Saturday, February 11, 2023

****శోక రాహిత్యము, వాసనా రాహిత్యము బంధరాహిత్యము, జన్మరాహిత్యము

 [2/10, 12:12] +91 73963 92086: సద్గురు పరబ్రహ్మణే నమః

విద్యాసాగర్ స్వామి వారి బోధ

శోక రాహిత్యము, వాసనా రాహిత్యము
బంధరాహిత్యము, జన్మరాహిత్యము
                **

గు : సృష్టి అనేది అనుభవంలో ఉన్నది కదా! అది దేని వలన జరుగుతోంది. ఇది కార్యం. దీని వెనుక కారణమంటూ ఒకటి ఉండాలా వద్దా ! ఉండకుండా ఎలా జరుగుతుంది? అంతే కదా! 
ఆ కారణం ఏమిటి అనే ఒక ప్రశ్న రావాలి? 
కార్య కారణ వివేకం వస్తేగానీ తెలియదు. ఆ కారణం ఎటువంటిదయ్యా అంటె... దానివలన నీవు పొందవలసిన పరిణామం ఉంది కాబట్టి ఆ కార్యం జరుపబడుతోంది. పరిణామం ఏమిటనేది కార్యము పూర్తి అయ్యేదాకా తెలియదు. అర్థమైందా!
పుట్టకముందే... పుడితే ఏం జరిగిపోతుందో తెలిస్తే పుట్టకుండా ఉండేవాడిని కదా అన్నాడనుకోండి... ఎట్లా తెలుస్తుంది? పుడితే ఇన్ని కష్టాలు అనుభవించాలని తెలిసి ఉంటె నేను పుట్టకుండా ఉండేవాడిని కదా అన్నాడనుకోండి! ఎట్లా తెలుస్తుంది, తెలియదు కదా!
       అలాగే కార్యము ఫలించేటంత వరకు నువ్వు జాగ్రత్తగా సహనముతో ఆ కార్యాన్ని పూర్తి చేయాలి. పుట్టావు కదా, చివరిదాకా వెళ్ళాలా వద్దా ! వెళ్ళాలి. సహనము ఓర్పు త్యాగము కరుణ దయ ఇత్యాది లక్షణాలతో వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు మరి అనేక రకాలైనటువంటి అవాంతరాలు వచ్చినట్లు కనబడతాయి. 
       ఏవేవో ప్రణాళికలు బయలుదేరే ముందు ఏం చేశాము... ఇక్కడికి అక్కడికి ఎన్ని గంటలకు వెళ్ళి పోవాలి, ఇక్కడ ఎన్ని గంటలు ఉండాలి, అక్కడ అది చేయాలి, ఇక్కడ ఇది చేయాలి అనుకున్నాము, అలా జరగలేదే. కాబట్టి ఏది జరుగుతోందో అదే సత్యం. అర్థమైందా!
       కాబట్టి దానిని మనం ఈశ్వరానుగ్రహంగా భావించడం స్వీకరించడం రావాలి. స్వీకరించి దానిలో తత్వజ్ఞానాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. తత్వ జ్ఞాన దృష్టితో ప్రారబ్ధాన్ని చూడాలే గానీ, ప్రారబ్ధానుభవంలో ఉన్న సుఖదుఃఖాల దృష్ట్యా చూడకూడదు. కానీ ప్రారబ్ధానుభవంలో ఉన్న సుఖదుఃఖాల దృష్ట్యానే చూస్తాము. 
     ఏమిటండీ! ఈయన ప్లానింగ్ నాకు అర్థం కాదు. టైం కి ఎక్కడ కూర్చోబెట్టాలో తెలియదు, ఎక్కడ కూర్చోవాలో తెలియదు, ఇంత మందిని వేసుకుని బయలుదేరాడు. ఒక పద్థతి ప్రణాళిక ఉండక్కర్లేదా! వేయవచ్చు ప్రణాళికలు ఎన్నయినా వేయవచ్చు. ప్రణాళికలు ఎన్నో వేస్తాము, మూడు నెలల నుంచి ప్రణాళికలు వేస్తూనే ఉన్నాము. ఎన్ని వేసినా కానీ అమలు చేసేటప్పుడు అది నీ చేతిలో లేదు కదా! అనేక అంశాలతో పాటు నీవు కూడా కలిసి పని చేస్తున్నావు. కాబట్టి ఆ అనేక 99 అంశాలంతా ఎవరు? జగత్తు జీవుడు ఈశ్వరుడు అంతేగా. ఏ ఒక్కటి అందులో సహకరించకపోయినా, నీవు అనుకున్న ప్రణాళిక నెరవేరుతుందంటావా! నెరవేరదు కదా! 
