"*

                 💖💖💖
       💖💖 *"445"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
    
*"మనం దేన్నయినా జయించాలంటే ఏ విధంగా ప్రయత్నించాలి ?"*

*"దేన్నయితే జయించాలనుకుంటున్నారో దాని స్వరూపాన్ని ముందుగా అవగాహన చేసుకోవాలి. మనసు మనని బాధించదు ! మనసులోని కోరికలే బాధకు కారణం అవుతున్నాయి. ఆధ్యాత్మిక సాధనలో మన మనసును మనం విశ్లేషించుకోగలుగుతాము. అప్పుడు మనం వద్దనుకునే దుఃఖం, బాధ, విచారం వంటి భావాలకు అశాంతి కారణమని తెలుస్తుంది. ఆ అశాంతికి మనలోని ఆశ కారణమని గ్రహిస్తాం. మనలోని అనేక కోరికలకు ఆశ అనే గుణమే మూలం. ఆశ పరిధి చాలా విస్తృతం. మనతో దేన్నైనా కోరుకునేలా చేయించేది ఆశే ! మనసు పేరుతో ఏ శక్తి అయితే మన జీవనానికి ఆధారమైందో అది ధ్యానస్థితిలో సాక్షాత్తు శివుడే తన ఎదురుగా ఉన్నా.. అదే శక్తి కోరిక రూపంలో మనని అశాంతికి గురిచేస్తుంది. మనం కోరికలను జయించే ప్రయత్నం చేస్తున్నాం. అందుకే ఆశ స్వరూపం ఏమిటో అర్థమైతే కోరికను సమూలంగా తొలగించుకోగలుగుతాం !"*

*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
    

No comments:

Post a Comment