*ధ్యాన మార్గ*
16,17 సంవత్సరాల వయస్సులో రమణ మహర్షికి తాను చనిపోతున్నట్లు తెలిసింది. ఆయన భయపడ్డాడు. ఇంటికొచ్చి నేలపై పడుకొని నేను చచ్చిపోతున్నాను, నేను చచ్చిపోతున్నాను అని మొత్తం చనిపోయే విధానాన్ని అంతా ఒక్కసారి చేసిచూశాడు.
అవును ఇప్పుడే చచ్చిపోతున్నాను. నేను
చచ్చిపోయానన్న అనుభవం కూడా కల్గింది. అప్పుడు తెలుసుకున్నాడు. దీనినంతా 'నేను' చూస్తున్నాను అని. మరణాన్ని చూస్తున్న 'నేను ఎప్పటికీ ఉండనే ఉంటుంది. అది నా నిజస్థితి. అన్న ఆ అనుభవం ఆయనకు ఆది
అంతంగా మిగిలింది. గతంలో ఉన్నతమైన ఆధ్యాత్మిక అభివృద్ధి కలిగివున్న
కారణంగా మంచి వాసనలు, సంస్కారములు ఉండడం వల్ల చాలా చిన్న వయస్సులోనే ఆయన ఆత్మానుభూతిని పొందగలిగారు. అది తెలుసుకొని ఇప్పటి నుండి మనం సాధన మొదలు పెట్టగలిగితే మనకు చాలా మేలు కలుగుతుంది. “తస్మాత్ ఏవమ్ విదిత్వా ఏనమ్ న అనుశోచితుమ్ అర్హసి' ఇది తెలుసుకున్న నీవు, దుఃఖం, బాధ కలిగి వుండడం తగినది కాదు.
🎋🌱🌴
సహజంగా పిల్లలు ఉద్రేకులయి ఉంటారు. చిన్న వయస్సులో అది ఏమీ ప్రమాదం కాదు కానీ, అదేవిధంగా పెరిగి పెద్దవారవ
కూడదు. ఆ వయస్సు నుంచే కొంచెం ప్రశాంతతను నేర్చుకోమని చెప్పాలి.
అప్పుడే వారు తమ మనస్సును అదుపులో పెట్టుకోవడం నేర్చుకుంటారు.
మనం అదుపులో పెట్టవలసింది ప్రపంచాన్ని కాదు. బయట నుంచి ఎవరైనా వచ్చి
నిన్ను వెధవ అని తిట్టగానే నీవు చాలా కృంగిపోవడమో, రెచ్చిపోవడమో
చేస్తుంటావు. వాడు తిట్టి వెళ్ళిపోయినా నీవు అదే ఆలోచిస్తూ ఉంటావు.
అమెరికన్ ఒకరు, “నీ బుద్ధిని తీసుకొని వెళ్ళి ఇతరుల జేబులో పెట్టడం, నీవు
చేస్తున్న పెద్ద తెలివితక్కువ పని' అంటారు. దానిని నీ జేబులోనే పెట్టుకోవడం
నేర్చుకో, నిబ్బరం ఉన్నప్పుడు ఎటువంటి పరిస్థితినయినా తట్టుకోగలుగుతావు.
నిబ్బరంలో, నిశ్చలంగా ఉంటావు. మనస్సుకు ప్రశాంతత లేకుంటే సమతుల్యంగా ఉండలేవు. నీవు గొప్ప వ్యక్తిని కావాలనుకున్నట్లయితే నీవు
వీటినన్నిటినీ సాధించాలి. మనస్సు'ని అదుపులో పెట్టుకో. మనం ఇతర
యంత్రాలను అదుపులో పెట్టుకోగలుగుతాం కానీ, మన మనస్సుని అదుపులో
పెట్టుకోలేం. మనస్సు గొప్ప పరికరం, దానిని మనం ఎప్పుడూ అదుపులో
పెట్టలేదు. దాని ఇష్టమొచ్చినట్లు అది ప్రవర్తిస్తుంటుంది. పరికరాలను సరిచేసే
పరికరం మనస్సు. గీత ఇంద్రియాలను, మనస్సును రెండిటినీ అదుపులో
పెట్టుకోమని చెబుతుంది. అప్పుడు నీ జీవితంలో గొప్ప అద్భుతం జరుగు
తుంది. మొదట 'యోగం' వల్ల సమతుల్యం అంతా వస్తుంది అని చెప్పబడింది.
No comments:
Post a Comment