Tuesday, December 31, 2024

**** *ధ్యాన 😌మార్గ*. ప్రేమ మూడు రకాలుగా ఉంటుంది...

 *ధ్యాన 😌మార్గ*
ప్రేమ మూడు రకాలుగా ఉంటుంది: నిస్వార్థం (సమర్థ), పరస్పరం (సమంజస), మరియు సాధారణ లేదా స్వార్థం (సాధారణ). నిస్వార్థమైన ప్రేమ అత్యున్నతమైనది. నిస్వార్థమైన ప్రేమికుడు ప్రియమైనవారి సంక్షేమాన్ని మాత్రమే కోరుకుంటాడు మరియు పర్యవసానంగా అతను నొప్పి మరియు కష్టాలను అనుభవిస్తున్నప్పటికీ పట్టించుకోడు. రెండవ రకమైన ప్రేమ పరస్పర ప్రేమ, ఇందులో ప్రేమికుడు తన ప్రియమైన వ్యక్తి యొక్క ఆనందాన్ని మాత్రమే కాకుండా, తన స్వంత ఆనందాన్ని కూడా కోరుకుంటాడు. స్వార్థపూరితమైన ప్రేమ అతి తక్కువ. ఇది మనిషిని తన స్వంత సంతోషాన్ని మాత్రమే చూసుకునేలా చేస్తుంది.
❤️🕉️❤️
నీవే స్త్రీవి, నీవే పురుషుడివి, నీవే బాలికవు, నీవే బాలుడవు. నీవే కర్ర
పుచ్చుకున్న ముదుసలివి, ఇప్పుడే పుట్టిన శిశువివి నీవే. లక్ష విధాలుగా నీవు
విశ్వంలో కానవస్తున్నావు. 
ముండక ఉపనిషత్తులో ఉన్నతమయిన ఆధ్యాత్మిక భావంతో బయటకు చూసినంతనే, అంతటా బ్రహ్మను చూశాడు. 'ఆనందరూపం అమృతం యల్ విభాతి' అనంతమైన ఆనంద రూపం, అమృత రూపం, చుట్టూ ఉన్న ప్రపంచమంతా వ్యాపించి ఉంది అన్నాడు.
❤️🕉️❤️
ఏ ఘనకార్యాన్ని మోసంతో సాధించలేం. అప్రతిహతమైన శక్తి ద్వారా మాత్రమే సమస్త కార్యాలు సాధించబడతాయి. కాబట్టి ధీరత్వాన్ని ప్రదర్శించండి.
- Swami Vivekananda

ఎక్కువ తప్పులు చేసినవారు అధములు,
వారు నా వద్దకు రాలేరు. ఎల్లప్పుడూ వారు ఇంకా, ఇంకా చెడ్డ పనులు చేయడానికి యోచిస్తారు. మాయచే జ్ఞానం, అర్థం చేసుకునే గుణం పూర్తిగా వారి నుంచి అపహరించ బడింది. వారి యందు రాక్షస గుణాలు చోటుచేసుకొని వారికి రాక్షస స్వభావం అలవడింది. - వారు ఒకరకం మనుష్యులు వారు నన్ను పూజించరు.
       --భగవద్గీత.    

No comments:

Post a Comment