Wednesday, December 11, 2024

 🪷 *ధ్యాన రహస్యాలు*🪷

*ఏం చెప్పాడు శ్రీకృష్ణుడు?*

🦚🦚🦚🦚🦚🦚

1️⃣ *క్షుద్రం హృదయ  దౌర్భల్యం* - హృదయ దౌర్భల్యం తుచ్ఛమైనది.

2️⃣ *గతాసూన్ అగతాసూంశ్చ నానుశోచంతి పండితాః* - చనిపోయిన వారిని గురించి కానీ, జీవించి వున్న వారి గురించి కానీ పండితులు శోకించరు.

3️⃣ *అహమాత్మా గుడాకేశ* - *నేను* అనేది *ఆత్మ* అని తెలుసుకో, ఓ అర్జునా ! 

4️⃣ *న హన్యతే హన్యమానే శరీరే* - శరీరం చంపబడితే ఆత్మ చంపబడదు.

5️⃣ *యోగో భవతి దుఃఖహా* - ధ్యానయోగాభ్యాసం వల్లనే దుఃఖం హరిస్తుంది.

6️⃣ *సమత్వం యోగ ఉచ్యతే* - అన్ని పరిస్థితులలోనూ సమంగా  వుండడమే యోగం అనిపించుకుంటుంది.

7️⃣ *శ్రద్ధావాన్ లభతే జ్ఞానం* - శ్రద్ధ కలిగినవాడికే జ్ఞానం లభిస్తుంది.

8️⃣ *జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం* - ఆత్మజ్ఞానం అనే అగ్నిలో కర్మలు దగ్ధమవుతాయి.

9️⃣ *బుద్ధి నాశాత్ ప్రణశ్యతి* - బుద్ధి లేకపోవడమే ఆత్మ వినాశనం

1️⃣0️⃣ *కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన* - కర్మలు చెయ్యడానికే అధికారం వుంది కానీ వాటి ఫలితాలపైన ఎప్పటికీ లేదు.

1️⃣1️⃣ *కర్మ జ్యాయో  హ్యకర్మణః*  - కర్మలు తక్కువ చెయ్యడం కంటే కర్మలు ఎక్కువ చెయ్యడమే మంచిది.

1️⃣2️⃣ *యోగః కర్మసు కౌశలమ్* - ధ్యానయోగం ద్వారానే కర్మల్లో కౌశలం వస్తుంది.

1️⃣3️⃣ *యోగస్థః కురు కర్మాణి* - యోగస్థితిలో వుండే కర్మలను చెయ్యాలి.

1️⃣4️⃣ *తస్మాత్ యోగీ భవార్జున* - కనుక ధ్యానయోగివి కా, అర్జునా !

1️⃣5️⃣ *నిస్ర్తైగుణ్యో భవార్జున* - త్రిగుణాలకు అతీతుడవు కా, అర్జునా !

1️⃣6️⃣ *ఉద్ధరేదాత్మనాత్మానం* - ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి.

1️⃣7️⃣ *హతో  వా  ప్రాప్యసి స్వర్గం* - చనిపోయాక స్వర్గాన్ని పొందుతావు.

1️⃣8️⃣ *యుద్థ్యస్వ  విగత జ్వరః* - ఎంతమాత్రం ఆవేశం లేకుండా యుద్ధం చెయ్యి.

1️⃣9️⃣ *యథేచ్చసి తథాకురు* - నీకు నచ్చినట్టు నువ్వు చెయ్యి.

  🪷🙏🏻🪷🙏🏻🪷

No comments:

Post a Comment