Thursday, December 26, 2024

 *మౌనానికి ముగింపులా* 
*ధ్యానంలో అనుభూతిలా* 
*గమనంలో గమ్యంలా* 
*పయనంలొ ప్రచోదనంలా* 

*నిర్ణయమేదో తీసుకునేలా* 
*విజయమేదో దొరికేసేలా* 
*విలువలన్నీ మారేలా* 
*కలలన్ని కనుల ముందు..*

*రారమ్మని పిలుస్తున్నట్టూ* 
*సందేహం వద్దన్నట్టూ* 
*సఫలత చెందావంటూ* 
*స్వాగతాలు నీకంటూ..*

*అన్వేషణ అంతమై*
*అమృత క్షణాలేవో* 
*ఆనందం నింపుకుని*
*అరచేత వాలినట్టూ..*

*వడి పెరిగిన అడుగులన్నీ* 
*వెన్నెల మడుగులైనట్టూ..*
*జడిగా కురిసిన హిమమంతా* 
*వెన్నలా కరుగుతున్నట్టూ..*

*కనుచూపుకు అందేలా* 
*పెను వెలుగుల పంటేదో* 
*మును ముందే వచ్చి నిలిచి* 
*వినువీధికి మనసెగిరేలా*

*వేడుక తెచ్చే వేకువకు*

*🌹🕉️🌹సుప్రభాతం🌹🕉️🌹*

No comments:

Post a Comment