అష్టావక్రగీత/ఋభు గీత
*_"ఋభుగీత "(
🕉️🌞🌏🌙🌟🚩
*_"బ్రహ్మేకరూపము"_*
*_27వ అధ్యాయము_*
.
*_🍁భేదంపోయిన మనసు శాశ్వతమైన శాంతితో ఉంటుంది !_🍁*
*_నేను, నువ్వు అనే వ్యత్యాసం ప్రాపంచిక జీవనంలో భౌతికంగా అత్యావశ్యకం. మనోప్రపంచంలో వాటి అవసరం పరిమితం. ఇక ఆత్మ చైతన్యంతో ఆ విభేదాల అవసరమే లేదు. ఎందుకంటే శాంతిపొందిన మనసుకు అంతా ఏకమే. నీమనసు, నామనసు అనే భేదం దానికి ఉండదు. ఏదైనా మనసు కదలికలుగానే అది గుర్తిస్తుంది. సృష్టిలో కార్యాలన్నింటినీ ఒకే చైతన్యం యొక్క భిన్న కదలికలుగా దర్శించినప్పుడు ఇక నీ, నా భేదాలు మనసులో ఉండవు. ఆ భేదంపోయిన మనసుకు ఖేదం ఉండదు. ఖేదంలేని మనసు శాశ్వతమైన శాంతిలో ఉంటుంది..
*_ఆశ, మొహం అనే మలినాలను తొలగించుకుంటే మనసు నిర్మలమౌతుంది !_*
*_చింతన, స్మృతి, దేహభావం వంటివి జీవనంలో మనసుకు ఏర్పడే స్థితులే కానీ మనసుకు అతీతమైన స్థితిలో ఇవేవీ ఉండవు. ఆత్మ తన్మయస్థితిలో శాంతిమినహా ఏదీ ఉండదు. మనసుకు మరేది లక్ష్యంగా కూడా ఉండదు. ఇహము, పరము శాంతే నిండి ఉంటుంది. మనసే పరబ్రహ్మగా ఉంటుంది. పరతత్త్వం, మహనీయము, సాక్షాత్కారమైన తన్మయస్థితే మనసుకు పరమగమ్యం. నిర్మలమైన మనసు తానే శివుడిగా, బ్రహ్మముగా, చైతన్యముగా నిలిచి పరబ్రహ్మముగా విరాజిల్లుతుంది. మనలోని ఆశ, మొహం అనే మలినాలను తొలగించుకుంటే మనసు నిర్మలమౌతుంది !..
*_కోరికే మనసును అంటిపెట్టుకునే మలం !_*
*_మనం మనసులోని మలినాలను తీసేసుకుంటే మనసు నిర్మలమౌతుంది. కోరిక ఒక్కటే మనసును అంటిపెట్టుకునే మలం. కోరికను తీసేస్తే మనసు నిర్మలం అవుతుంది. కోరికతో పనిలేదని, దానివల్ల మనసుకు ప్రయోజనం లేదని తెలిస్తే మనసే కోరికలను వదిలేస్తుంది. సత్యం అవగతమైన మనసుకు ఈ దేహం చైతన్యాన్ని ధరించిన ఒక కళేబరముగా ఉంటుంది. దీని పరిధి ఏపాటిదో తెలిస్తే దేహగతమైన జీవనం విలువకూడా తెలుస్తుంది. దేహభావనచేత కలిగే స్మృతులు కూడా నశించి పరబ్రహ్మగానే ఉంటాము. ఈ వివరణ వినినంతనే మోక్షప్రదమని ఋభుమహర్షి నిర్ధారిస్తున్నారు !..
.
*_"నేను బ్రహ్మము ! సందేహము లేదు !!” అనే ఎరుకతో ఉండమని ఋభు మహర్షి బోధ. నిరంతరం దాన్ని అనుకున్నా, లేదా విన్నా నిష్కళంకమైన చైతన్యమే అవుతామని సూచిస్తున్నారు. చైతన్యంగా ఉండాలంటే నిష్కళంకంగా ఉండాలనే బోధన ఇందులో ఉంది. ఈ సృష్టిలో ఎవరూ కష్టపడి తాను ఆత్మగా, బ్రహ్మగా, దైవంగా మారనక్కర్లేదు. తాము అదేనని గుర్తుపడితే చాలు. అలా గుర్తించలేక పోవడానికి కారణం మనసును ఆవరించిన అసత్యభావన. అంతరంగంలో నేను బ్రహ్మను అనే సత్యంపై ఉన్న సంశయం. అందుకే మహానుభావుడైన ఋభుమహర్షి తమ బోధలో పదేపదే సత్యాన్ని పునఃశ్చరణ చేసి చెప్తున్నారు...
*_సుఖాన్ని శాశ్వతం చేసుకునే తరుణోపాయమే వేదాంతం !_*
*_అంతరంగంలో ఉన్న అసత్యభావన పోవాలంటే మనసు బాహ్యచర్యలను సంస్కరించుకోవాలి. ముందు మంచి మాట వినటం అలవర్చుకోవాలి. ఇతరులు చెప్పే మంచిమాటలే కాదు. మనలోని అంతరాత్మకూడా నిరంతరం ఏది మంచో, ఏది చెడో చెప్తూనే ఉంటుంది. మంచి మాట వినాలని అనిపించకపోవడం, వింటుంటే విసుగు రావడం మన(సు)కి పొంచి ఉన్న ప్రమాదాన్ని సూచిస్తుంది. వేదాంతం కష్టపడమని చెప్పదు. మనం అనుభవించే తాత్కాలిక సుఖాన్ని శాశ్వతం చేసుకునే తరుణోపాయం చెప్తుంది !..
*_పారమార్థిక ఆనందాన్ని వదలి వ్యవహారిక సంతోషాన్ని కోరుకోవడం పసితనమే అవుతుంది !_*
*_అంతరాత్మ మాట వింటే అది మనసు సంతోష దుఃఖాల ద్వంద్వంలో పడి కొట్టుమిట్టాడకుండా చేస్తుంది. ఆ రెంటికీ అతీతమైన ఆనందంలో ఉండే మార్గం చూపిస్తుంది. పసితనంలో పంచభక్ష్య పరమాన్నాలకన్నా చిన్న పిల్లలు చాక్లెట్స్ ఇష్టపడతారు. కానీ వయసు పెరిగిన తర్వాత కూడా అదే ఇష్టాన్ని అనుసరించరు. భోజనం విలువ తెలుసుకుంటారు. దేనికన్నా ఏది శ్రేష్ఠమో తెలుసుకొని దాన్ని ఇష్టపడతారు. సత్యం విషయంలోకూడా మనసు పసితనంతో ఉండకూడదు. పారమార్థిక ఆనందాన్ని వదలి, వ్యవహారిక విషయాలలోని అశాశ్వతమైన సంతోషాన్ని కోరుకోవడం పసితనమే అవుతుంది !..
🌹సర్వేజనాసుఖినోభవంతు 🌹
No comments:
Post a Comment