ఒకసారి సముద్రుడికి పెద్ద సందేహం వచ్చింది. గంగానదిని అడిగాడు, నువ్వు నా దగ్గరకు పెద్ద పెద్ద చెట్లను మొసుకొస్తుంటావు కదా, గడ్డి పరకల్ని ఎందుకు తీసుకురావు అని. అప్పుడు గంగానది ఇలా సమాధానం చెప్పింది. చెట్లు వంగవు. అవి కఠినంగా ఉంటాయి. అందుకే వాటిని వేళ్ళతో సహా పెళ్ళగిస్తూ ఉంటాను. గడ్డిపరకలు వేరు. వాటికి ఆణుకువ తెలుసు. నేను మహోధృతంగా ప్రవహిస్తున్నప్పుడు నా వేగానికి, బలానికీ అవి వినయంగా తలవంచుతాయి. అప్పుడు నా వేగమూ, శక్తీ ఓడిపోతాయి. నా వరద తగ్గిన వెంటనే గడ్డిపరకలు మళ్ళీ తలెత్తుతాయి.అలాగే ఇతరులతో సర్దుకోవడం చేతకాక అహంకారంతో, అతిశయంతో మిడిసిపడేవారు తమకంటే బలమైన శక్తులకు ఓడిపోయి నశిస్తారు. వినయంతో, ఇతరులతో సామరస్యభావనతో జీవించేవారు ఎటువంటి ప్రతికూల పరిస్థితులనైనా తట్టుకుంటూ పదికాలాల పాటు జీవిస్తారని చెబుతుంది మహాభారతంలోని ఈ ఉదాహరణ…🕉️🚩
No comments:
Post a Comment