Sunday, December 15, 2024

 🍀🌺🍀🌺
*కొన్ని …*

          *పెళ్లి మంత్రాలు - అర్థాలు*
                     ➖➖➖✍️
      

*1. కన్యాదానం సమయంలో...*     

*కన్యాం కనక సంపన్నాం* *కనకాభరణైర్యుతామ్!*
*దాస్వామి విష్ణవే తుభ్యం*
*బ్రహ్మలోక జిగీషయా!!*
```
బ్రహ్మలోక ప్రాప్తికోసం నేను సువర్ణ సంపద గల, స్వర్ణాభరణ భూషిత అయిన ఈ కన్యను లక్ష్మీనారాయణ స్వరూపుడివైన నీకు దానం చేయబోతున్నాను.```


*2. సుముహూర్తంలో...*```
(జీలకర్ర బెల్లం పెట్టే సమయం)```

*అస్య ముహూర్తస్య సుతిథిం సువారం*
*సునక్షత్రం సు యోగం సుకరణం*
*సుచంద్ర తారాబలం అనుకూలం*
*శుభశోభనాస్సర్వేగ్రహః సునక్ష త్రాః శుభై కాదశస్థాన ఫలదాః సుప్రీతాః సుముహూర్తాః సుప్రసన్నా వరదాః భవంతు*```

ఈ ముహూర్తమునకు మంచి తిథిని మంచి వారమును మంచి నక్షత్రమును మంచి యోగమును మంచి కరణమును మంచి చంద్రతారాబలమును అనుకూలముగా చేసి శుభములు శోభనములునయి అన్ని గ్రహములును ఫలము నిచ్చునవై మంచి ప్రీతి గలవై సుముహూర్తములు గలవై సుప్రసన్నతగలవై వరములనిచ్చునవై అవుగాక.```


*3.మాంగల్య ధారణలో...*

*మాంగల్యం తంతునానేన మమ జీవన హేతునా!*
*కంఠే బధ్నామి సుభగే! త్వంజీవ శరదాం శతమ్!!*
```
నా సుఖ జీవనానికి హేతువైన ఈ సూత్రంతో మాంగల్యాన్ని నీ మెడలో కడుతున్నాను. నీవు నూరేళ్లు వర్ధిల్లు!
```

*4. వధువు వరునితో ఏడడుగులు వేసే ముందు ...*
```
సప్తపది జరిగిన తర్వాత వధువు గోత్రం వరుని గోత్రంగా మారిపోతుంది. తన వెంట ఏడడుగులు నడిచే వధువుని ఉద్దేశించి వరుడు జపించే మంత్రాలివి…```


*ఏకమిషే విష్ణుస్తా వన్వేతు, ద్వే ఊర్ఙే విష్ణుస్త్వా న్వేతు.*
*మయో భవాయ విష్ణుస్త్వా న్వేతు. త్రీణి వ్రతాయ విష్ణుస్త్వా నేతు. చత్వారి*
*మయో భవాయ విష్ణుస్త్వా న్వేతు.              పంచ పశుభ్యో విష్ణుస్త్వా న్వేతు.            షడృతుభ్యో విష్ణుస్త్వా న్వేతు.                           సప్త హోత్రాభ్యో విష్ణుస్త్వా న్వేతు*
```
ఓ చిన్నదానా! నీవు నా వెంట నడు. విష్ణుమూర్తి నీవు వేసే మొదటి అడగువల్ల అన్నాన్ని, రెండవ అడుగువల్ల బలాన్ని, మూడో అడుగువల్ల మంచి కార్యాలను, నాల్గో అడుగువల్ల సౌఖ్యాన్ని, ఐదో అడుగువల్ల పశుసమృద్ధిని, ఆరో అడుగువల్ల ఋతు సంపదలను, ఏడో అడుగువల్ల ఏడుగురు హోతలను నీకు అనుగ్రహించుగాక.```

*సఖా సప్తపదా భవ. సఖాయౌ                  సప్తపదా బభూవ. సఖ్యంతే                          గమేయం. సఖ్యాల్తే మా యోషం.                        సఖ్యాన్మే మా యోష్ఠాః                         సమయావ. సంకల్పావ హై                            సంప్రియౌ రోచిష్ణూ                                      సుమనస్యమానౌ ఇష మూర్జ మభి                       సంవసానౌ సం నౌ                                  మనాంసి సంవ్రతా సముచిత్తాన్యకరమ్*
```
నాతో ఏడడుగులు నడచి నాకు మంచి స్నేహితురాలివి కావాలి. మనమిద్దరం కలిసి ఏడడుగులు నడిస్తే స్నేహితులమౌతాం. అప్పుడు నేను 
నీ స్నేహాన్ని ప్రేమను పొందుతాను. 
నీ స్నేహాన్నుంచి ఎన్నటికీ వియోగం పొందను. నా స్నేహాన్నుంచి 
నీ వెన్నడూ వియోగం పొందకు! పరస్పరం ప్రేమతో, అనుకూల దాంపత్యంతో ప్రకాశిస్తూ, నిండు మనస్సుతో ఆహారాన్ని, బలాన్ని పొందుతూ కలసి ఉందాం. కలసి ఆలోచించుకుందాం. మన మనస్సులు కలిసేలా నడుచుకుందాం. అలాగే అన్ని నియమాల్లోనూ బాహ్యేంద్రియాలు కూడా కలిసి ఉండేటట్లు నడుచుకుందాం.```

***********


*అరుంధతీ నక్షత్రం*

వివాహం జరిగిన రాత్రి వధూవరులను ఇంటి బయట తూర్పు లేదా ఉత్తరానికి తీసుకువెళ్లి మొదట ధృవ నక్షత్రాన్ని, తర్వాత అరుంధతీ నక్షత్రాన్నీ చూపిస్తారు.
```
ధృవనక్షత్రంలా వారు నిశ్చలమైన మనస్తత్త్వాలతో స్థిరంగా ఉండాలని, వధువు అరుంధతిలా మహా పతివ్రత కావాలనే ఆకాంక్ష ఇందులో కలదు.✍️```
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.🙏🙏*

No comments:

Post a Comment