*క్షేత్రార్వాణం*
అర్వాణం అంటే యోగ్యమైనది, తగినది, లాభదాయకమైనది. అని అర్ధం చెప్పవచ్చు. క్షేత్రార్వాణం అంటే నిర్మాణాలకు అనుకూలమైన క్షేత్రాన్ని యజమాని యొక్క వర్గుణకు లేదా నామరాశికి అశుభ ఫలితాలను ఇచ్చే దిక్కులను ఎన్నుకోవాలి.
శ్లో:- క్షేత్రస్యాకచటాః క్రమాతపయశా వర్గాస్స్యురష్టౌ స్ధితాః
ప్రాగాదౌఖగరాడ్బిడాల మృగరాట్చ్వహ్యాఖునాగశ్శశః
స్యాద్వర్గాద్యది పంచామోరి రధదిగ్వర్గేషు యోని స్త్రీయమ్
దౌదౌదిక్షు విదిక్షు చైక మఖిలం మేషాది పూర్వాదితః
గృహం నిర్మించే భూమికి తూర్పు మొదలు ఈశాన్యం వరకు అ, క, చ, త, త, ప, య, శ అను ఎనిమిది ప్రధామాక్షర వర్గులగను వీటికి ఇంద్ర, అగ్ని, యమ, నైరుతి, వరుణ, వాయువ్య, కుబేర, ఈశాన్య అష్టదిక్పాలకులు వర్గాధిపతులగును. గరుడ, మార్జాలం, సింహం, శునకం, సర్పం, మూషికం, గజం, శశములు వర్గ జంతువులుగాను ఏర్పడినవి.
మాయామతం ఆధారంగా క్షేత్రాన్ని తూర్పు కొలతగా 9 సమభాగాలుగా చేసి అందు ఈశాన్యం 2 భాగాలు, ఆగ్నేయం 2 భాగాలు, వదలగా మధ్యగల ఐదు భాగాలు తూర్పు అవుతుంది. అదేవిధంగా దక్షిణ దిశను 9 భాగాలుగా చేసి అందు 2 భాగాలు ఆగ్నేయం, 2 భాగాలు నైరుతి వదలగా మిగిలిన 5 భాగాలు దక్షిణ దిశ అవుతుంది. పశ్చిమ దిశను 9 భాగాలుగా చేసి అందు 2 భాగాలు నైరుతికి, 2 భాగాలు వాయువ్యానికి వదలగా మిగిలిన 5 భాగాలు పడమర దిశ అవుతుంది. ఉత్తర దిశను 9 భాగాలుగా చేసి అందులో 2 భాగాలు వాయువ్యానికి, 2 భాగాలు ఈశాన్యానికి వదలగా మిగిలిన 5 భాగాలు ఉత్తరమవుతుంది.
"స్వవర్గాత్ పంచ మోలిపః రిపు వర్గం పరిత్యజ్య శేష వర్గా శ్శుభ ప్రధాః" అనే శ్లోక ప్రమాణాన్ని అనుసరించి
గృహ యజమాని యొక్క నామ ప్రధామాక్షరము ఈ వర్గునందు ఉండునో, ఆ వర్గునకు పంచమ స్ధానం అనగా ఐదవ స్ధానం శత్రు వర్గు అగును. కావున ఆ శత్రు వర్గు గల స్ధానం వదలి గృహ నిర్మాణం చేయవలెను.
“అ” వర్గు వారికి తూర్పు స్వవర్గు అవుతుంది. పశ్చిమం శత్రు వర్గు అవుతుంది.
“క” వర్గు వారికి ఆగ్నేయం స్వవర్గు అవుతుంది. వాయువ్యం శత్రు వర్గు అవుతుంది.
“చ” వర్గు వారికి దక్షిణం స్వవర్గు అవుతుంది. ఉత్తరం శత్రు వర్గు అవుతుంది.
“ట” వర్గు వారికి నైరుతి స్వవర్గు అవుతుంది. ఈశాన్యం శత్రు వర్గు అవుతుంది.
“త” వర్గు వారికి పశ్చిమం స్వవర్గు అవుతుంది. తూర్పు శత్రు వర్గు అవుతుంది.
