Saturday, December 14, 2024

 నారద భక్తి సూత్రములు 
78 వ సూత్రము 
"అహింసా సత్య శౌచ దయాస్తిక్యాది చారిత్య్రణి పరిపాల నీయని"    

 భక్తుడు నిరంతరం సత్ప్రవర్తనతో అహింస,సత్యం,శౌచం,దయ,ఆస్తికత మొదలైనవి ఆచరించాలి.
హింసకు(మానసిక/శారీరక) దూరంగా ఉండుటయే అహింస.హింస ఆలోచలును కూడా విడవాలి భక్తుడు. 

సత్యం వున్నది వున్నట్లుగా,చూసినది చూసినట్లుగా,విన్నది విన్నట్లుగా పలుకుట అనేది సర్వజన విదితం.వేయి అశ్వమేధ యాగాలకంటే ఒక సత్యవాక్యం గొప్పది కాబట్టి భక్తుడు సత్యవాక్యాలనే పలకాలి.

శౌచం అంటే శరీరకము గాను మానసికంగానూ భక్తుడు శుచిగా ఉండాలి,జలం తోను ఔషధులతోను శరీరాన్ని పరిశుభ్రం చేసుకోవాలి,శుభ్రవస్త్రాలు ధరించాలి,భుజించే ప్రతీ పదర్దాన్ని ఆ పరమాత్ముని అనుగ్రహ ప్రసాదంగా స్వీకరించాలి భక్తుడు.

దయ - దయ హృదయ సంబంధి,సహృదయాయులకు  దయ,కరుణ,ప్రేమ సహజగుణాలు. నిస్వార్ధ భావంతో,మాధవసేవ భావం తో దీనులను దుఃఖితులను స్వర పర భేదం లేకుండా మిత్రు శత్రు భేదం వీడి సకల ప్రాణులను ఆదుకోవాలి భక్తుడు.                 
ధర్మ సందేహాలు కలిగినప్పుడు పండిత వచనాలేకాక ఆత్మ విజ్ఞానం తో సదసద్వివేకం తో ప్రవర్తించాలి.

నారద భక్తి సూత్రములు 
79 వ సూత్రము 
  
 "సర్వదా సర్వ భావేన నిశ్చంతైర్బగవానేనా భజనీయః "
సర్వవేళలా  అన్నివిధాలా సర్వ సమర్పణ భావన తో నిశ్చితంగా భావంతుణ్ణి భజించాలి.   
భగవంతుని దివ్య విభూతులూ తెల్సి విశ్వసించిన భక్తుడు భగవన్నామ ధ్యాన స్మరణాదులను తప్పించి మరోకార్యం చేయజాలడు భక్తుడు.
నీవు చూడకపోయినా విన్నావు కదా నమ్మి భక్తి నిధిని పొందుము.భక్తుడు కావడానికి నువ్వేమి కష్టపడనవసరం లేదు.విశ్వాసం తో  విశ్వమయుణ్ణి వినుతించు,మనసులోని చింతలు మానుకో,శిశువు తల్లి వడిలో నిశ్చయంగా ఆడుకున్నట్లు స్వామి పాదసన్నిధిలో ఉండిపో.రాముడుండు వరుకు భయం లేదు మనకు, సర్వాత్మనా సర్వ సాక్షుణ్ణి స్మరించు అంతే  అంటాడు నారదుడు.           

No comments:

Post a Comment