*::::::విజ్ఞానం రెండు రకాలు :::::*
మన ఇంద్రియాలు వాటి వాటి విషయాలతో సంపర్కం లోకి వచ్చినప్పుడు మనకు రెండు రకాలుగా విజ్ఞానం కలుగుతుంది.
1) ఇంద్రియ విజ్ఞానం
2)భావ విజ్ఞానం.
ఉదాహరణ...
సామాన్యుడిగా ఒక గంట శబ్ధం వింటే అది కేవలం గంట కొట్టి నప్పుడు వచ్చే శబ్దం గా మనకు తెలుస్తుంది.ఇది ఇంద్రియ విజ్ఞానం.
దీనినే విద్యార్థులు ఆ గంట శబ్ధం వింటే అది కేవలం గంట శబ్ధం మే కాక బడి తెరిచారు అని అర్థం చేసుకుంటాడు.
సాయంత్రం వింటే బడి మూసేశారు, ఇంటి కి వెళ్ళాలి అని తెలుస్తోంది.దీనిని భావ విజ్ఞానం అనవచ్చు.
ఈ భావ విజ్ఞానం సామాజిక ఆచరణ, ఆచారాల ద్వారా ఏర్పడుతుంది.ఇది ఆయా వ్యక్తులకు మాత్రమే ప్రత్యేకం.
ఇక్కడే భ్రమ కు లోనౌతాము.
మనకు కలిగే భావోద్వేగాలు ఈ భావ విజ్ఞానం వల్లనే. ఇది ఆ యా భావాలు ఉన్న వ్యక్తులకు మాత్రమే.
*షణ్ముఖానంద 98666 99774*
No comments:
Post a Comment