Monday, February 20, 2023

మరణం కాని మరణం

 🔥మరణం కాని మరణం🔥

🙏🙏🙏🙏🙏🙏🙏


తొలి శ్వాసతో మొదలయిన జీవిత ప్రయాణం తుది శ్వాసతో పరిసమాప్తమవుతుంది. పుట్టిన ప్రతి వ్యక్తీ ఎప్పుడో ఒకప్పుడు మరణించాల్సిందే అనే విషయాన్ని గ్రహించలేక అశాశ్వతమైన సంపదలు, సుఖ సంతోషాల వెంట పరుగెడుతూ జీవితాన్ని అర్థరహితంగా గడిపేస్తుంటాం. ఈ సందర్భంగా కబీరు చెప్పిన సర్వకాలీన సత్యాన్ని ఇక్కడ ప్రస్తావించుకుందాం.

ప్రపంచంలో ప్రజలు మరణిస్తూనే ఉంటారు, కానీ ఏ విధంగా మరణించారో నిజానికి ఎవరికీ తెలియదు. మరణమెటువంటిదో తెలుసుకోదలిస్తే వినండి, మరణం రెండు విధాలుగా ఉంటుంది. మొదటిది సాధారణ మరణం. రెండోది అసాధారణ మరణం. మొదటిది మనకి తెలిసినదే, రెండోది రామ నామ ద్వారంలోంచి వెళుతూ పొందే మరణం. ఈ విధంగా మరణించిన వారికి తిరిగి మరణం సంభవించదు. ప్రాణ ప్రయాణ సమయంలో ఎవరైతే స్థిరచిత్తంతో రామనామాన్ని జపిస్తూ కల్యాణ రామ స్వరూపాన్ని స్మరిస్తూ ప్రాణం విడుస్తారో వాళ్ళు తిరిగి మరణించవలసిన అవసరం రాదు అంటారు కబీరు.

చనిపోయే ముందు ప్రతివ్యక్తినీ ఒక బలవత్తరమైన భావన వెంటాడుతూ ఉంటుంది. అది తాను చేసిన చెడ్డ పనుల గురించి గాని, మంచి పనుల గురించి గాని లేదా సంపద, సంసారం ఇత్యాదివాటి గురించో తలచుకుంటారు. ఆ వాసనలకనుగుణంగానే తిరిగి భూమి మీద జన్మిస్తారు. గీతా ప్రవచనాలలో విద్యాప్రకాశానందగిరి స్వామి ఒక సంఘటన గురించి చెప్పేవారు. అదేంటంటే.. కర్ణాటకలో ఒక ధనవంతుడు ఉండేవాడు. జీవితాంతం ధన సంపదపై దృష్టిపెట్టేవాడే గానీ ఏనాడూ ఒక్కసారైనా భగవన్నామాన్ని ఉచ్చరించిన పాపాన పోలేదు. అతడికి అంత్యకాలం సమీపించింది. అతడు భవంతిలో మరణిస్తే ఏడాదిపాటు దాన్ని మూసిపెట్టాల్సి వస్తుందని బంధువులందరూ కలిసి అతడిని ఇంటి వెనుక పశువుల కొట్టంలోకి చేరుస్తారు. కనీసం ఇప్పుడైనా భగవంతుడిని తలుస్తూమరణిస్తే మంచిజన్మ లభిస్తుందని పండితులు చెప్పటం వల్ల కుటుంబ సభ్యులు అతని చెవిలో రామ రామ అంటూ ఆ నామాన్ని పలకాలని చెప్పారు. అతడు అతి కష్టంగా.. ‘‘కరు కసబరికయన్ను, కడుయుత్తదే’’ అని ప్రాణం విడిచాడట. ‘కొట్టంలో ఉన్న దూడ చీపురు కట్ట కొరుకుతోంది దాన్ని తీసి జాగర్త చేసుకోండి’ అని దాని అర్థం.

ఇదే మనలో చాలా మందికి జరిగేది. అందుకే కబీరు చెప్పిన ‘‘తిరిగి మరణించవలసిన అవసరం రాని మరణం’’ పొందాలంటే..
🍁సర్వేజనాసుఖినోభవంతు 🍁

No comments:

Post a Comment