Friday, November 1, 2024

 *భగవంతుడు మనల్ని బుజ్జగిస్తూ, లాలిస్తూ   అహాన్ని వదలివేయమని బోధిస్తున్నాడు.*

*పసివానివలె నిష్కపటంగా, సూటిగా ఉండటం మంచి పద్ధతి.*

*మహానుభావులందరిలో       ఈ సరళత్వం, సూటిదనం కనిపిస్తుంది.                          ఇది భగవంతుని కృప వలన కలుగుతుంది.* 

*ఎల్లప్పుడూ సరియైన త్రోవలో ప్రయాణించడమే మంచిది. గణాంకాలు, విశ్లేషణలు మనస్సుని అయోమయంలో  పడవేస్తాయి.*

*మనలో పవిత్రభావనలు ఉన్నప్పుడు నిష్కపటంగా, పసిబిడ్డవలె, నిస్వార్థంగా వ్యవహరిస్తాం.*
అలాగే,
*ఒక సాధారణ వ్యక్తి తన అహాన్ని బాహాటంగా ప్రదర్శిస్తాడు.* 

*మహాత్ములైనవారు భగవంతుని ఆదేశాలను తాము నెరవేరుస్తున్నామనే భావనతో కర్తృత్వాన్ని వదలి వ్యవహరిస్తారు.*

జీవితంలో ఉన్నత విషయాలను నేర్చుకునేందుకు ఉత్సుకతను చూపాలి. ఆధ్యాత్మికతను స్వభావంగా మార్చుకునే కృషిని సల్పాలి.

ఈ విధంగా చేయడం ద్వారా మనలోని భయాలు, బాధలు, నిస్పృహలు కొంత వరకు తగ్గుముఖం పడతాయి.

ఒక సాధారణ వ్యక్తిలో ద్వంద్వాలైన మంచి చెడులు, సుఖదుఃఖాలు మనస్సులో సదా తిరుగాడుతూ ఉంటాయి.
అయితే దాని వలన ప్రయోజనం లేదు.

జీవనం ఒక లయలో సాగుతుందని గ్రహించగలిగినప్పుడే స్థిర్తత్వం ఏర్పడుతుంది.  అప్పుడే ‘అహం’ వలన బాధలు తొలగి సమతుల్యత ఏర్పడుతుంది.    

No comments:

Post a Comment