      కాబట్టి జగత్తు జీవుడు ఈశ్వరుడు.. ఎప్పుడూ ఏ దిశగా నీకు ఉపయోగపడతున్నాడు. నిన్ను నీకు తెలియజెప్పడానికి ఉపయోగపడతాడు. కానీ మనం ఎందుకు ఉపయోగించుకోవాలి అనుకుంటున్నాము.. నేను అనుకున్న ప్రణాళిక ప్రకారము నీవు ఉండాలి అంటున్నావు. ఎందుకు ఉంటుంది? నీవు అనుకున్న ప్రకారము జగత్తు ఉంటుందా? నీవు అనుకున్న ప్రకారము నీలో ఉన్న జీవుడు వుంటాడంటావా, 
నీవు అనుకున్న ప్రకారం నీలో ఉన్నటువంటి ఈశ్వరుడు ఉన్నాడంటావా... 
వాళ్ళ సృష్టిధర్మం ప్రకారము ఎలా ఉండాలో అలా ఉంటారు.
       మనము ఎప్పటికైనా ఈ పరిణామంలో  సృష్టి ధర్మం అంటే ఏమిటో తెలుసుకోవాలి. సాక్షిగా జీవించడం రావాలి, అన్నింటినీ అధిగమించడం రావాలి. ముఖ్యంగా దొంగలను అనుభవించడం రావాలి. మానవ జీవితం అంతా ద్వంద్వాలే. జననం మరణం, సుఖం దుఃఖం, సృష్టి స్థితి లయం... అన్నీ నీకు అనుభవాన్ని ఇచ్చేవే ఉంటాయి. మరి వాటన్నిటినీ దాటాలి కదా! ఇవి ఏమీ నేను కాదు, వీటన్నిటికీ సాక్షిని, వీటన్నిటికంటే ఆధారంగా ఉన్నా చైతన్యాన్ని అనే దృష్టి కలగాలి కదా! 
       కానీ మనకి ఏ దృష్టి కలుగుతోంది? అని ప్రతిక్షణం చూసుకోవాలి మొట్టమొదట. నేను ఎలా జీవిస్తున్నాను...
శరీరం నేనుగా జీవిస్తున్నానా, 
శరీరానికి ఆధారంగా ఉన్న చైతన్యంగా జీవిస్తున్నానా! ఈ దృష్టి రావాలి ఎప్పటికప్పుడు. వస్తే అప్పుడు ఏమైనది... ఏదైనా అనుభవించినా శరీరం అనుభవిస్తోంది గాని, నేను అనుభవించడం లేదుగా, అని ఉదాసీనంగా ఉండగలిగే లక్షణం వస్తుంది. అప్పుడు ఏమైనది? దుఃఖమూ లేదు, దుఃఖ కారణము లేదు. ఎప్పుడైతే చైతన్య స్థితిలో ఉన్న వాడికి ఏ దుఃఖము ఉండదు.
      కాబట్టి మానవజీవితంలో మూడు లక్ష్యాలు ఉంటాయి. మొట్టమొదటి శోకరాహిత్యం. శోకం లేకుండా జీవించాలి అంటే.. నీవు చైతన్య స్థితిలో జీవిస్తే ఎప్పుడూ శోకం ఉండదు. జీవితంలో ఎప్పటికీ కళ్ళ వెంబడి నీళ్ళు రావలసిన అవసరమే లేదు. బాధ పడే అవకాశమే రాదు. మొదటి స్థానం అది, అక్కడికి రావాలి. 
       ఆ శోక రాహిత్య స్థితి వచ్చిన తర్వాత, చైతన్య స్థితిలో ఉండడం వచ్చిన తర్వాత, నీ జననం నుంచి మరణం దాకా నీ జీవితం ఏ వాసనల యొక్క ప్రభావం చేత జరుపబడుతోందో నీకు దర్శనం అవుతుంది, అనుభవం అవుతుంది. నీ ప్రారబ్దం నీకు తెలియ బడుతుంది. అప్పుడు ఆ వాసనా క్షయం కోసం సాధన చేస్తావు.
