నేటి ఆణిముత్యాలు.
ఎదుగుదలకు నిదర్శనం చాలాసార్లు విమర్శకు గురవడమే.
నువ్వు విమర్శించబడే వారి జాబితాలో ఉంటావా? లేక విమర్శించే వారి జాబితాలోనా అనేది నీ నిర్ణయం పైనే ఆధారపడి ఉంటుంది.
ఒక బందాన్ని (ఆ బంధం స్నేహం కావచ్చు మరి ఏదయినా కావచ్చు) కావాలనుకున్నప్పుడు మీ అహన్ని వదిలెయ్యండి.ఆత్మాభిమానాన్ని కాదు.అహమే అలంకారం అనుకున్నప్పుడు బందాన్ని వదిలెయ్యండి.
స్నేహం అనేది అన్ని చెప్పుకునేలా, బంధం అన్నీ పంచుకునేలా ఉండాలి. అది మంచైనా, చెడైనా కష్టమైనా, నష్టమైనా, ఓటమైనా, గెలుపైనా, సంతోషమైనా, దుఃఖమైనా, ప్రేమైనా, కోపమైనా..
మన జీవితం వికసించాలంటే మన ఆలోచనల్ని ప్రేమ, ఆప్యాయత, ఎదగడానికి అనుకూలతను కల్పించే సారవంతమైన భూమి పైన పెట్టాలి, మన ఎదుగుదలను నిరంతరం అడ్డుకునే బంజరు భూమి పైన కాదు.
సైకిల్ పై వెళ్లే వాడికి కారులో వెళ్ళాలనే ఆశ,కారులో వాడికి ఫ్లైట్ లో వెళ్ళాలనే ఆశ, ఫ్లైట్ లో వెళ్ళేవాడికి సొంత ఫ్లైట్ ఉండాలని ఆశ ఇలా ఆశ అంతం లేనిది,అంతులేనిది.కాబట్టి మనిషి ఎప్పుడూ ఆశతో జీవించాలి.
ఉషోదయం తో మీ రామిరెడ్డి మానస సరోవరం 👏
No comments:
Post a Comment