"ఎంచుకునే అవకాశం ఉండుంటే.. హిందువుగా ఉండడాన్ని ఇష్టపడతా.." అని ఎందుకన్నారు అని.. "హిందూ ఆలయ పునాదులపైనే బాబ్రీ మసీదు నిర్మించబడింది" అని నిర్ద్వందంగా శాస్త్రీయ ఋజువులతో నిరూపించిన భారత పురావస్తు శాఖకు చెందిన రిటైర్డ్ రీజనల్ డైరెక్టర్, పద్మశ్రీ కే.కే ముహమ్మద్ గారిని ప్రశ్నించగా..
ఆయన ఇలా అన్నారు..
హిందూయిజం ఎంతో ఉదారవాదమైన & ఉదాత్తమైన ఆలోచన.. ఆధ్యాత్మిక భావజాలం. గుడికెళ్ళినా వెళ్ళకపోయినా.. మహాశివుణ్ణి నమ్మినా నమ్మకపోయినా.. మహావిష్ణువుని పూజించినా పూజించకపోయినా.. నువ్వు హిందువువే. అందుకే ఇదెంతో ఉదారమైన విశ్వాసం. ఆధునిక కాలానికి సరిగ్గా సరిపోయే ధర్మం ఏదైనా ఉందంటే అది హిందూ ధర్మమే. అదే సెమిటిక్ మతాలైన జుడాయిజం, క్రిస్టియానిటీ, ఇస్లాం.. ఇవన్నీ కూడా నిర్బంధమైన లేదా కఠినమైన కట్టుబాట్లు ఉన్న మతాలు. వాటిలో పేర్కొన్న కట్టుబాట్లను అనుసరించకపోతే ఆ మతాల నుండి వెలివేయబడతారు. అందుకే స్వేచ్ఛగా జీవించాలనుకునే వారికి అందుబాటులో ఉన్న ఏకైక ఉదారవాద మతం హిందూ ధర్మమే.
https://youtu.be/c3TFsuXZX9o
No comments:
Post a Comment