[2/10, 12:12] +91 73963 92086: రెండవ మెట్టు వాసన రాహిత్యం.. మొదటి మెట్టు శోకరాహిత్యం. రెండవది వాసన రాహిత్యం. రెండవది సాధన చేయాలి. 
మొదటి దానికి విచారణ చేయాలి. 
చైతన్యం అని తెలుసుకోవాలి అంటే విచారణ చేయాలి. దాని వలన శోకరాహిత్యం వస్తుంది. ప్రశాంతంగా జీవిస్తావు. సాక్షిగా జీవిస్తావు. 
కానీ చాలదు. విషయాలు వస్తేనే పనిచేస్తుంది, విషయాలు లేకపోతే.. మరలా ఏమిచేయాలో అయోమయం వచ్చేస్తుంది. 
అది రాకుండా ఉండాలి అంటే నెక్స్ట్ మెట్టు ఎక్కాలి. 
అది ఏమిటి? సాధన. సాధన ద్వారా వాసనా రాహిత్యాన్ని పొందాలి. అది రెండవ మెట్టు.
అది వస్తే అప్పుడు ఆత్మసాక్షాత్కారం జ్ఞానము వస్తుంది. వాసనలు అనే ముసుగు ఉన్నంతకాలం ఆత్మ సాక్షాత్కార జ్ఞానం రాదు.
       కాబట్టి తప్పక మానవుడు వాసన రాహిత్యాన్ని పొందాలి. దేహ వాసన ఉండకూడదు. శాస్త్ర వాసన ఉండకూడదు, లోక వాసన కూడా ఉండకూడదు. అలా రెండవ మెట్టు అయిన వాసనరాహిత్యం ఎక్కాడనుకోండి... అప్పుడు మూడవ మెట్టు... అది బంధరాహిత్యం. 
ఈ మూడు మానవజన్మకు అత్యంత ముఖ్యం. ఆ మూడవ మెట్టే జీవన్ముక్తి. 
అది బ్రహ్మ జ్ఞానము వలన మాత్రమే సాధ్యమవుతుంది. 
వేరే దాని వలన సాధ్యము కాదు.
సాధన వలన వాసన రాహిత్యం, 
బ్రహ్మ జ్ఞానం వలన బంధ రాహిత్యం వస్తుంది. 
అదే ఆత్మ విచారణ చేస్తే శోక రాహిత్యం వస్తుంది. 
కాబట్టి మూడు తప్పక చేయాలి. ఈ మూడు చేయడం కోసమే, ఈ మూడింటికి అనువైనటువంటి క్షేత్రాలనీ నిర్మాణం చేసుకున్నాము. ఈ మూడింటిలో ఇవన్నీ కలిసి ఉంటాయన్నమాట. 
జాగ్రత్తగా వీటిని పట్టుకోవడం రావాలి.
దేహమే క్షేత్రము, దేహియే క్షేత్రజ్ఞుడు అనే నిర్ణయము రావాలి. 
అప్పుడు దేహమే దేవాలయముగా మారిపోతుంది. 
దేహియే దేవదేవుడుగా మారిపోతాడు.
అప్పుడు నీ కంటే వేరుగా జీవుడు ఉండడు ఇక.
ఈ స్థితికి వచ్చిన వారికి... ఎవరికీ, బంధ రాహిత్య స్థితి వచ్చినవారికి... ఈ మూడు ఎవరైతే పొందుతాడో... వాడికి జీవుడు వేరుగా కనపడడు. ఈశ్వరుడు జీవుడు ఒకటే అనేటటువంటి అభేద స్థితిని పొందుతాడు. 
      ఈ అభేద స్థితినుంచి అప్పుడు నాల్గవ మెట్టు. అది ఆఖరి మెట్టు. కాబట్టి శోకరాహిత్యాన్ని, వాసన రాహిత్యాన్ని, బంధ రాహిత్యాన్ని పొందిన తర్వాతనే జన్మరాహిత్యము... అది ఆఖరి మెట్టు. 
ఆ జన్మరాహిత్యము అనే స్థితికి ఎదగ గలుగుతావు. అది తురీయాతీతము. 
అలా సాధించాలి. 
