Sunday, August 11, 2024

*****ఇవి మీకు తెలుస్తుంటే మాత్రం మీరు కచ్చితముగా కొంత వరకు అదృష్టవంతులే.

 🌹గుడ్ మార్నింగ్ 🌹జీవితము చేసే మాయ చూసారా.... కొంతమందికి నిరంతరం జీవించటమే పోరాటం - ఆరాటముగా ఉంటుంది. కనీస జీవన వనరులు ఎప్పుడు వుండవు.వారికి అసలు ఆధ్యాత్మికము, దేముడు ఏమి ఆలోచించే తీరికే ఉండదు.
మరి కొంతమందికి వనరులు సరిపోయి - సరిపోనట్లుగా ఉంటాయి. వీరు సరిపోవేమో అన్న భయముతో నిరంతరం ప్రయత్నించుకుంటూనే వుంటారు. వీరికి దేముడు, ఆధ్యాత్మికము గూర్చి ఆలోచించే తీరిక ఉండదు. మరి కొంతమందికి వనరులు చాలా ఎక్కువగా ఉంటాయి - వాటిని అనుభవించటం,రక్షించుకోవటం, ఇంకా పెంచుకోవటం మీదే ధ్యాస ఉంటుంది.వీరికి దేముడు, ఆధ్యాత్మికత గురించి ఆలోచించే తీరిక ఉండదు. వీరందరికి దేముడు తెలుసు రక్షకుడుగా... ఏదో ఒకటి కావాలని అడుగుతూ దైవాన్ని తలుస్తూ, భావనలో కలుస్తూ వుంటారు. అన్ని రకాల వారికి, అనారోగ్యాలు, ఇతర అనేక సమస్యలు వీటితో కాలం పరిగెడుతూ మరణములో దింపేస్తుంది. ఆట అయిపొయింది. అన్ని స్థితులలో ఎక్కడ, ఎలా వున్నా కొంతమందికి జ్ఞానం అర్ధమవుతుంది. దేముడు దైవత్వమవుతుంది. శరీర అవసరాలతో పాటు అంతరంగ జ్ఞానం కూడా అర్ధమవుతూ ఉంటుంది.తమను తాము గమనించుకోవటము తెలుస్తుంది. అయినా ఆ జ్ఞానములో నిలబడటం చాలా కష్టము. శరీర - అంతరంగ జ్ఞాన సమన్వయం కుదరదు. మీకు జ్ఞానం అర్ధమవుతుంటే మాత్రం వదలకండి. లక్షమందిలో 10 మందికి మాత్రమే అర్ధమవుతుంది. మిగిలిన వారందరికి దేముడు - దేవత తెలుసు. దైవత్వము - ఆత్మ తత్త్వము - అనంతత్వము - అంతరంగ తత్త్వము తెలియవు. ఇవి మీకు తెలుస్తుంటే మాత్రం మీరు కచ్చితముగా కొంత వరకు అదృష్టవంతులే. కాబట్టి ఆధ్యాత్మిక, ఆత్మ జ్ఞాన చదువు అర్ధమవుతున్న వాళ్ళు వదలకండి. ఎందుకంటే లక్షమందిలో 10 మంది మీరు. 🌹god bless you 🌹

No comments:

Post a Comment