Wednesday, December 25, 2024

****తర్కవాదాల గుణం.... 'విముక్తి' కావాలా...?

 🙏 *రమణోదయం* 🙏

*నిజాన్ని కప్పి పుచ్చటమే తర్కవాదాల గుణం. అసలు తర్కమే కల్పితం కాబట్టి, బుద్ధిని అది కలచి వేస్తుంది. అటువంటి తర్క బుద్ధి అనే గోతిలో పడ్డవారు ఆత్మజ్ఞాన సూర్యుని కనలేరు.*

 *భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.524)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి 
🪷🪷🦚🦚🪷🪷
 *స్మరణ మాత్రముననె పరముక్తి ఫలద* |
 *కరుణామృత జలధి యరుణాచలమిది*|| 
            
🌹🌹🙏🙏 🌹🌹

 'విముక్తి' కావాలా...?

'విముక్తి' కావాలంటే 'మూల్యం' చెల్లించుకోవాలి మరి.

దాని 'మూల్యం' ఏంటంటే..
అన్నింటినీ వదిలేయడం మరియు
ఆ సర్వోన్నత శక్తికి లొంగిపోవడం.
అంతా బాగుందన్న 'సంపూర్ణ విశ్వాసం' కలిగివుండటం.

ప్రతీది 'సరియైనది' గానే వుందనీ..
ప్రతీది 'వుండాల్సిన' విధంగానే వుందని 
గ్రహించాలి.

దేనిని :తప్పు' పట్టొద్దు.
దేని గురించి 'తీర్పు' చెప్పొద్దు.

తప్పులు లేవు. ఒప్పులు లేవు.
ఉన్నవి ఉన్నట్లు గానే వున్నాయి.
వుండాల్సిన విధంగానే ఉన్నాయి.

ఇదే 'ముక్తి'కి మార్గం...

నిజానికి ఈ శరీరమే దుఃఖాలయం.
దీనిని  ఆత్మ విచారణ చేత
పరమానందలయంగా చేసుకోవచ్చు!

🌹🙏 ఓమ్ నమో భగవతే శ్రీ రమణాయ!🙏🌹

No comments:

Post a Comment