*_నేటి విశేషం_*
*సఫల ఏకాదశి*
మార్గశిర మాసములో వచ్చే విశిష్టమైన తిథి మార్గశిర కృష్ణ ఏకాదశి.
ఈ సఫల ఏకాదశి రోజున దీపదానం చేస్తే జీవితంలో విశేషమైన ఫలితాలు కలుగుతాయి.
ఇంకా సఫల ఏకాదశి రోజున జాగరణ చేసి ఆలయాల్లో దీపాలను వెలిగిస్తే ఐదువేల సంవత్సరాలు తపస్సు చేసిన ఫలితం దక్కుతుంది, దీనికి సమానమైన యజ్ఞం కానీ, తీర్థం కానీ లేదు.
_సఫల ఏకాదశి పవిత్రను చాటిచెప్పే కథను కూడా శ్రీకృష్ణుడు పాండవులకు చెప్పినట్లు పురాణాలు చెప్తున్నాయి_.
పూర్వము చంపావతి రాజ్యమును మహిష్మంతుడు అనే రాజు పాలిచేవాడు, అతనికి లుంభకుడు అనే కుమారుడుండేవాడు, లుంభకుడు అధర్మ వర్తనుడై జీవిస్తుడడంతో కుమారుడని చూడకనే రాజు వానిని రాజ్య బహిష్కరణ శిక్ష విధించెను.
లుంభకుడు అడవుల పాలై ఆహారము దొరకక, తన పరిస్థితికి పశ్చాత్తాప పడుతూ మర్రిచెట్టు వద్ద రాత్రంతా గడిపి ఏమీ తినకుండా చింతిస్తూ సృహ తప్పి పడిపోయాడు.
ఆనాడు ఏకాదశి ఆహారం లభించక ఉపవాసమును అప్రయత్నముగా పాటించడంతో శ్రీహరి ప్రత్యక్షమై రాజ్యాన్ని ప్రసాదిన్చినట్లు పురాణాలు చెప్తున్నాయి.
లుంభకుడు సక్రమమైన పరిపాలన చేసి మరణాంతరము వైకుంఠానికి చేరుకున్నాడని పురాణ కథనం.
ఈ ఏకాదశి వ్రత మహత్యాన్ని పరమ శివుడు స్వయముగా పార్వతికి చెప్పినట్లు పద్మ పురాణం చెబుతోంది.
అందుకే ఈ రోజున తెలిసి కానీ తెలియక కానీ ఉపవాస దీక్షను చేస్తే పుణ్య లోకాలను పొందుతారు.
వైకుంఠ ప్రాప్తి, ఐశ్వర్యాలు కలుగుతాయని శ్రీకృష్ణుడు పాండవులతో చెప్పినట్లు కథలున్నాయి.
పరమపావనమైన ఈ రోజున ఇంటిలో లక్ష్మినారాయణులను భక్తితో పూజించి, పాలను నైవేద్యంగా ఉంచి, విష్ణు సహస్రనామములను, విష్ణు అష్టోత్తరములను పారాయణ చేసి, పాలు, పండ్ల వంటి సాత్వికాహారం తీసుకొని ఉపవాసం ఉండాలి.
దగ్గర్లోని వైష్ణ్వవాలయాన్ని సందర్శించండి, మరియు ఈ రోజున నిత్య పూజ, ఉపవాసాది కార్యక్రమములను చేయడం ద్వారా విశేషమైన సిరిసంపదలు కలుగుతాయి, సమస్త పాపముల నుండి విడివడి వైకుంఠ ప్రాప్తిని పొందుతారు.
ఈ ఏకాదశిని విష్ణుప్రీతిగా భక్తి, శ్రద్ధలతో చేయడం రాజసూయయాగం చేసిన దానితో సమానం.
అంతేకాక విశేషంగా సిరిసంపదలను పొందుతారని శ్రీకృష్ణపరమాత్మ ధర్మరాజుకి బోధించారు.
“పక్షులలో గరుత్మంతుడు, శేషులలో ఆదిశేషుడు, నదులలో గంగ, దేవతలలో విష్ణుభగవాణుడు, మనుషులలో బ్రాహ్మణుడు, యజ్ఞాలలో అశ్వమేధయాగం, అయితే ఎలా గొప్పవారో అలాగే ఉపవాసాలన్నింటిలో ఏకాదశి ఉపవాసం అంత గొప్పది” - బ్రహ్మ వైవత్తర పురాణం.
🍀 చేయవలసినవి 🍀
🍀- దగ్గరలోనున్న వైష్ణవ ఆలయాన్ని సందర్శిస్తే విశేషంగా విష్ణు భగవానుడి అనుగ్రహం పొందుతారు.
🍀- రోజంతా కృష్ణ, మాధవ, గోవింద అని హరినామాన్ని జపించండి.
🍀- మద్యపానం మాంసాహారం వంటి పాపకర్మలకు దూరంగా ఉండండి.
🍀ఏకాదశి రోజున ధాన్యంతో(బియ్యం, గోధుమ, బార్లే వంటివి) చేసిన ఆహారం నిషిద్ధము కావున పాలు, పండ్లు వంటి సాత్వికమైన ఆహారం స్వీకరించవచ్చు.
🍀-శక్తి కొలది దాన, ధర్మాదులు, జప, తపాదులు చేయడం మంచి ఫలితాన్నిస్తుంది.
*_హరినామ స్మరణం - సమస్తపాపహరణం_*
*_🥀శుభమస్తు🥀_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏.
No comments:
Post a Comment