దాని కోసము భగవంతుడు మనకి అనేక రకాలైన మానవ శక్తులు, మానవాతీత శక్తులను కూడా మనకు ఇచ్చాడు. 
ఈ దేహంలోనే ఉన్నాయి అవన్నీ. 
కానీ వాటిని మనము మేల్కొల్పడం లేదు. ఉపయోగించుకోవడం లేదు. మేలుకుంటే కదా ఉపయోగించేది. కాబట్టి ఒక్కొక్కరూ ఒక్కొక్క సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ... 
ఆ సామర్ధ్యాలను, అయితే శోకమనే స్థితిలో కానీ, లేదంటె వాసనలనే స్థితిలో కానీ, బంధం అనే స్థితిలో కానీ పరిమితింబడి జీవిస్తూ ఉంటాడు. దాట లేదన్నమాట. ప్రతి మానవుడు దాటవచ్చు. చేయలేనిది ఏమున్నది. ఆత్మ విచారణ ఎవరు చేయలేరు? అందరూ చేయగలుగుతారు.
       కాబట్టి మొట్టమొదట అందరూ ఆత్మ విచారణ చేసి శోకరాహిత్యాన్ని పొందాలి. చైతన్య స్థితిలో నిలకడగా ఉండి శోకరాహిత్యాన్ని పొందాలి. 
అప్పుడే నీవు సాధన చేయగలుగుతావు. అప్పుడే అది వాసన క్షయానికి, వాసన రాహిత్యానికి ఉపయోగపడుతుంది. శోకించినంతకాలం సాధన పనికిరాదు, ఉపయోగపడదు వృధా. ఎంతకాలమైతే ఆ దుఃఖము ఉన్నంత కాలము అది వాసన రాహిత్యానికి ఉపయోగపడదు.
        కాబట్టి మొట్టమొదట అందరూ శోక రాహిత్యాన్ని దాటాలి. ఎప్పటికీ జీవితంలో నేను దుఃఖించను. ఒక నిర్ణయానికి వచ్చేయాలి అంతే. ఏమైనా జరగని నేను మాత్రము, నాకు మాత్రము.. దుఃఖము అనే అనుభవమూ లేదు అవసరము లేదు. ఎందుకని అంటే, శోకం ఎందువలన కలుగుతోంది? నేను ప్రపంచాన్ని అనుభవించాలని వచ్చాను. ఆ ప్రపంచము నాకు సుఖాన్ని ఇవ్వడంలేదు. 
శి : మోహం వలన...
గు : అది తర్వాత, మోహం అని చెప్పకూడదు. ప్రపంచాన్ని అనుభవించడం కోసము వచ్చాను., భోగ్యభావన ఉంటుంది. ఈ ప్రపంచం నాకు సుఖాన్ని ఇస్తుంది అనేగా ప్రతి ఒక్కరూ వచ్చేది. ఆ ప్రపంచం సుఖాన్ని ఇవ్వలేదనుకోండి.. దుఃఖం వచ్చేస్తుంది.
శి : జ్ఞానం కోసం దుఃఖ పడినా అది దుఃఖమేనా
గు : అంటే జ్ఞానం రెండు రకాలు... వ్యవహారిక జ్ఞానము ఒకటి, స్వరూప జ్ఞానము ఒకటి.
స్వరూప జ్ఞానము కోసము దుఃఖము అనవు.. తహ.
శి : ఈ రెండు దాటితేనే కదా అది...
గు : బంధరాహిత్యము కోసము వచ్చేటటువంటి గొడవ అది.
మొదట శోకరాహిత్యము దాటాలి.
తరువాత వాసన రాహిత్యాన్ని దాటాలి, అప్పుడు బంధ రాహిత్యం. 
ఎందుకనంటె ఈ రాహిత్య స్థితి రావాలి అంటే, అతీతంగా ఉండాలి.అతీతంగా ఉండకుండా రహితం రాదు.
ముందు శోకానికి అతీతంగా ఉండాలి. అప్పుడు శోకరాహిత్యం వస్తుంది.
తరువాత వాసనలకు అతీతంగా ఉండాలి, వాసన రాహిత్యం వస్తుంది.
తరువాత బంధానికు అతీతంగా ఉండాలి. బంధ రాహిత్యం వస్తుంది.

సశేషం

No comments:

Post a Comment