“ప” వర్గు వారికి వాయువ్యం స్వవర్గు అవుతుంది. ఆగ్నేయం శత్రు వర్గు అవుతుంది.
“య” వర్గు వారికి ఉత్తరం స్వవర్గు అవుతుంది. దక్షిణం శత్రు వర్గు అవుతుంది.
“శ” వర్గు వారికి ఈశాన్యం స్వవర్గు అవుతుంది. నైఋతి శత్రు వర్గు అవుతుంది.
శ్లో:- స్వవర్గే ధనలాభంచ ద్వితీయం తరవీసకం
తృతీయం వీసమీత్యాహూః చతుర్ధే వ్యాధి పీడన
పంచమంతురి పుస్ధానం షష్ఠంతు కలహ ప్రదం
సప్తమం సర్వ సౌభాగ్యం అష్టమం మరణధ్రవం
అను ప్రమాణాన్ని అనుసరించి వర్గుల ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి.
స్వవర్గు ధనలాభాన్ని కలిగిస్తుంది.
ద్వితీయం స్వల్ప లాభాన్ని కలిగిస్తుంది.
తృతీయం శుభప్రదాన్ని కలిగిస్తుంది.
చతుర్ధం వ్యాధులను కలిగిస్తుంది.
పంచమం శత్రు క్షేత్రం అవుతుంది.
షష్ఠమం కలహ ప్రదం (మతాంతరంలో లక్ష్మీ ప్రదం)
సప్తమం సర్వ సౌభాగ్యాన్ని కలిగిస్తుంది.
అష్టమం మరణ ప్రదాన్ని కలిగిస్తుంది.
గృహ నిర్మాణం చేయదలచిన క్షేత్రం ఏ రాశి అవుతుందో చూసి గృహ యజమాని నామరాశికి గృహరాశి 1,5,9 స్ధానాలలో ఉంటే శుభప్రదం, 3,7,11 స్ధానాలలో ఉంటే ప్రశస్ధాలు కావు. 4,8,12 స్ధానాలలో ఉంటే చెడ్డవి, 2,6,10 స్ధానాలలో ఉంటే మంచివి కావు.
ఉదా:- రాజశేఖర్ అనే వ్యక్తికి వర్గురీత్యా “ర” అనే అక్షరం “య” వర్గులో ఉండటం వలన ఉత్తర దిక్కు ఈ పేరుకు స్వవర్గు అవుతుంది.
స్వవర్గు – ఉత్తరం
తృతీయ వర్గు -తూర్పు
షష్ఠమ వర్గు – నైరుతి
సప్తమ వర్గు - వాయువ్య వర్గులు పనికి వస్తాయి.
పంచమ వర్గు అయిన దక్షిణం శత్రు వర్గు అవుతుంది.
రాజశేఖర్ పేరు మీద నక్షత్రం చిత్త నక్షత్రం తులారాశి అవుతుంది. రాజశేఖర్ అనే వ్యక్తికి ఈశాన్య దిక్కున ఉన్న క్షేత్రం పనికి వస్తుందో లేదో గమనించాలి అంటే ముందుగా ఈశాన్య దిక్కు మీనరాశిని తెలియజేస్తుంది. పేరు మీద తులా రాశిని తెలియజేస్తుంది తులారాశి నుండి మీనరాశి షష్ఠమ స్ధానం అవుతుంది కాబట్టి 2,6,10 స్ధానాలు మంచివి కావు కాబట్టి రాజశేఖర్ అనే వ్యక్తికి ఈశాన్య దిక్కు మంచిది కాదు.
1, 5, 9 లలో 1 వది అయిన అయిన తులారాశి పశ్చిమ దిక్కు.
5 వది అయిన కుంభరాశి ఉత్తర దిక్కు.
9 వది అయిన మిధునరాశి ఆగ్నేయ దిక్కు . రాజశేఖర్ అనే వ్యక్తికి పనికి వస్తాయి. ఈ విధంగా ఎవరికి వారు తమ నామ ప్రధామాక్షరాన్ని బట్టి క్షేత్రార్వాణం చేసుకోవాలి. ✍️నామనసిధ్ధాంతి:
No comments:
Post a Comment