Wednesday, May 1, 2024

 ఎవరైతే బుద్ధి యోగాన్ని పొందాలని అనుకుంటున్నారో, 
ఎవరైతే సమత్వ బుద్ధిలో ఉండాలనుకుంటున్నారో, 
ఎవరైతే వ్యవసాయాత్మిక బుద్ధిని కలిగి ఉండాలనుకుంటున్నారో, 
ఎవరైతే 'సమత్వం యోగ ఉచ్యతే' అనేటటువంటి యోగాన్ని పొందాలనుకుంటున్నారో, 
ఆ యోగం పొందడం వలన నీకేమిటి ప్రయోజనం? 'గచ్ఛంతి అనామయం.' 
కర్మఫల త్యాగమనే  ఈ యోగాన్ని, 
కర్తృత్వ త్యాగం అనే యోగాన్ని, 
జీవేశ్వర ఐక్యమనే యోగాన్ని, 
జీవబ్రహ్మైక్యమనే యోగాన్ని,
అంతరాత్మ పరమాత్మ అభిన్నమనే యోగాన్ని.. ఎక్కడిదాకా అయినా చెప్పవచ్చు. 
పిండము పిండములోని అహము, 
బ్రహ్మాండము బ్రహ్మాండములోని అహము.. ఇవన్నీ కలిపి ఒకటే ఏకం సత్ బ్రహ్మ అని చెప్పేటటువంటి రాజయోగాన్ని, 
అసలు ఈఎరుకే లేదు ఉన్నది పరబాహ్యం మాత్రమే, అసలు ఇది లేనేలేదు, 
మనసు మాయ ఎరుక ఏ కాలమునందు లేవు, ఏ దేశమునందు లేవు. 
అని చెప్పేటటువంటి పరిపూర్ణ రాజయోగాన్ని... ఇవన్నీ ఈ పునాది నుంచే ప్రారంభం అవుతాయి. ఏ పునాది? ఎవరికైతే కర్మ బంధమని తోచిందో, 
ఎవరికైతే జన్మ బంధమని తోచిందో వాడికి మాత్రమే రాబోయే ఉపదేశాలన్ని. 
ఇవి రెండు ఎవరికైతే తోచినవో అతడే తీవ్ర ముముక్షువు అవుతాడు. 
ఎవరికైనా సరే ఆత్మజ్ఞానం రాలేదు అంటే అతనికి కర్మబంధముగా తోచలేదు. 
జన్మ బంధముగా తోచలేదు. 
ఎందుకు తోచలేదు అంటే, అందులో సుఖాన్ని అనుభవిస్తున్నాడు కాబట్టి...

విద్యాసాగర్ స్వామి 
భగవద్గీత - 24🙏🏻

No comments:

Post a Comment